





Best Web Hosting Provider In India 2024

Paranormal Tourism: మనదేశంలో పెరిగిపోతున్న పారానార్మల్ టూరిజం, దెయ్యాల కోసం వెతకడమే ఈ టూరిజం ప్రత్యేకత
Paranormal Tourism: మనదేశంలో పారానార్మల్ టూరిజం పట్ల క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఈ పారానార్మల్ టూరిజం ఇంకా ఊపందుకుందని చెప్పుకోవాలి. మనదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఈ టూరిజం అధికంగా ఉందో తెలుసుకోండి.
పర్యాటకంలో పారానార్మల్ టూరిజం కూడా ఒక భాగంగా చేరిపోయింది. మనదేశంలో పర్యాటకం అతిపెద్ద సేవారంగం. దేశంలో ఎనిమిది శాతం మంది పర్యాటకం పైనే ఆధారపడి ఉపాధిని పొందుతున్నారు. అయితే భారతదేశంలో పారా నార్మల్ టూరిజం కూడా ఇటీవల కాలంలో బాగా ఆదరణ పొందుతోంది. దీనికి తగ్గట్టు కొన్ని గమ్యస్థానాలు కూడా ఉన్నాయి.
పారానార్మల్ టూరిజం అంటే
పారా నార్మల్ అనే పదం వింటేనే మీకు అర్థమైపోతుంది. పారా నార్మల్ అనేది అసాధారణ విషయాలకు మాత్రమే ఉపయోగిస్తారు. భయానక ప్రదేశాలను సందర్శించడం, దెయ్యాలు ఉన్న గ్రామాలు అంటూ ప్రచారం జరిగిన ప్రాంతాలకు వెళ్లడం, అసాధారణ సంఘటనలను జరిగిన ప్రదేశాల్లో పర్యటించడం వంటివే పారానార్మల్ టూరిజం. కొందరు ప్రజలకి ఈ పారానార్మల్ టూరిజం పై ఎంతో ఆసక్తి ఉంటుంది.
మనదేశంలో కూడా పారా నార్మల్ టూరిజం పట్ల క్రేజ్ బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా దీనికి కారణం సోషల్ మీడియా అనే చెప్పుకోవాలి. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వంటి వాటిలో పోస్ట్ చేసేందుకు ఈ పారానార్మల్ టూరిజం బాట ఎక్కువమంది పడుతున్నారు. చారిత్రక విషయాలను, మర్మ విషయాల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడం కూడా ఈ టూరిజం పెరగడం గనుక ముఖ్య ఉద్దేశం.
సినిమాల్లో కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్న హర్రర్ థీమ్ మూవీలు కూడా ఎందుకు కారణమని చెప్పుకోవచ్చు మన దేశంలో కొన్ని ప్రాంతాలు పారానార్మల్ గమ్యస్థానాలుగా పేరుపొందాయి
రాజస్థాన్‌లోని భంగర్ కోట
మనదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దెయ్యాల కోటగా పేరు తెచ్చుకుంది. ఈ కోటలో ఒక బ్రిటిష్ వ్యక్తి ఆత్మ సంచరిస్తుందని చెప్పుకుంటారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా అదే విషయాన్ని చెబుతారు. కోట నుంచి శబ్దాలు వస్తున్నాయని చెబుతారు. సూర్యాస్తమయం తర్వాత ఆ కోట దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అని అంటారు.
పూణేలో ఉన్న శనివార్ వాడ కోట
ఈ కోట కూడా ఈ కోవలోకి చెందినదే. రఘునాధ రావు అనే వ్యక్తి ఈకోటలోనే ఒక యువరాజును చంపాడని చెప్పుకుంటారు. ఆ రాజు ఆత్మ ఇప్పటికీ అక్కడే ఉందని, అతని స్వరం అప్పుడప్పుడు వినిపిస్తుందని అంటారు.
అసోంలోని జటింగా గ్రామం
అసోంలో ఉండే జటింగా గ్రామం గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ గ్రామానికి వచ్చి పక్షులన్నీ ఆత్మహత్య చేసుకుంటాయని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నిజంగానే ప్రతి ఏడాది అనేక పక్షులు ఇక్కడ ఊహించని రీతిలో మరణిస్తూ ఉంటాయి.
గుజరాత్‌లోని డూమాస్ బీచ్
గుజరాత్‌లోని డూమాస్ బీచ్‌ను కూడా చాలా భయంకర ప్రదేశంగా చెప్పుకుంటారు. ఆ బీచ్ లో నుంచి రాత్రి అయితే చాలు రకరకాల వింత శబ్దాలు వస్తాయని అంటారు. అందుకే ఆ బీచ్ కి వెళ్లి వీడియోలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువే.
సంబంధిత కథనం