




Best Web Hosting Provider In India 2024

Bald head in Small age: కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల ఎందుకు వస్తుంది? కారణాలు తెలుసుకోండి
Bald head in Small age: కొందరికి చిన్న వయసులోనే బట్టతల రావడం మొదలైపోతుంది. కొంతమందికి 20 ఏళ్లలోపే వస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసుకోండి.
అబ్బాయిలకు బట్టతల అంటేనే భయం. మగవారికే ఎక్కువగా బట్టతల వస్తుంది. జుట్టు రాలుతూ ఉంటే బట్టతల ఎక్కడ వచ్చేస్తుందని భయపడే మగవారు ఎంతోమంది ఉన్నారు. కొందరికి 50 ఏళ్లు దాటాక బట్టతల వస్తూ ఉంటే మరి కొందరికి 20 ఏళ్లకే వచ్చేస్తుంది. ఇలా చిన్న వయసులోనే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసుకోండి.
బట్టతల వచ్చే ముందు కనిపించే లక్షణాలు
ఒక వ్యక్తికి బట్టతల వచ్చే అవకాశం ఉంటే కనిపించే మొదటి లక్షణం తల నుండి వెంట్రుకలు ఎక్కువ మొత్తంలో రాలిపోతాయి. కొన్నిసార్లు గుత్తులు గుత్తులుగా, ప్యాచెస్ లాగా కూడా రాలిపోతాయి. అలా రాలిపోయాక అక్కడ నున్నగా చర్మం ఏర్పడుతుంది. హెయిర్ ఫోలికల్స్ కనిపించవు. ఇలా ప్యాచెస్ లాగా జుట్టు రాలిపోతే ఆ వ్యక్తికి బట్టతల వచ్చేస్తుందని అర్థం. దీనికి కారణాలు రెండు కావచ్చు. మొదటిది జన్యుపరమైనది. రెండవది పోషకాహార లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.
బట్టతల వచ్చే వ్యక్తుల్లో జుట్టు ఒక నిర్దిష్ట నమూనాలో రాలుతుంది. తల మధ్య భాగంలో మాత్రమే జుట్టు రాలడం లేదా నుదుటికి పైన ఉన్న భాగంలో పూర్తిగా జుట్టూ రాలిపోవడం వంటివి కనిపిస్తాయి. వెంట్రుకలు ఎక్కువ పరిమాణంలో రాలుతున్నాయి. అంటే బట్టతల సమస్య మీ వంశంలో ఉందని అర్థం చేసుకోవాలి.
దురద నొప్పి కూడా
బట్టతల వచ్చే సమయంలో జుట్టు రాలిపోయాక ఆ ప్రదేశంలో దురదగా అనిపించవచ్చు. లేదా తేలికపాటి నొప్పి కూడా ఉండవచ్చు. బట్టతల జన్యుపరమైనదైతే దానిని అడ్డుకోవడం అసంభవం. అదే పోషకాహార లోపం వల్ల అయితే సరైన ఆహారాన్ని తినడం ద్వారా బట్టతలను అడ్డుకోవచ్చు. అలాగే మానసికంగా తీవ్రంగా గాయపడిన వారికి కూడా జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. వారు కూడా బట్టతల బారిన పడతారు.
మీ ఆహారంలో ఐరన్, పోలిక్ ఆమ్లం, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. వీటిలో ఏదైనా లోపం ఏర్పడినా కూడా అది జుట్టు రాలిపోయి బట్టతలకు కారణమవుతుంది. చర్మ ఇన్ఫెక్షన్లు, సోరియాసిస్, రింగ్ వార్మ్స్ వంటి చర్మ సంబంధమైన సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. ఇవి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నీటి కొరత వల్ల
శరీరంలో నీటి కొరత ఎప్పుడూ ఉండకూడదు. డిహైడ్రేషన్ సమస్య అనేది జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగను ఆహారంలో భాగం చేసుకోండి. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో జుట్టు కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే రోజూ తినే ఆహారంలో మినప్పప్పు, మొలకెత్తిన గింజలు, నట్స్, సీడ్స్ వంటివి అధికంగా తినండి. ఇవన్నీ కూడా జుట్టు బలంగా మందంగా పొడవుగా పెరిగేలా చేస్తాయి. అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
జన్యుపరంగా బట్టతల వచ్చే అవకాశం ఉంటే దాన్ని ఏ వైద్యులు కూడా అడ్డుకోలేరు. మీ వంశంలో మీ తండ్రికి, మీ తాతలకు బట్టతల ఉన్నట్టు గుర్తిస్తే మీకు కూడా వస్తుందని అర్థం. కాబట్టి బట్టతల గురించి బాధపడుతూ మానసికంగా కుంగిపోకండి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం