



Best Web Hosting Provider In India 2024

Foods during Periods: పీరియడ్స్ సమయంలో మహిళలు చల్లని పదార్థాలు తినకూడదా? తింటే ఏమవుతుంది?
Foods during Periods: చాలామంది మహిళలకు పీరియడ్స్ సమయంలో ఏ ఆహారం తినాలన్న దానిపై అనేక అనుమానాలు ఉంటాయి. అందులో ఒకటి చల్లని పదార్థాలు తినకూడదని. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
పీరియడ్స్ సమయంలో మహిళలు కొన్ని రకాల ఆహారాలు తినేందుకు ఇష్టపడరు. వాటిపై ఎన్నో అపోహలు ఉంటాయి. అలాగే చల్లటి నీరు తాగడం ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ వంటి చల్లని పదార్థాలు తినకూడదని కూడా భావిస్తూ ఉంటారు.
అలా చల్లటి పదార్థాలు తినడం, తాగడం చేస్తే కడుపునొప్పి ఎక్కువైపోతుందని, పొట్ట దగ్గర తిమ్మిరిగా అనిపిస్తుందని చెబుతారు. అలాగే రుతుక్రమం క్రమరహితంగా మారిపోతుందని కూడా అంటారు. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం.
పీరియడ్స్‌లో చల్లని ఆహారాలు
పీరియడ్స్ సమయంలో చల్లని పదార్థాలు తినకూడదని కొందరిలో ఒక అపోహ ఉంది. పీరియడ్స్ సమయంలో చల్లని పదార్థాలు లేదా పానీయాలు తాగడం వల్ల శరీరం ఒక్కసారిగా షాక్ కు గురైనట్టు అవుతుంది. దీనివల్ల రుతుచక్రం తీవ్రంగా ప్రభావితం అవుతుందని అంటారు. చల్లని ఉష్ణోగ్రత కారణంగా గర్భాశయ కండరాలు సంకోచిస్తాయని, ఇవి క్రమ రహిత రుతుస్రావానికి కారణం అవుతాయని భావిస్తారు. అందుకే వేడి పానీయాలు తినాలని చెబుతూ ఉంటారు. ఐస్ క్రీము, చల్లని నీరు, చల్లని పండ్లు వంటివి తినకూడదని సలహా ఇస్తారు.
ఈ సమస్య వస్తుంది
శాస్త్రీయంగా ఇదంతా పూర్తిగా నిజం కాదు. శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రించడానికి ఒక వ్యవస్థ పని చేస్తుంది. మనం తినే ఆహారం మన శరీర ఉష్ణోగ్రతను నిర్ణయించదు. కొంతమందికి చల్లని ఆహారం తిన్న తర్వాత అసౌకర్యంగా ఉంటుంది. దీనికి కారణం వారి జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉండి ఉండవచ్చు. అలాగే పీరియడ్స్ సమయంలో కూడా కొంతమందికి చల్లని ఆహారం తింటే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు. అలసిపోయినట్లు కూడా అనిపిస్తుంది. దీనికి కారణం వారి సున్నితమైన శరీరము సున్నితమైన జీర్ణ వ్యవస్థ కావచ్చు.
అంతా అపోహేనా?
పీరియడ్స్ సమయంలో చల్లటి వస్తువులు తినడం వల్ల పొట్ట నొప్పి అధికంగా వస్తుంది అనేది కేవలం అపోహ. గర్భాశయ సంకోచాల వల్ల పొట్టనొప్పి వస్తుంది. ఈ గర్భశయ సంకోచాలను ప్రేరేపించే రసాయనాలు వేరే ఉంటాయి. వాటి ఉత్పత్తి వల్లే గర్భాశయ సంకోచం జరుగుతూ ఉంటుంది. గర్భాశయం సంకోచించినప్పుడల్లా పొట్ట నొప్పి వస్తుంది.
సాధారణంగా పీరియడ్స్ సమయంలోనైనా, పీరియడ్స్ సమయం కాకపోయినా కూడా చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది ఫ్రిజ్ నుండి తీసిన నీళ్లను తాగేస్తూ ఉంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. మీకు పీరియడ్స్ సమయంలో సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీళ్లు తాగడమే మంచిది. అలాగే టీ, కాఫీలు మానుకుంటే మంచిది. ఎందుకంటే టీ లేదా కాఫీ తాగడం వల్ల నొప్పి నుండి ఉపశమనం వస్తుందని అనుకుంటారు. చాలామంది నిజానికి అవి నొప్పిని పెంచి అవకాశం ఉంటుంది.
పీరియడ్స్ సమయంలో కొందరికి తీపిగా ఉండే పదార్థాలు తినాలనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు స్వీట్లు జోలికి వెళ్ళకండి. పేస్ట్రీలు, స్వీట్లు తినే బదులు డార్క్ చాక్లెట్ చిన్న ముక్క తినండి. లేదా దానిమ్మ, అరటి, ఆపిల్, మామిడి పండ్లను తినేందుకు ప్రయత్నించండి. ఇవి పీరియడ్స్ పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్