





Best Web Hosting Provider In India 2024

Kingston Review: కింగ్‌స్టన్ రివ్యూ – తెలుగులో రిలీజై లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Kingston Review: జీవీ ప్రకాష్, దివ్యభారతి జంటగా నటించిన కింగ్‌స్టన్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ కింగ్‌స్టన్ సేమ్ టైటిల్‌తో మార్చి 7న (నేడు) తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. దివ్యభారతి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించాడు. ఈ తమిళ డబ్బింగ్ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
ఊరిని వెంటాడుతున్న శాపం…
సముద్రానికి సమీపంలో ఉన్న తూతువురు గ్రామానికి చాలా కాలంగా శాపం వెంటాడుతుంది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఊరివాళ్లంతా శవాలై తిరిగివస్తుంటారు. బోసయ్య అనే వ్యక్తి ఆత్మ ఈ దారుణాలకు పాల్పడుతుందని తూతువురు ప్రజలు భయపడుతుంటారు. ప్రజల్లోని భయాన్ని, మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుంటాడు థామస్.
చేపల వ్యాపారం పేరుతో ఊరి జనాలకు ఉపాధి కల్పిస్తున్నట్లు నమ్మిస్తూ వారి డ్రగ్స్ సప్లై చేయిస్తుంటాడు. కింగ్ (జీవీ ప్రకాష్ కుమార్) కూడా ఆంటోనీ వద్దే పనిచేస్తుంటాడు. స్నేహితుడి చావుతో థామస్ చేస్తోన్న డ్రగ్స్ బిజినెస్ గురించి కింగ్‌కు తెలిసిపోతుంది. థామస్‌కు ఎదురుతిరుగుతాడు.
సముద్రంపైకి వెళ్లిన వారిని ఆత్మ చంపేస్తుందనే అపవాదు పోతే ఊరివాళ్లకు ఉపాధి దొరుకుతుందని భావిస్తాడు కింగ్. తన స్నేహితులతో కలిసి చేపట వేట కోసం సముద్రంపైకి వెళతాడు? ఈ జర్నీలో కింగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? బోసయ్య ఆత్మ వెంటాడుతుంది నిజమేనా? సముద్రంలోకి వెళ్లి వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏమిటి? ఈ మిస్టరీని కింగ్ ఎలా ఛేదించాడు? ఈ కథలో రాజ్ (దివ్యభారతి)తో పాటు ఛార్లెస్, బోస్ పాత్రలు ఏంటి? అన్నదే కింగ్‌స్టర్ మూవీ కథ.
లవ్ స్టోరీస్‌కు భిన్నంగా…
సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో దక్షిణాదిలో ప్రేమకథలు చాలా వచ్చాయి. కానీ ఆ సినిమాలకు భిన్నంగా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కింగ్‌స్టన్ మూవీ తెరకెక్కింది. హారర్, జాంబీ, లవ్‌స్టోరీ, యాక్షన్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ దర్శకుడు కమల్ ప్రకాష్ కింగ్‌స్టన్ మూవీని తెరకెక్కించాడు.
రెండున్నర గంటలు థ్రిల్…
కింగ్‌స్టన్ పాయింట్‌ను దర్శకుడు ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు. ఓ ఊరిని వెంటాడుతోన్న ఆత్మ శాపం.. ఆ మిస్టరీని ఛేదించడానికి సముద్రంపైకి వెళ్లిన హీరో..ఈ పాయింట్‌తో రెండున్నర గంటలు ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచాడు.
హారర్ మూవీ ఫీల్…
బోసయ్యను చంపి సముద్రంలో పారేయడం, చేపల వేటకు వెళ్లిన ఊరివాళ్లు శవాలై తిరిగి వచ్చే సీన్స్‌తోనే సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఈ సన్నివేశాలతో కింగ్‌స్టర్ హారర్ మూవీ అనే ఫీల్‌ను ఆడియెన్స్‌లో కలిగించాడు దర్శకుడు. తూతువురు ప్రజల కష్టాలు, థామస్ దగ్గర పనిచేసిన కింగ్…అతడికే ఎదురుతిరగడం…మరోవైపు రోజ్‌తో అతడి లవ్‌స్టోరీతో ఫస్ట్ హాఫ్ పెద్దగా ట్విస్ట్‌లు లేకుండా సినిమా సాగుతుంది.
సముద్రంపైనే..
ప్రియురాలు, స్నేహితులతో కలిసి కింగ్ సముద్రంపై వెళ్లిన ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కథలోకి జాంబీలు ఎలా వచ్చాయన్నది సెకండాఫ్‌లో చూపించాడు. ఈ ట్రాక్ మొత్తం సముద్రంపైనే ఒకే బోటులోనే సాగుతుంది. హీరో అండ్ టీమ్‌కు ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో కలిగించేలా ఈ సీన్స్ రాసుకున్నారు. సౌండ్స్‌తోనే భయపెట్టాడు డైరెక్టర్. క్లైమాక్స్‌లోని ట్విస్ట్ బాగుంది. సఫరేట్ కామెడీ ట్రాక్‌లు కాకుండా కథలో నుంచే కామెడీ జనరేట్ అయ్యేలా పంచ్‌లు రాసుకోవడం వర్కవుట్ అయ్యింది.
కావాలనే ఇరికించినట్లుగా…
కింగ్‌స్టన్ కోసం దర్శకుడు ఎంచుకున్న కథ క్లిష్టమైనది. ఆడియెన్స్ కన్వీన్సింగ్‌గా ఫీలయ్యేలా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో దర్శకుడు తబడడిపోయాడు. థామస్‌ను హీరో ఎదురించే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. కావాలనే కొన్ని ఎలివేషనల్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కథలో ఇరికించినట్లుగా అనిపిస్తాయి. లవ్ ట్రాక్ పూర్తిగా ఆర్టీఫీషియల్‌గా సాగుతుంది. తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటేది.
రా అండ్ రస్టిక్…
జీవీ ప్రకాష్ యాక్టింగ్ ఈ సినిమాకు పెద ప్లస్సయింది. రా అండ్ రస్టిక్ రోల్‌కు న్యాయం చేశాడు. అతడి లుక్, గెటప్ కథకు తగ్గట్లుగా కుదిరాయి. నటుడిగా జీవీ ప్రకాష్‌లోని కొత్త కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరించింది. దివ్యభారతి పాత్రను కేవలం లవ్‌స్టోరీ కోసమే పెట్టినట్లుగా అనిపించింది. జీవీ ప్రకాష్‌తో ఆమె కెమిస్ట్రీ కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది.చేతన్, అజగమ్ పెరుమాళ్, ఇళాంగో కుమరావేళ్‌తో పాటు మిగిలిన నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. జీవీ ప్రకాష్ బీజీఎమ్ ఆకట్టుకుంటుంది. చాలా చోట్ల మ్యూజిక్‌తోనే ఆడియెన్స్‌కు థ్రిల్ చేశాడు.
కొత్తదనం కోరుకునే ఆడియెన్స్
డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలను కోరుకునే ఆడియెన్స్‌ను కింగ్‌స్టన్ మెప్పిస్తుంది. కథ, జీవీ ప్రకాష్ యాక్టింగ్ కోసం ఈ మూవీని చూడొచ్చు.
రేటింగ్: 2.75/5
సంబంధిత కథనం