







Best Web Hosting Provider In India 2024

Action Thriller OTT: సోనూ సూద్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది – ఎందులో చూడాలంటే?
Action Thriller OTT: సోనూ సూద్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫతే సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌హీరోయిన్‌గా నటించింది.

Action Thriller OTT: సోనూ సూద్ హీరోగా నటించిన ఫతే మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ బాలీవుడ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం కేవలం హిందీ వెర్షన్ మాత్రమే జియో హాట్‌స్టార్‌లో విడుదలైంది. త్వరలోనే దక్షిణాది భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సోనూ సూద్ డైరెక్టర్…
ఫతే మూవీలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు సోనూ సూద్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతోనే డైరెక్టర్‌గా అరంగేట్రం చేశాడు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్, నాగినీడు కీలక పాత్రలు పోషించారు.
యాభై కోట్ల బడ్జెట్…
థియేటర్లలో ఫతే మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 30 కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది. సోనూసూద్ భార్య సోనాలి సూద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. ఆమెకు ఈ సినిమా నష్టాలను తెచ్చిపెట్టింది. ఫతే సినిమాకు ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. జాన్ స్టీవర్ట్ బీజీఎమ్ సమకూర్చగా…యోయో హనీ సింగ్, వివేక్ హరిహరన్, షబ్బీర్ అహ్మద్, హరూన్ గవీన్ పాటలు అందించారు.
ఫతే కథ ఇదే…
సైబర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సోనూ సూద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఫతే సింగ్ (సోనూ సూద్) పంజాబ్‌లో పాల వ్యాపారం చేస్తుంటాడు. ఫతే సింగ్ ఊళ్లోని చాలా మంది ప్రజలు ఓ లోన్ యాప్ కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఫతే సింగ్ ఇంట్లోనే ఉండే నిమ్రత్ కౌర్‌ను లోన్ యాప్ నిర్వహకులు కిడ్నాప్ చేస్తారు. ఆమె ఆచూకీ కోసం ఇన్వేస్టిగేషన్ మొదలుపెడతాడు ఫతే సింగ్. ఈ జర్నీలో అతడు తెలుసుకున్న నిజాలేమిటి? ఈ కేసును సాల్వ్ చేయడంలో ఫతే సింగ్ కు సహాయం చేసి ఎథికల్ హ్యాకర్ ఖుషి శర్మతో (జాక్వెలిన్ ఫెర్నాండేజ్) పాటు సత్యప్రకాష్, రజా ఎవరు? ఫతే సింగ్ గత ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
రొటీన్ యాక్షన్ మూవీ…
ఈ సినిమా కాన్సెప్ట్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి. తాను అనుకున్న పాయింట్‌ను థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై చెప్పడంలో దర్శకుడిగా సోనూ సూద్ విఫలమయ్యాడు. ట్విస్ట్‌లను సరిగ్గా రాసుకోకపోవడంతో రొటీన్ యాక్షన్ మూవీగా ఫతే మిగిలిపోయింది. వయలెన్స్ ఎక్కువ కావడం కూడా మైనస్‌గా మారింది.
విలన్‌గా…
తెలుగులో విలన్‌గా పలు సినిమాలు చేశాడు సోనూ సూద్. అతడు, అరుంధతి, జులాయి, కందిరీగతో పాటు పలు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. అవార్డులను అందుకున్నది. హిందీ, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేశాడు. కొన్నాళ్లుగా సినిమాల వేగాన్ని తగ్గించాడు సోనూ సూద్.
సంబంధిత కథనం
టాపిక్