



Best Web Hosting Provider In India 2024

Shivarathri Prasadam: మహాశివరాత్రికి శివునికి ఇష్టమైన ఈ ప్రసాదాలను పెట్టి పూజించండి, కోరికలు నెరవేరుతాయి
Shivarathri Prasadam: మహాశివరాత్రినాడు ఆ శివుడికి శక్తి మేర పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. దేవునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తే కోరిన కోరికలు త్వరగా తీరుస్తాడని అంటారు.
మహాశివరాత్రి హిందువుల ముఖ్యమైన పండగల్లో ఒకటి. శివుని ఆరాధన మానసిక ప్రశాంతతను ఇస్తుందని అంటారు. శివుడిని పూజించేందుకు భక్తులు ప్రతినెలా మాస శివరాత్రిని నిర్వహించుకుంటారు. కానీ ఏడాదికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి మాత్రం అత్యంత ముఖ్యమైనది.
ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్ధ తిధి నాడు మహాశివరాత్రి నిర్వహించుకుంటారు. ఈ శివరాత్రినాడే శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని చెప్పుకుంటారు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివుడిని పార్వతిని పూజిస్తారు. అలాగే శివ పూజలో శివునికి ఇష్టమైన ప్రసాదాలను పెడతారు. శివునికి ఏ ప్రసాదాలంటే ఇష్టమో తెలుసుకోండి.
శివరాత్రి ఉపవాసం ఎప్పుడు?
మహాశివరాత్రి ఉపవాసం ఫిబ్రవరి 26వ తేదీ రాత్రికి పాటిస్తారు. ఆరోజు పూజ చేసేటప్పుడు శివునికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పించాలి. మరుసటి రోజు ఉపవాసాన్ని విరమించాక కూడా పూజ చేస్తారు. అప్పుడు కూడా శివునికి పూజ చేసుకొని నైవేద్యాలను సమర్పించాలి. ఏ నైవేద్యాలను సమర్పిస్తే శివాశీస్సులు దక్కుతాయో ఇక్కడ ఇచ్చాము.
పాయసం
శివునికి తెలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. మహాశివరాత్రి రోజున తెలుపు రంగు ఆహారాలను సమర్పిస్తే ఎంతో మంచిది. ఆ శివుని ప్రసన్నం చేసుకోవడానికి సాబుదానా అంటే సగ్గుబియ్యం పాయసం లేదా పూల్ మఖానా పాయసం వంటివి చేసి వడ్డించండి. అన్నంతో పాయసం వండినా మంచిదే.
తాండై
తాండై అంటే శివునికి ఎంతో ఇష్టమని చెప్పుకుంటారు. పురాణాలు చెబుతున్న ప్రకారం సముద్ర మథనం సమయంలో బయటకు వచ్చిన విషాన్ని శివుడు తాగి తన గరళంలోనే దాచుకున్నాడు. దీనివల్ల అతను శరీరంలో మంట కలుగుతుంది. దాన్ని శాంతింప చేయడానికి దేవతలు శివునికి చల్లని పదార్థాలు తినిపించారని చెప్పుకుంటారు. ముఖ్యంగా తాండై వంటి చల్లని వస్తువులు శరీరాన్ని శివునికి అర్పించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తాడని అంటారు.
రవ్వ కేసరి
రవ్వతో చేసే కేసరి లేదా హల్వా వంటి స్వీట్లను కూడా శివునికి ప్రసాదంగా సమర్పించవచ్చు. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన ఈ హల్వా లేదా కేసరి వంటివి శివునికి ఎంతో నచ్చుతాయి. అతని ఆశీస్సులను మీరు పొందవచ్చు.
కోవా బర్ఫీ
కోవా బర్ఫీలు కూడా లేత తెలుపు రంగులోనే ఉంటాయి. ఇవి శివునికి సమర్పించడం చాలా శుభప్రదంగా చెప్పుకుంటారు. కోవాలతో చేసిన బర్ఫీలు లేదా పాలతో చేసిన స్వీట్ లను శివునికి సమర్పించేందుకు ప్రయత్నించండి.
పంచామృతం
శివునికి ఏ స్వీట్లను ప్రసాదంగా పెట్టినా కూడా పంచామృతం ఖచ్చితంగా ఉండాల్సిందే. పాలు, చక్కెర, తేనే, పెరుగు వంటివన్నీ కలిపి చేసే ఈ పంచామృతం శివునికి ఎంతో ఇష్టం. దీన్ని పవిత్రంగా భావిస్తారు.
శివుని పూజలో బిల్వ పత్రాలు, ఉమ్మెత్త వంటివి ఉండాలి. రంగురంగుల పువ్వులతో శివునికి పూజ చేయాలి. ఇవన్నీ కూడా అతనిలో ఎంతో సంతోషాన్ని పెంచుతాయి.
సంబంధిత కథనం