







Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial March 7: శ్రీధర్‌ను ఆటాడుకున్న కార్తీక్.. పారును ఏడిపించిన శివన్నారాయణ.. కార్తీక్ మీద పడిన దీప
Karthika Deepam 2 Today Episode March 7: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శ్రీధర్‌తో ప్లేట్లు కడిగిస్తాడు కార్తీక్. దీపను అన్నమాటలకు కౌంటర్ ఇస్తాడు. ఆస్తులకు వీలునామా రాస్తాడు శివన్నారాయణ. ప్రాణదాత విషయంలో దీపను మరోసారి కార్తీక్ ఆటపట్టిస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

కార్తీక దీపం 2 నేటి (మార్చి 7) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్ రెస్టారెంట్‍లో తింటారు శ్రీధర్, కావేరి. చిన్నమ్మ కావేరి తిన్నదానికి బిల్ వద్దని, నువ్వు తిన్న సగం బిల్ కట్టాలని తండ్రి శ్రీధర్‌తో కార్తీక్ చెబుతాడు. రూ.620 బిల్ కట్టే వెళ్లాలని చెబుతాడు. తాను ఫోన్ మరిచిపోయానని శ్రీధర్ అంటాడు. కావేరిని కట్టాలని చెబుతాడు. దీపను నానా మాటలు అన్నందుకు బుద్ధి చెప్పాలని అనుకున్న కావేరి.. తాను కూడా ఫోన్ తీసుకురాలేదని అంటుంది. తర్వాత ఇవ్వండని దీప అంటే.. కట్టాల్సిందేనని కార్తీక్ అంటాడు. అందరినీ ఇలాగే అంటే మనం చిన్నమ్మ ఇచ్చిన రూ.41లక్షల బాకీ ఎప్పుడు తీర్చాలని శ్రీధర్‌కు కౌంటర్లు వేస్తాడు కార్తీక్.
ఆ డబ్బుతో ఈయనకు సంబంధం లేదు
బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూడడానికి వచ్చానని నేను అన్న మాటను తిప్పి అప్పజెబుతున్నాడు అని శ్రీధర్ కోప్పడతాడు. మాటలు కూడా అప్పు లాంటివే అని, వడ్డీతో సహా తిరిగి వస్తాయని కార్తీక్ అంటాడు. నువ్వు మాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో ఈ రూ.620 తగ్గించుకో అని శ్రీధర్ అంటాడు. నేను డబ్బు ఇవ్వాలింది నీకు కాదు.. చిన్నమ్మకు అని కార్తీక్ అంటాడు. ఎవరైతే ఏముందని శ్రీధర్ చెబుతాడు తాను ఇచ్చిన డబ్బుకు ఈయనకు ఏ సంబంధం లేని భర్త శ్రీధర్‌కు షాకిస్తుంది కావేరి. దీంతో శ్రీధర్ అవాక్కవుతాడు. ఈయన బిల్‍కు కూడా నాకు ఏం సంబంధం లేదని, ఎలాగైనా వసూలు చేసుకోండని చెబుతుంది.
శ్రీధర్‌తో ప్లేట్లు కడిగించిన కార్తీక్
కావేరిని శ్రీధర్ అరుస్తుంటే కార్తీక్ అడ్డుకుంటాడు. ఆమె మా గెస్ట్ అని అని అంటాడు. మరి నేను వేస్టా అని శ్రీధర్ అంటే.. ఆ మాటే కరెక్ట్ అని కౌంటర్ వేస్తాడు కార్తీక్. డబ్బులు కట్టి వెళ్లాల్లిందేనని కార్తీక్ పట్టుబడతాడు. డబ్బులు లేకపోతే ఏం చేయాలి.. కట్టకపోతే ఏం చేస్తావని శ్రీధర్ అంటాడు. కడుపు నిండా తిని డబ్బులు కట్టకపోతే ఎంగిలి ప్లేట్లు కడిగిస్తారని, ఈయనతో అలాంటి పనులు చేయించకండి అని కావేరి వెటకారంగా అంటుంది. ఎవర్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావ్.. నా రేంజ్ తెలుసా అంటూ తన మార్క్ గొప్పలు చెప్పుకుంటాడు శ్రీధర్.
ఇంతలోనే ఇక తప్పక రెస్టారెంట్‍లో ప్లేట్లు కడుగుతాడు శ్రీధర్. పక్కనే ఉండి చూస్తూ కావేరి, కార్తీక్ నవ్వుకుంటూ ఉంటారు. దీప మాత్రం అవసరమా అన్నట్టు చూస్తుంటుంది. ఇద్దరు పెళ్లాలు, కొడుకు, కూతురు ఉండి ఏం గతి పట్టిందిరా అని శ్రీధర్ అనుకుంటాడు. జిడ్డు వదలడం లేదని, సరిగా కడగాలని మరింత మండేలా చేస్తుంది కావేరి. ప్లేటుకు రూపాయి అని కార్తీక్ అంటాడు. అంటే నేను 620 ప్లేట్లు కడగాలా అని అవాక్కవుతాడు శ్రీధర్. నా వల్ల కాదని చెబుతాడు. ప్లేట్లు కడిగితే నా ముఖం కనిపించేంత నీట్‍గా ఉండాలని కార్తీక్ అంటే.. అద్దంలో చూసుకోపో అని శ్రీధర్ అంటాడు.
కూరగాయలు కట్ చేయించి..
రాని పని ఎలా చేస్తారు అని కావేరి అంటే.. భార్యంటే నువ్వే అని శ్రీధర్ అంటాడు. ఆయనకు కూరగాయలు కట్ చేయడం వచ్చు అని కావేరి షాకిస్తుంది. దీంతో శ్రీధర్‌తో కూరగాయలు కట్ చేయిస్తాడు కార్తీక్. వెయ్యి రూపాయల పనిపైనే పని చేశానని శ్రీధర్ కోప్పడతాడు. బాగా కట్ చేయాలంటాడు కార్తీక్. ఇలా తన తండ్రి శ్రీధర్‌తో కార్తీక్ ఆట ఆడుకుంటాడు. కార్తీక్ బాబు ఇక చాలు అని దీప అంటుంది. దీంతో మేడంగారు.. చెప్పారు వెళ్లి చేతులు కడుక్కోవచ్చని కార్తీక్ అంటాడు. నాకు టైమ్ వస్తుంది, అప్పుడు మీ పని చెబుతా అని శ్రీధర్ అంటాడు.
నా భార్యను బాధపెట్టావ్
ఏదైనా అవసరం ఉంటే తనకు చెప్పాలని, సాయం చేస్తానని కావేరి అంటుంది. మొగుడు తిన్న దానికి బిల్ కట్టవు కానీ.. కొడుకుకు సాయం చేస్తావా అని శ్రీధర్ అంటాడు. మీరు నోరు పారేసుకున్నందుకు ఇదే పనిష్మెంట్ అని కావేరి అంటుంది. నేనేమన్నానని శ్రీధర్ అంటే.. చాలా మాటలు అన్నారు మాస్టారు అని కార్తీక్ చెబుతాడు. నా రెస్టారెంట్‍కు వచ్చి నా భార్యను చాలా బాధపెట్టావని అంటాడు.
నాకు తగిన భార్యే వచ్చింది
దీపను శ్రీధర్ అన్న మాటలకు కార్తీక్ కౌంటర్లు ఇస్తాడు. నా లాంటి చదువుకున్న వాడికి, తెలివైన వాడికి, అందగాడికి తగిన భార్యే వచ్చిందని కార్తీక్ అంటాడు. శ్రీధర్ అన్న మాటలు కార్తీక్ బాబు వినేశాడా అని మనసులో దీప అనుకుంటుంది. “నా భార్య గుణవతి. ఆవిడ వ్యక్తిత్వం ముందు సిరి సంపదలు కేవలం అలంకారాలు. జీవితం అనే పుస్తకంలో నేను రాసుకున్న రెండు అందమైన అక్షరాల పేరు దీప. దీప వంట మనిషే. కానీ నేను మరోలా పిలుస్తా. ఏంటో తెలుసా.. అన్నపూర్ణ. అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణ” అని కార్తీక్ అంటాడు. మరోసారి నా భార్య గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంటూ శ్రీధర్‌కు వేలిచూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు.
పరువు తీశావని కావేరిపై శ్రీధర్ ఫైర్ అవుతాడు. నువ్వు మంచి పని చేశావని, మరోసారి అలా మాట్లాడరు అని కావేరి అంటుంది. ఓసారి ఇంటికి రావాలని కావేరిని పిలుస్తాడు కార్తీక్. మీ నాన్న గారిని బాధపెట్టారని కార్తీక్‍తో దీప అంటుంది. నిన్ను ఆయన బాధపెట్టలేదా, ఎవరి ముందు నా భార్య తక్కువ కావడం ఇష్టం లేదు దీప అని కార్తీక్ చెబుతాడు.
వీలునామా రాసిన శివన్నారాయణ
తన ఆస్తులను ఎవరికి ఇవ్వాలనే దానిపై వీలునామా రాస్తాడు శివన్నారాయణ. ఆస్తి పంచేయాలని తాను నిర్ణయించుకున్నానని లాయర్‌తో అంటాడు. లాయర్ ఇంటికి రావడంతో ఎందుకా అని దూరం నుంచి చూస్తుంటుంది పారిజాతం. గుట్టుగా చూస్తున్న పారిజాతాన్ని శివన్నారాయణ పిలుస్తాడు. చూడకుండా ఎలా గుర్తు పట్టారని పారు అడిగితే.. సెంట్ మహిమ అని శివన్నారాయణ అంటాడు. సెంట్ నచ్చలేదని చెప్పినా.. అలాగే కొట్టుకు తిరుగుతావని అంటాడు.
విడాకులు ఇస్తున్నా.. ఏడిపించిన శివన్నారాయణ
లాయర్ వినాయక రావు ఎందుకు వచ్చారని పారిజాతం అంటుంది. దీంతో పారిజాతాన్ని సరదాగా ఏడిపించాలని శివన్నారాయణ అనుకుంటాడు. నీతో విడాకులు కావాలని లాయర్‌తో చెబుతున్నానని, వీలైనంత త్వరగా ఇప్పించాలని మాట్లాడానని శివన్నారాయణ చెబుతాడు. దీంతో పారిజాతం కంగారు పడుతుంది. ఈ వయసులో విడాకులు ఏంటి.. నాలో మీకు ఏం నచ్చలేదని ఏడుస్తూ అడుగుతుంది పారిజాతం. నువ్వు కొట్టుకునే సెంట్ నచ్చలేదంటూ ఆటపటిస్తాడు శివన్నారాయణ.
సెంట్ నచ్చలేదని ప్రపంచంలో ఏ మొగుడైనా విడాకులు ఇస్తాడా.. ఇది పాపం అని పారిజాతం ఏడుస్తుంది. నేను చేస్తానని శివన్నారాయణ అంటాడు. విడాకులు ఇస్తే అన్యాయం అయిపోతానని, సెంట్ కొట్టుకోవడం ఆపేస్తాని పారిజాతం అంటుంది. నీ సెంట్ గుండెను రాయిలా మార్చేసిందని, నువ్వు సెంట్ మార్చినా ఈ నిర్ణయాన్ని మార్చుకోనని, విడాకుల కాగితాలు ఇస్తారు సంతకాలు పెట్టేందుకు సిద్ధంగా ఉండు అని చెప్పి అక్కడిని నుంచి శివన్నారాయణ వెళ్లిపోతాడు. ఈ ఘోరాన్ని అరికట్టే వారు లేరా అంటూ ఏడుస్తుంది పారిజాతం.
నా ప్రాణదాత ఫొటో
మున్సిపాలిటీ వారికి పేపర్లు ఇవ్వాలని చెప్పి రెండు రోజులైందని, ఇంకా ఇవ్వలేదని కార్తీక్‍తో దీప చెబుతుంది. కార్తీక్ పేపర్లు తీస్తుంటే.. దీప చిన్నప్పటి ఫొటో రివర్స్‌లో కింద పడుతుంది. దాన్ని దీప చూస్తుందేమోనని వేగంగా తీసుకుంటాడు కార్తీక్. జస్ట్ మిస్.. లేకపోతే ఫొటో దొరికిపోయేదని కార్తీక్ అంటాడు. ఫొటో ఎవరిది అని దీప అడుగుతుంది. చూపించనని, చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడిన ప్రాణదాత ఫొటో అని కార్తీక్ అంటాడు. దీంతో దీప షాక్ అవుతుంది. దీపే చిన్నప్పుడు తన ప్రాణాలు కాపాడిన అమ్మాయి అని తెలిసినా.. కార్తీక్ ఆట ఆడుతుంటాడు. మీరు అబద్ధం చెబుతున్నారని దీప అంటుంది. ఆ ఫొటో చూపించాలని దీప అడుగుతుంది.
నిజం తెలిసే ఆటపట్టిస్తున్నారా?
“నేనే మిమ్మల్ని కాపాడిన మనిషి అయినప్పుడు ఆ ఫొటో ఎవరిది. ఆ ఫొటో మీకెలా వచ్చింది. నేనే అని తెలిసిపోయిందా. నిజం తెలిసే ఆటపట్టిస్తున్నారా” అని లోలోపల అనుకుంటుంది దీప. అవును దీప.. కావాలనే ఆట పట్టిస్తున్నా.. నువ్వు బయటపడాలనే ఆటపట్టిస్తున్నా అని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఆ ఫొటో తనకు చూపించాల్సిందేనని దీప అడుగుతుంది.
కార్తీక్‍పై పడిన దీప
కార్తీక్ చేతిలో ఉన్న ఫొటోను లాక్కునేందుకు దీప ప్రత్నియస్తుంది. దీపకు అందకుండా చేతిని పైకి ఉంచుతాడు కార్తీక్. దీపకు ఫొటో అందకుండా చేస్తాడు. ఇంత తేలికగా ఈ ఫొటోను చూపిస్తానా అని అంటాడు. ఫొటో దీపకు అందకుండా ఆటపట్టిస్తాడు. ఫొటోను కార్తీక్ చేతిలో నుంచి తీసుకునేందుకు దీప ప్రయత్నిస్తుంటే.. తప్పించుకుంటాడు కార్తీక్. ఈ ప్రయత్నంలో కార్తీక్ మీద పడుతుంది దీప. ఇద్దరూ దగ్గరవుతారు. ఫొటో తీసుకునేందుకు దీప ట్రై చేస్తానే ఉంటుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరం ఉన్నామని ఇద్దరూ గుర్తిస్తారు. దీప సిగ్గు పడుతుంది. దీప తాళి.. కార్తీక్ షర్ట్ బటన్‍ను చిక్కుకుంటుంది. కార్తీక్, దీప ఇద్దరూ ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటారు.
ముందు నీకే చూపిస్తా
సారీ కార్తీక్ బాబు అని దీప చెబుతుంది. నాకేం దెబ్బలు తగల్లేదని కార్తీక్ అంటాడు. నా ప్రాణదాతను చూడాలని నీకెందుకు అంత ఆరాటం అని అడుగుతాడు. కాపాడింది మీ ప్రాణాలు కదా, తనెవరో చూద్దామని అని దీప బదులిస్తుంది. ఇంకేం లేదా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. “కార్తీక్ బాబుకు నేను ఎదురుచూస్తున్న మనిషిని అని తెలిసిందో లేదో. నేనెందుకు ఇప్పుడు అనవసరంగా చెప్పాలి. ఆట పట్టించేందుకు ఇలా చేస్తుండొచ్చు కదా” అని మనసులో అనుకుంటుంది దీప. నా ప్రాణదాతను అందరి కంటే ముందు నీకే చూపిస్తానని కార్తీక్ చెబుతాడు.
కార్తీక్ బాబులో ఏదో మార్పు కనిపిస్తోందని, ఆ ఫొటో నాదేతై కాదు అని దీప అనుకుంటుంది. “ఆ ఫొటో ఆయనకు ఎవరు ఇస్తారు. నన్నెందుకో ఆట పట్టించాలని రెండు రోజుల నుంచి కార్తీక్ బాబు చూస్తున్నారు. నా గురించి తెలిసి ఉంటుందా? తెలిస్తే అడగాలి కదా. నిజంగానే తెలిసి ఉంటుందా?” అని ఆలోచిస్తుంది దీప. దీంతో కార్తీక దీపం 2 నేటి (మార్చి 7) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం