


Best Web Hosting Provider In India 2024

OTT Action Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. నెలలోపే..
OTT Action Thriller: ఓటీటీలోకి తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఐదు భాషల్లో వస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ సోమవారం (ఫిబ్రవరి 24) అనౌన్స్ చేసింది.
OTT Action Thriller: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన మూవీ విదాముయర్చి (Vidaamuyarchi). త్రిష కృష్ణన్ ఫిమేల్ లీడ్ గా కనిపించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని సోమవారం (ఫిబ్రవరి 24) అనౌన్స్ చేసింది.
“బ్రేక్స్ లేవు. లిమిట్స్ లేవు. కేవలం విదాముయర్చి. ఈ విదాముయర్చి మూవీని నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 3 నుంచి తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలలో చూడండి” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని చెప్పింది.
నెల రోజుల్లోపే ఓటీటీలోకి..
అజిత్ నటించిన విదాముయర్చి మూవీ భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైంది. అయితే సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కేవలం రూ.135 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
దీంతో మూవీని నెల రోజుల్లోపే అంటే మార్చి 3 నుంచే నెట్‌ఫ్లిక్స్ లోకి తీసుకువస్తున్నారు. ఇది చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. మరీ ఇంత త్వరగా వస్తోందా అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ వస్తున్నందుకు ఇంత త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారా అంటూ మరో అభిమాని ప్రశ్నించారు.
విదాముయర్చి మూవీ గురించి..
విదాముయర్చి మూవీలో అజిత్, త్రిషతోపాటు అర్జున్, రెజీనాలాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాను మగిళ్ తిరుమణి డైరెక్ట్ చేశాడు. లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. నిజానికి పొంగల్ సందర్భంగా రిలీజ్ కావాల్సిన సినిమాను ఫిబ్రవరి 6న రిలీజ్ చేశారు. తొలి వారం రూ.70 కోట్లు వసూలు చేసింది.
1997లో వచ్చిన అమెరికన్ మూవీ బ్రేక్‌డౌన్ కు రీమేక్ ఈ విదాముయర్చి. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అర్జున్ అనే వ్యక్తి పాత్రలో అజిత్ నటించాడు. అజర్‌బైజాన్ లో ప్రమాదకర గ్రూప్ చెరలో బందీ అయిన తన భార్యను అతడు ఎలా విడిపించుకున్నాడన్నదే ఈ మూవీ స్టోరీ. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొత్తానికి మార్చి 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తోంది.
సంబంధిత కథనం