


Best Web Hosting Provider In India 2024

Everyday Habits causes Acne: మొటిమలు ఎక్కువ అవుతున్నాయా? మీకున్న మూడు మంచి అలవాట్లే ఇందుకు కారణం!
Habits causes Acne: మొటిమల సమస్య ఎక్కువ అవుతుందా? ఇందుకు కారణం మీకున్న మూడు మంచి అలవాట్లేనేమో చెక్ చేసుకోండి. వీటిని మీరు రోజూ చేస్తున్నట్లయితే వెంటనే మానేయండి. లేదంటే మొటిమలు మరింత పెరుగుతాయి.
చాలా మందికి చర్మం సున్నితంగా ఉంటుంది. తరచూ వీరికి మొటిమలు అవుతుంటాయి. అయితే సాధారణ చర్మం కలిగిన వారికన్నా మొటిమల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చర్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే కేవలం చర్మపు ఉత్పత్తులు, ఆహారంలో మార్పులు మాత్రమే కాదండోయ్. రోజూవారీ అలవాట్ల విషయంలో కూడా శ్రద్దగా ఉండాలట. ఎందుకో ఎలాగో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
నిజానికి మొటిమలను నివారించడం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే కాకుండా, రోజువారీ అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. అంతేకాదు రోజూ మీరు చేసే కొన్ని పనులు, అందులోనూ మంచి అలవాట్లు కూడా మొటిమల సమస్యను పెంచుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ గారేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మొటిమలతో ఉన్న చర్మం ఉన్నవారు నివారించాల్సిన మూడు సాధారణ తప్పులను పంచుకున్నారు.
మొటిమలకు కారణమయ్యే రోజూవారి మంచి అలవాట్లు..
డాక్టర్ గారేకర్ మొటిమల సమస్యకు కారణమయ్యే మూడు రోజువారీ మంచి అలవాట్లను గుర్తించారు. ఇవి చాలా సాధారణ, ప్రాథమిక అలవాట్లుగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఇవి కాలక్రమేణా మొటిమలు, చర్మపు చికాకు, చర్మంలో అసమతుల్యతకు దోహదం చేస్తాయి.అవేంటంటే..
1. ముఖం కడుక్కోవడం:
చర్మాన్ని శుభ్రపరుచుకోవడం కోసం ముఖాన్ని కడుక్కోవడం అవసరం. కానీ కొందరు రోజుకు మూడు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కూడా కడుగుతుంటారు. ఇది మీకున్న మంచి అలవాటే అయినప్పటికీ దీని వల్ల మొటిమలు ఎక్కువ అవుతాయట. ఎందుకంటే చర్మం తన సొంత సహజమైన నూనెలను కలిగి ఉంటుంది. దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, మేకప్ వంటి వాటి నుంచి ఇవి కాపాడతాయి. కానీ ఎక్కువ సార్లు ముఖాన్ని కడగడం వల్ల చర్మం తన సహజ నూనెలను కోల్పోతుంది. ఫలితంగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. హానికరమైన చికాకులను నిలయంగా మారి మొటిమల సమస్యను పెంచుతుంది.
2. శారీకర శ్రమ లేదా వ్యాయామం సమయంలో మేకప్ వేసుకోవడం:
శారీరక శ్రమ లేదా వ్యాయామం అనేవి చాలా మంచి అలవాట్లు. కానీ ఇవి చేస్తున్న సమయంలో అందంగా కనిపించడం కోసం కొందరు మేకప్ వేసుకుంటూ ఉంటారు. నిజానికి బయట షూటింగ్, రికార్డింగ్ వంటివి చేసేటప్పుుడు, జిమ్ లేదా డాన్స్ వంటివి చేసేటప్పుడు మేకప్ వేసుకోవడం చెడ్డ అలవాటు ఏం కాదు. కానీ ఇలా శారీరక శ్రమ సమయంలో మేకప్ వేసుకోవడం వల్ల చర్మపు రంథ్రాలు మూసుకుపోయి, చెమట, సీబమ్, మేకప్ అన్నీ కలిసిపోతాయి. ఇవి మొటిమలు రావడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
3. చర్మాన్ని ఖాళీగా ఉంచుకోవడం:
ఎప్పడు బయట దుమ్ము, థూలి, బ్యాక్టీరియాతో పాటు చర్మంపై రకరకాల క్రీములతో నిండి ఉండే చర్మానికి కాస్త ఉపశమనం ఇవ్వాలని చాలా మంది ముఖం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏమీ రాసుకోకుండా అలా ఖాలీగా వదిలేస్తారు. నిజానికి ముఖాన్ని క్రీముల రహితంగా ఉంచుకోవాలనేది మంచి ఉద్దేశమే ఇది మంచి అలవాటే. కానీ.. చర్మంపై ఎలాంటి మాయిశ్చరైజర్ లేకుండా ఇలా ఖాళీగా వదిలేయడం వల్ల పొడిగా తయారవుతుందట. ఇది కాలక్రమేణా మొటిమలకు కారణం అవుతుందట. కనుకు ఎల్లప్పుడూ ముఖానికి తేలికపాటి, హ్రైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ను అప్లై చేసి ఉండాలని, ఇది మొటిమలతో పాటు ఇతర చర్మపు చికాకుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని గారేకర్ వివరించారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం