



Best Web Hosting Provider In India 2024

Thandel OTT Release Date: ఓటీటీలోకి 100 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్‌పై కొత్త బజ్
Thandel OTT Release Date: తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ పై తాజాగా మరో బజ్ నెలకొంది. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Thandel OTT Release Date: తండేల్ మూవీ ఓవైపు బాక్సాఫీస్ దగ్గర ఇంకా మంచి కలెక్షన్లు సాధిస్తుండగానే ఆ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై తాజాగా మరో బజ్ నెలకొంది. ఈ సినిమా వచ్చే నెలలో ఓటీటీలోకి రావడం ఖాయమైనా కచ్చితమైన తేదీ ఇదే అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ ఓటీటీ మార్చి 14 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గతంలో మార్చి 6 నుంచే సినిమా రావచ్చన్న వార్తలు వచ్చినా.. తాజాగా మార్చి 14 ఖాయం అన్నట్లుగా చెబుతున్నారు.
ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.50 కోట్లకు సొంతం చేసుకుంది. నాగ చైతన్య సినిమాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల హక్కులను ఆ ఓటీటీ దక్కించుకుంది.
తండేల్ బాక్సాఫీస్ కలెక్షన్లు
మరోవైపు తండేల్ బాక్సాఫీస్ వసూళ్ల జోరు ఈ మధ్య కాస్త తగ్గింది. ఫిబ్రవరి 16వ తేదీ నాటికే మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. అయితే తర్వాత వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మూడో వారం కూడా థియేటర్లలో కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా ఓటీటీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా తండేల్. ఇదిలా ఉంటే, రూ. 37 కోట్ల బిజినెస్ చేసుకున్న తండేల్ సినిమాకు రూ. 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అయితే, ఈ టార్గెట్ ఎప్పుడో పూర్తి కాగా 14 రోజుల్లో తండేల్ సినిమాకు రూ. 12.82 కోట్ల లాభాలు వచ్చాయి. దాంతో సూపర్ హిట్‌గా తండేల్ సినిమా నిలిచింది.
తండేల్ మూవీ ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. శ్రీకాకుళానికి చెందిన జాలర్లు గుజరాత్ తీరంలో చేపలు పడుతూ పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి నేవీకి చిక్కుతారు. తర్వాత వాళ్లు పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతారు. భారత ప్రభుత్వం జోక్యంతో తిరిగి ఇళ్లకు చేరతారు. ఈ స్టోరీకి లవ్ స్టోరీని జోడిస్తూ చందూ మొండేటి తండేల్ మూవీని తెరకెక్కించాడు.
సంబంధిత కథనం