



Best Web Hosting Provider In India 2024

Sugar Addiction : తీపి తినడం, మద్యం తాగడం రెండూ ఒకటేనా! రెండూ శరీరంపై ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతాయా?
Sugar Addiction: చక్కెర తినడం, మద్యం తాగడం రెండూ సమానమే అంటే మీరు నమ్ముతారా? ఇవి రెండూ శరీరానికి సమాన స్థాయిలో ప్రమాదాలను కలుగజేస్తాయా? డాక్టర్లు, స్టడీలు దీని గురించి ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకోండి.
చక్కెర తినడం, మద్యం తాగడం రెండూ ఒకటేనా? రెండూ పదేపదే తీసుకోవాలనిపించే వ్యసనాలా? ఈ విషయాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికన్ శాస్త్రవేత్తలు వాస్తవాలను కనుగొన్నారు. ఆల్కహాల్ తాగకుండా, కేవలం తీపి మాత్రమే చిన్నారులపై కూడా ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో చిన్న వయస్సులోనే ఒబెసిటీ, డయాబెటిస్ ఎదుర్కొంటున్న చిన్నారులు, మద్యంతో పాటు తీపి ఎక్కువ తినే వ్యక్తులు పాల్గొన్నారు..
‘చక్కెర పదేపదే తినాలనిపించడం, మద్యం తీసుకోవడంతో సమానం’
కొందరు పిల్లలు లేదా పెద్దలు పదేపదే ఆహారం (షుగర్) తీసుకుంటూ ఉంటారు. ఇది ఓ రకంగా చూస్తే వ్యసనం లాంటిదేనట. ఆల్కహాల్ ను కూడా ఇదే విధంగా తాగుతూనే ఉండాలని కోరుకుంటారట. దీనిని బట్టి ఆహారం లేదా మద్యం ఎక్కువసార్లు తినాలనిపించడం లేదా తాగాలనిపించడం వ్యసనంగా పరిగణించారు. అది పిల్లల్లో 12శాతం ఉంటే, పెద్దవారిలో 14శాతంగా ఉంటుందట. ఆల్కహాల్ తాగేవారిని మాత్రమే పరిశీలిస్తే 14శాతం మందిలో పదేపదే తాగాలనే కోరిక కలుగుతుంటుందట. దీనిని బట్టి చూస్తే షుగర్ తీసుకోవడం అనేది ఆల్కహాల్ తాగడంతో సమానమైన వ్యసనంగా పరిగణించొచ్చని స్టడీ నిర్వహించిన వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్ అనేది ప్రతి చోటా దొరుకుతున్నప్పటికీ 80శాతం మంది రెగ్యూలర్ గా తీసుకోవడానికి ఇష్టపడరట. కానీ, 20శాతం మంది అదే పనిగా పెట్టుకుంటారట. అదే విధంగా ఆహారం తినే విషయంలోనూ ఒకేలా ప్రవర్తిస్తారట. పైగా ఆల్కహాల్ తాగే వారు మంచి ఫుడీలు కూడా అని స్టడీల్లో వెల్లడైంది. ఆహారం ఎక్కువగా తినేవారికి ఆల్కహాల్ తీసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుందట. షుగర్ అస్సలు తిననివారిలో కొందరిలో మాత్రమే ఆల్కహాల్ వ్యసనం ఉంటుందని తేలింది.
చక్కెర వ్యసనం లేకుంటే మద్య వ్యసనం ఉండదా..?
చక్కెర వ్యసనం లేకపోయినా, మద్యం వ్యసనంగా మారే అవకాశం ఉంది. చక్కెర వ్యసనం, మద్యం వ్యసనం రెండూ ఒకే విధంగా మాత్రమే ఉంటాయి. కానీ, ఈ వ్యసనాలు రెండూ పరస్పరం ఒక దానితో ఒకటి కచ్చితంగా సంబంధం ఉంటాయనడానికి లేదని వెల్లడించారు.
స్టడీలో గమనించిన విషయాలు:
శరీరంలో షుగర్ తిన్నప్పుడు, ఆల్కహాల్ తాగినప్పుడు తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యే తీరు సమానంగా ఉంటాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అస్సలు ఆల్కహాల్ తాగకుండా షుగర్ మాత్రమే తీసుకునే వారిలో కలిగే ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. వాటిని బట్టి ఆల్కహాల్ తీసుకోకపోయినా షుగర్ మాత్రమే తీసుకునే వారిలో ఆల్కహాల్ తాగితే కలిగే సమస్యలు కలుగుతున్నట్లు గమనించారు. షుగర్, ఆల్కహాల్ రెండూ జీర్ణక్రియలో ఒకేవిధంగా చర్య జరుపుతాయి. మైటోకాండ్రియా స్థాయిలో ఫ్రక్టోజ్, ఇథనాల్ ఒకే విధంగా వ్యవహరిస్తాయి. ఆశ్చర్యకరంగా షుగర్ మాత్రమే తినే చిన్నారుల్లో లక్షణాలను పరిశీలిస్తే, ఆల్కహాల్ తాగిన వారిలో కలిగే సమస్యలు కనిపిస్తున్నాయని తెలిసింది. డయాబెటిస్, ఫ్యాటీ లివర్ సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టమైంది.
ఆల్కహాల్, చక్కెర వ్యసనాల మధ్య బలమైన సంబంధం లేకపోయినా పదేపదే తీసుకోవాలనే కోరిక సాధారణంగానే అనిపిస్తుంటుంది. ఆహారం, మద్యం రెండూ శరీరంపై ఒకే రకమైన ప్రభావం చూపిస్తాయి. అదే విధంగా జీర్ణక్రియలోనూ ఒకే విధంగా వ్యవహరిస్తాయట. ఒకే రకమైన ఆరోగ్య సమస్యలను కలుగజేస్తాయట.
సంబంధిత కథనం
టాపిక్