
ఎన్టీఆర్ జిల్లా / విజయవాడ :
ది.27-8-2022(శనివారం) ..
నందిగామ నియోజకవర్గంలోని రైతాంగ సమస్యలను కలెక్టర్ ఢిల్లీ రావు దృష్టికి తీసుకెళ్లి సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పంట కోత ప్రయోగాలు మరియు ఈ క్రాప్ నమోదు తదితర విషయాలలో వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి ..
పంటల భీమా లో నమోదు కాక నష్టపోయిన మిరప రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
విజయవాడ లోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నందిగామ నియోజకవర్గ రైతాంగ సమస్యలపై జిల్లా వ్యవసాయ అధికారులు మరియు నందిగామ నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారితో కలిసి కలెక్టర్ ఢిల్లీ రావు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు ..
ఈ సందర్భంగా పంట కోత ప్రయోగాలలో వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ,ఈ క్రాఫ్ నమోదు లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులు ఏ పంట అయితే వేస్తున్నారో – ఆ పంటనే ఈ క్రాప్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ,ఒక పంటకు బదులుగా మరొక పంటను నమోదు చేయకూడదని , ఎటువంటి సాంకేతిక కారణాల వలన పంటల బీమా పథకం నిధులు విడుదలలో రైతులు నష్టపోతున్నారని , రైతులకు నష్టం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ,గతంలో విడుదలైన పంటల బీమా లో నందిగామ ప్రాంత రైతులు నష్టపోయారని , వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు కోరారు ,
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు – నందిగామ నియోజకవర్గ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు ..