





Best Web Hosting Provider In India 2024

Tollywood: హీరోలను డామినేట్ చేసే హీరోయిన్ రోల్స్ ఉన్న తెలుగు మూవీస్ ఇవే
Tollywood: కొన్ని సినిమాల్లో హీరోలను హీరోయిన్లు డామినేట్ చేస్తున్నారు. కథానాయికల పాత్రలే ఎక్కువగా హైలైట్ అవుతూ సినిమా విజయంలో కీలకంగా నిలుస్తుంటాయి. అలా హీరోయిన్ల పాత్రలు ఎక్కువగా ఫేమస్ అయిన సినిమాలు ఏవంటే?

Tollywood: ఇది వరకు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్, పాటలకు పరిమితం అనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథానాయికల క్రేజ్, ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు. హీరోయిన్లను పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నారు. కొన్ని సినిమాల్లో హీరోలను డామినేట్ చేసేలా హీరోయిన్ల క్యారెక్టర్లు ఉంటున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్స్ స్ఫూర్తిదాయకంగా చూపించిన ఆ సినిమాలు ఏవంటే?
పెళ్లిచూపులు
విజయ్ దేవరకొండ, రీతూ వర్మ కాంబోలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లిచూపులు మూవీ తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఇండిపెండెంట్‌గా బతకాలని ఆలోచించే స్ట్రాంగ్ అమ్మాయిగా రీతూ వర్మ క్యారెక్టర్‌ను రాసుకున్నాడు దర్శకుడు. ఎవరిపై ఆధారపడకుండా స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో బతకాలని నేటితరం అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారన్నది రీతూ వర్మ పాత్ర ద్వారా చూపించాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండకు ధీటుగా రీతూ వర్మ పాత్ర సాగుతుంది.
మహానటి
సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి అవార్డులతో కమర్షియల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అసమాన నటనను కనబరిచింది కీర్తిసురేష్. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండతో పాటు మరికొందరు స్టార్స్ నటించిన కీర్తిసురేష్, సమంత పాత్రలే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. సావిత్రి జీవితంలో ఎత్తుపల్లాలను కీర్తి సురేష్ తన నటనతో ఆవిష్కరించగా…మహానటి గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్ట్‌గా సమంత కనిపించింది.
ఫిదా
ఫిదాలో సాయిపల్లవి చేసిన భానుమతి పాత్ర ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో వ్యవసాయం అంటే ఇష్టంతో అగ్రికల్చర్ చదువుతున్న యువతిగా సాయిపల్లవి పాత్రను డిఫరెంట్‌గా చూపించారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. పెళ్లి అన్నది….ఆడపిల్లల చదువు, కలలకు అడ్డంకిగా మారకూడదనే సందేశాన్ని హృద్యంగా టచ్ చేశారు. ఈసినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినా ఎక్కువగా సాయిపల్లవి క్యారెక్టర్ హైలైట్ అయ్యింది. ఫిదాలోనే కాకుండా గోదావరి, ఆనంద్ సినిమాల్లో కమలిని ముఖర్జీ పాత్రలను ఉన్నతంగా చూపించారు శేఖర్ కమ్ముల.
అమ్ము…
ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ తెలుగు డ్రామా మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది. సొసైటీలో పలుకుబడి ఉన్న వ్యక్తిగా చెలామణి అవుతూ గృహహింసకు పాల్పడుతోన్న భర్తకు ఓ సగటు ఇల్లాలు ఎలా బుద్దిచెప్పిందనే పాయింట్‌తో అమ్ము మూవీ రూపొందింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, బాబీ సింహా కంటే ఐశ్వర్య లక్ష్మి పాత్ర ఎక్కువగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది.
సంబంధిత కథనం