Brahmamudi Today Episode: కావ్య‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకోనున్న రాజ్ – భ‌ర్త స‌ర్‌ప్రైజ్‌కు క‌ళావ‌తి క్లీన్ బౌల్డ్‌

Best Web Hosting Provider In India 2024

Brahmamudi Today Episode: కావ్య‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకోనున్న రాజ్ – భ‌ర్త స‌ర్‌ప్రైజ్‌కు క‌ళావ‌తి క్లీన్ బౌల్డ్‌

Nelki Naresh HT Telugu
Published Mar 07, 2025 07:09 AM IST

Brahmamudi Today Episode: బ్ర‌హ్మ‌ముడి మార్చి 7 ఎపిసోడ్‌లో కావ్య రాజ్ క‌లిసి హ‌నీమూన్ బ‌య‌లుదేరుతారు. ఈ హ‌నీమూన్ ఏర్పాట్లు మొత్తం రాజ్‌కు తెలియ‌కుండా కావ్య చేసేస్తుంది. ఈ హ‌నీమూన్ ట్రిప్‌లోనే కావ్య ప్రాణాలు తీసేందుకు కిల్ల‌ర్‌తో డీల్ కుద‌ర్చుకుంటుంది యామిని.

బ్ర‌హ్మ‌ముడి మార్చి 7 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి మార్చి 7 ఎపిసోడ్‌

Brahmamudi Today Episode: కావ్య‌ను ప‌ట్టించుకోకుండా ఆఫీస్ వ్య‌వ‌హారాల్లో మునిగిపోతున్న రాజ్‌కు క్లాస్ ఇస్తారు అప‌ర్ణ‌, ఇందిరాదేవి. అత‌డిని రౌండ‌ప్ చేసి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తారు. నీకు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు కావ్య‌ను ఆఫీస్‌కు తీసుకెళ్లి ప‌నిచేయించుకున్నావు త‌ప్పితే త‌న‌కు ఏమైనా కావాలా అని ఎప్పుడైనా అడిగావా అని కొడుకును నిల‌దీస్తుంది అప‌ర్ణ‌.

కొన్ని రోజులు ఆఫీస్ ప‌నులు ప‌క్క‌న‌పెట్టి కావ్య‌తో కలిసి హ‌నీమూన్ వెళ్లాల‌ని రాజ్‌కు ఆర్డ‌ర్ వేస్తుంది అప‌ర్ణ‌. పెళ్లై రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడు హ‌నీమూన్ ఏంటి అని ఫిట్టింగ్ పెట్ట‌బోతుంది రుద్రాణి. క‌రివేపాకు ఏదో కూసింది దాని మాట‌లు ప‌ట్టించుకోవ‌ద్దు అంటూ రుద్రాణికి కౌంట‌ర్ వేస్తుంది ఇందిరాదేవి.

ప్లాన్ చేసుకోవాలి…

హ‌నీమూన్ అంటే ప్లాన్ చేసుకోవాలి ఇప్ప‌టికిప్పుడు కుద‌ర‌ద‌ని రాజ్ త‌ప్పించుకోవాల‌ని చూస్తాడు. ప్లానింగ్ అంత అయిపోయింద‌ని, కులుమ‌నాలి ఫ్లైట్ టికెట్స్ రాజ్ చేతిలో పెడ‌తాడు ప్ర‌కాశం. ప్యాక్ చేసిన ల‌గేజీ తీసుకొచ్చి రాజ్ ముందు పెడుతుంది స్వ‌ప్న‌. అంద‌రూ రాజ్‌కు షాకుల మీద షాకులు ఇస్తారు. ఇదంతా క‌ళావ‌తి ఇచ్చిన ట్రైనింగ్‌లా ఉంద‌ని రాజ్ అంటాడు.

నా ట్రైనింగ్ లేదు…

భ‌ర్త మాట‌ల‌తో క‌ళావ‌తి రెచ్చిపోతుంది. ఇంకా ఈ మాట అన‌లేదేంట‌ని చూస్తున్నాన‌ని విరుచుకుప‌డుతుంది. నా మొహానికి హ‌నీమూన్ ఏంటి? మీతో రావాల‌నే స‌ర‌దా ఏం లేద‌ని అంటుంది. ఈ ప్లానింగ్‌లో నా ట్రైనింగ్ ఏం లేద‌ని చెప్పి కోపంగా అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. చూశావా ఎంత పొగ‌రుగా మాట్లాడుతుందో దీనిని తీసుకొని నేను హ‌నీమూన్ వెళ్లాలా అని రాజ్ ఫైర్ అవుతాడు.

ఈ హ‌నీమూన్ గురించి కావ్య‌కు ఇప్పుడే తెలుసున‌ని, త‌ప్పు లేకుండా త‌న‌ను ఎందుకు నిందించావ‌ని ఇందిరాదేవి, అప‌ర్ణ క్లాస్ ఇస్తారు. కావ్య‌ను హ‌నీమూన్ రావ‌డానికి ఒప్పించే బాధ్య‌త‌ను రాజ్‌పైనే పెడ‌తారు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌.

పాట‌లు పాడిన రాజ్‌…

కావ్య కోపంగా బుంగ‌మూతి పెట్టుకొని క‌నిపిస్తుంది. నువ్వు నిజంగానే కోపంగా ఉన్నావా అని భార్య‌ను రాజ్ అడుగుతాడు. కావ్య స‌మాధానం ఇవ్వ‌దు. అలిగింది శ్రీమ‌తి అంటూ రాజ్ పాట‌లు పాడుతాడు. రాజ్ గొంతుపై సెటైర్లు వేస్తుంది కావ్య‌. నేను ఏదో టెన్ష‌న్‌లో ఉండి అలా మాట్లాడాన‌ని క్ష‌మించ‌మ‌ని రాజ్ చెబుతాడు. మ‌ళ్లీ ఏం ఉప‌ద్ర‌వం ముంచుకొచ్చింద‌ని కావ్య కంగారుగా భ‌ర్త‌ను అడుగుతుంది. యామిని టాపిక్ దాచేసి నిన్ను మాట్లాడించాల‌నే అలా అన్నాన‌ని రాజ్ అంటాడు.

హ‌నీమూన్ క్యాన్సిల్‌…

రాజ్‌తో క‌లిసి హ‌నీమూన్ వెళ్ల‌డానికి కావ్య స‌సేమిరా అంటుంది. ఎంత బ‌తిమిలాడిన కావ్య విన‌క‌పోవ‌డంతో హ‌నీమూన్ క్యాన్సిల్ చేసుకుందామ‌ని రాజ్ అంటుంది. త‌న ఓవ‌రాక్ష‌న్‌తో ప్లాన్ మొత్తం రివ‌ర్స్ అయ్యేలా ఉంద‌ని కావ్య కంగారు ప‌డుతుంది. మ‌నం హ‌నీమూన్ వెళ్ల‌క‌పోతే అమ్మ‌మ్మ‌, అత్త‌య్య బాధ‌ప‌డ‌తారు అని కావ్య అంటుంది. ఏం కాద‌ని రాజ్ బ‌దులిస్తాడు బెట్టు వీడిన కావ్య చివ‌ర‌కు అస‌లు నిజం బ‌య‌ట‌పెడుతుంది. హ‌నీమూన్ ప్లాన్ త‌న‌దేన‌ని ఒప్పుకుంటుంది. తాను చెబితే వాళ్లు ఆ ఏర్పాట్లు చేశార‌ని అంటుంది. కావ్య బిల్డ‌ప్పులు చూసి రాజ్ షాక‌వుతాడు.

శ్రీశైలం ట్రిప్‌…

నాకు కొంత సుఖం, సంతోషం, ప్ర‌శాంత‌త కావాలి క‌దా అని అంటుంది. నువ్వు కాబ‌ట్టి ఇన్ని స‌మ‌స్య‌లు త‌ట్టుకున్నావ‌ని కావ్య‌తో అంటాడు రాజ్‌. నువ్వు ప‌క్క‌నుంటే ఎలాంటి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొంటాన‌నే ధైర్యం వ‌చ్చింద‌ని కావ్య‌ను పొగుడుతాడు. కులుమ‌నాలి ట్రిప్ కంటే ముందు శ్రీశైలం వెళ‌దామ‌ని భ‌ర్త‌తో అంటుంది కావ్య‌. మీరు జైలు నుంచి రిలీజైతే శ్రీశైలం వ‌స్తాన‌ని మొక్కుకున్నాన‌ని చెబుతుంది. రాజ్ స‌రేన‌ని అంటాడు.

కిల్ల‌ర్‌తో డీల్‌…

రాజ్‌ను త‌న సొంతం చేసుకోవ‌డానికి కావ్య‌ను చంపాల‌ని స్కెచ్ వేస్తుంది యామిని. షేక్ బాండ్ అనే కిల్ల‌ర్‌తో డీల్ కుద‌ర్చుకుంటుంది. కావ్య ఫొటోను అత‌డికి ఇచ్చి నువ్వు చంపాల్సింది ఈమెనే అని అంటుంది. నా లైఫ్‌లోకి వ‌చ్చి నా ప్రేమ‌కు అడ్డుగా ఉంద‌ని కిల్ల‌ర్‌తో అంటుంది యామిని. కావ్య‌, రాజ్‌…శ్రీశైలం వెళుతున్నార‌ని, ఈ టూర్‌లోనే కావ్య‌ను చంప‌మ‌ని కిల్ల‌ర్‌తో చెబుతుంది యామిని. అది మ‌ర్డ‌ర్ అని ఎవ‌రికి డౌట్ రాకూడ‌ద‌ని అంటుంది. ప‌ని జ‌ర‌క్క‌పోతే నిన్ను చంప‌డానికి మ‌రొక కిల్ల‌ర్‌ను మాట్లాడుతాన‌ని షేక్ బాండ్‌కు వార్నింగ్ ఇస్తుంది యామిని.

కావ్య చ‌నిపోబోతుంద‌నే సంతోషంలో యామిని పాట‌లు పాడుకుంటుంది. రాజ్‌, కావ్య శ్రీశైలం కారులో బ‌య‌లుదేరుతారు. చాలా రోజుల త‌ర్వాత మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంద‌ని అంటుంది. రేప‌టి గురించి దిగులు లేదు. ఎవ‌రు వ‌చ్చి ఏదో అడుగుతార‌నే భ‌యం లేద‌ని చెబుతుంది.

నిజ‌మైన ఆనందం…

ఒక‌ప్పుడు నా కంపెనీని నంబ‌ర్‌వ‌న్‌లో పెట్ట‌డం లోనే నిజ‌మైన ఆనందం ఉంద‌ని పొర‌ప‌డ్డాను. కానీ ఆ ఆనందం ఖ‌రీదైన బంగ‌ళాల్లో, కోట్లు సంపాదించ‌డంలో లేద‌ని తెలిసింది. ఏం లేక‌పోయినా మ‌న‌ల్ని ఇష్ట‌ప‌డే ఓ తోడు ఉంటే జీవితాంతం సంతోషంగా బ‌త‌కొచ్చ‌ని తెలిసింద‌ని కావ్య అంటుంది.

పొగ‌డ్త‌ల కాస్త గొడ‌వ‌కు దారితీస్తాయి. న‌న్ను తిట్ట‌డం, కొట్ట‌డం త‌ప్ప నాతో ఏరోజు అయినా ప్రేమ‌గా మాట్లాడారా అని రాజ్‌ను నిల‌దీస్తుంది కావ్య‌. కొట్ట‌డం అనే మాట ఎవ‌రైనా వింటే నాపై గృహ‌హింస కేసు పెడ‌తార‌ని రాజ్ కంగారుగా అంటాడు. మీరు పెట్టిన టార్చ‌ర్‌కు అదే క‌రెక్ట్ అని కావ్య అంటుంది.

మీ ప్రేమ కావాల‌ని ఎన్ని సార్లు వెంట‌ప‌డ్డాను. ఒక్క‌సారైన న‌న్ను ప‌ట్టించుకున్నారా? మ‌గ అహంకారం మీది అంటూ క్లాస్ ఇస్తుంది.

భూత్ బంగ్లాకు రాజ్‌…

కావ్య‌ను భూత్ బంగ్లా ద‌గ్గ‌ర‌కు తీసుకొస్తాడు రాజ్‌. ఏంటి ఇక్క‌డికి తీసుకొచ్చార‌ని కావ్య అంటుంది. నీతో ఓ ముఖ్య‌మైన విష‌యం చెప్పాల‌ని రాజ్ అంటాడు. ఎవ‌రైన ముఖ్యం విష‌యం మాట్లాడాలంటే ఏదైనా రొమాంటిక్ ప్లేస్‌ల‌కు తీసుకెళ్లాలి గానీ ఇలాంటి చోటుకు తీసుకొస్తారా అని రాజ్‌పై సెటైర్లు వేస్తుంది కావ్య‌.భార్య క‌ళ్లు మూసి బిల్డింగ్ లోప‌లికి తీసుకెళ్తాడు రాజ్‌.

మ‌ళ్లీ పెళ్లి…

నాలో లైఫ్‌లాంగ్ ఇంతే ప్రేమ‌గా న‌న్ను చూసుకుంటూ ఉండిపోతావా కావ్య‌ను అడుగుతాడు రాజ్‌. ఆమెకు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. మ‌న పెళ్లి నాకు ఇష్టం లేకుండా జ‌రిగింది. మ‌ళ్లీ మ‌నిద్ద‌రం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. రాజ్ ప్ర‌పోజ‌ల్‌తో ఆనందం ప‌ట్ట‌లేక‌పోయినా కావ్య అత‌డిని కౌగ‌లించుకుంటుంది. మ‌రోవైపు కావ్య‌ను చంపేందుకు కిల్ల‌ర్ ఎదురుచూస్తుంటాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024