Jhanvi Kapoor Diet Secret: జాన్వీ కపూర్ అందం వెనకున్నరహస్యం ఏంటో తెలుసా? ఆమె డైట్ సీక్రెట్ తెలిస్తే అవాక్కవుతారు!

Best Web Hosting Provider In India 2024

Jhanvi Kapoor Diet Secret: జాన్వీ కపూర్ అందం వెనకున్నరహస్యం ఏంటో తెలుసా? ఆమె డైట్ సీక్రెట్ తెలిస్తే అవాక్కవుతారు!

Ramya Sri Marka HT Telugu
Published Mar 07, 2025 08:30 AM IST

Jhanvi Kapoor Diet Secret: శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందం గురించి అందరికీ తెలిసిందే. టోన్డ్ బాడీతో పాటు గ్లోయింగ్ స్కిన్ కోసం ఆమె ఎలాంటి డైట్ పాటిస్తారు. ఉదయాన్నే ఆమె ఎలాంటి ఆహారాలను తింటారు వంటి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

ముంబైలో తాజాగా జరిగిన ఈవెంట్లో తళుక్కుమన్న జాన్వీ కపూర్(ఫైల్ ఫోటో)
ముంబైలో తాజాగా జరిగిన ఈవెంట్లో తళుక్కుమన్న జాన్వీ కపూర్(ఫైల్ ఫోటో)

దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోనూ తన హవా చూపిస్తోన్న సంగతి తెలిసిందే. అందంతో పాటు యాక్టింగ్‌లోనూ అదరగొట్టేసే ఈ అమ్మడు ఫిట్‌నెస్ విషయంలోనూ ఏమాత్రం తగ్గకుండా కనిపిస్తుంది. సినిమాలు, యాడ్‌లు, సెలబ్రిటీ ఈవెంట్లలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తరచూ తన వర్కవుట్ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. మార్చి 6తన పుట్టిన రోజు సందర్భంగా 28 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పటికీ ఇంత ఫిట్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించడం వెనకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం.

జాన్వీ కపూర్‌కు ఎలాంటి ఆహారాలంటే ఇష్టం?

2022లో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్పైతో మాట్లాడుతూ జాన్వి ఆమె పూర్తిగా ఇంట్లో తయారుచేసిన ఆహారాలపైనే దృష్టి పెడుతుందని, అప్పుడప్పుడు మాత్రమే ఆమెకు నచ్చినవి తింటుందని చెప్పింది. తాజాగా తనకు బ్రంచ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. స్వీట్ పొటాటో పరోటా కూడా చాలా బాగా నచ్చుతుందని చెప్పింది.

హెల్తీ ముంచీస్ లేదా చీట్ డేస్‌లో ఏమి తింటుందో అడిగినప్పుడు జాన్వి “పండ్లు తినడం నాకు చాలా ఇష్టం, కానీ వాటిలో చాలా చక్కెర ఉంటుంది. నాకు స్ట్రాబెర్రీలు అంటే కూడా చాలా ఇష్టం. గోల్ గప్పాలు, ఐస్ క్రీం అంటే కూడా ఎంతో ఇష్టం. ” అంటూ లిస్ట్ చెప్పింది.

వీటితో పాటు జాన్వీ జపనీస్ నూడుల్స్, లోడెడె నాచోస్. టోఫు బిబింబాప్, హేముల్ పజియోన్ వంటి స్పైసీ ఇంటర్నేషన్ వంటకాలను కూడా బాగా ఇష్టపడుతుందట. అలాగే ఇటాలియన్, ఆంధ్ర, మేఘాలయా వంటకాలు అంటే చాలా ఇష్టమని చెప్పకొచ్చిందీ ఈ అందాల బొమ్మ.

జాన్వీ కచ్చితంగా “నో” చెప్పేది ఎలాంటి ఆహారాలకు..?

మీరు కచ్చితంగా ఎలాంటి ఆహారాలను దూరంగా ఉంటారని జాన్వీని అడిగితే.. ఆమె టక్కున చెప్పిన సమాధానం ‘గ్లూటెన్‌’. అవును ఈ అమ్మడు గ్లూటెన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోదట. ఎందుకంటే ఆమెకు ‘గ్లూటెన్ అలర్జీ’ ఉందని చెప్పింది. కేవలం గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటే గ్లూటెన్ ఫ్రీ రోటీలతో పాటు కర్రీలను, సలాడ్‌లను తింటుందట.

జాన్వి తన డైలీ డైట్‌లో ఎప్పుడు, ఏం తింటుంది?

2019లో ఇంటర్వ్యూలో పింక్ విల్లాతో మాట్లాడుతూ.. జాన్వి ఆమె ప్రతిదీ తింటుందని, కానీ బరువు పెరగకుండా ఉండటానికి అదనంగా వ్యాయామం చేస్తుందని చెప్పింది. ఆమె డైలీ డైట్ ఎలా ఉంటుందంటే..

ఉదయం: ఉదయాన్నే ఈ ముద్దుగుమ్మ నిమ్మరసం, తేనె కలిపిన గోరు వెచ్చటి నీటిని తీసుకుంటుందట. అలాగే ఒక చెంచా నెయ్యిని నేరుగా తినేస్తుందట.

మధ్యాహ్నం: భోజనం విషయానికొస్తే ఈ దేవర బ్యూటీ ఇంట్లో వండిన ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందట. దాంట్లో తప్పనిసరిగా పప్పును చేర్చుకుంటుంది. అలాగే బెండకాయ, మెంతికూర, పాలకూల వంటి వాటితో తయారు చేసిన కూరలు, గ్లూటెన్ ఫ్రీ రోటీలు, పనీర్ లేదా చికెన్ వంటివి తీసుకుంటుంది.

రాత్రి:నైట్ డిన్నర్‌ని సలాడ్ లేదా రెడ్ రైస్ బిర్యానీతో సింపుల్‌గా సరిపెట్టుకుంటుందట ఈ అమ్మాయి. అంతేకాదు ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు డిన్నర్ చేస్తుందట.

ప్రస్తుతం ..

ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్న జాన్వీ ఈ సినిమా కోసం చాలా కఠినమైన డైట్ ఫాలో అవుతుందట. బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు గుడ్లు ఆవకాడో. లంచ్‌లో పాలకూరతో గ్రిల్డ్ చికెన్. డిన్నర్ సమయంలో అయితే కేవలం సూప్ తాగి పడుకుంటున్నట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది జాన్వీ. ఈమె డైట్ మీకూ నచ్చితే మీరూ ఇంతే ఫిట్‌గా కనిపించాలనుకుంటే కాపీ కొట్టేయండి మరి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024