



Best Web Hosting Provider In India 2024

Womens Day Special caller tunes: మహిళలపై మీకున్న గౌరవం, అభిమానాన్ని మాటలతోనే కాదు, ఈ 8 పాటలతో కూడా తెలియజేయవచ్చు!
Womens Day Special caller tunes: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ జీవితంలో మహిళలకు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే, రండి. కేవలం మాటలతోనే కాకుండా పాటలతో కూడా మీ విషెస్ తెలియజేయండి. ఈ టాప్ 8 పాటలలో ఒకదానిని కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోండి.

మహిళా దినోత్సవం సందర్భంగా మీకు రోజూ ఫోన్ చేసే మీ కుటుంబంలోని మహిళలు, స్నేహితులు, సన్నిహితులైన ఆఢవారి కోసం ప్రత్యేకంగా కాలర్ ట్యూన్ లేదా హెలో ట్యూన్ వంటివి సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే. ఇక్కడ ఆడవారి శక్తి సామర్థాలతో పాటు వారి పట్ల ప్రేమను, అభిమానాన్ని తెలియజేసే టాప్ 10 ఉమెన్ ఓరియెంటెడ్ సాంగ్స్ ఉన్నాయి. వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకుని మీ జీవితంలోని ముఖ్యమైన మహిళలకు వారి పట్ల మీకున్న అభిమానాన్ని పరోక్షంగా జేయండి.
“రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” :
భుజాలపై బాధ్యతలు పాతాళానికి నొక్కేస్తున్నా, ప్రాణం పోయే జబ్బు ఒంటిని తొలిచేస్తున్నా, పంటి బిగువన నొప్పిని భరించింది. నిస్సహాయురాలైపోయానని ఏ ఆత్మహత్యో చేసుకోకుండా, పిల్లలందరికీ ఓ నీడ కల్పించింది ఓ తల్లి. మాతృదేవోభవ సినిమాలోని ఈ పాట వెంటే ఆడామగా తేడా లేకుండా భావోద్వేగానికి గురవుతారు.
“మగువా.. మగువా.. ” :
ఆసరా లేని కుటుంబాలకు అన్నీ తామే అయి నిలబడిన అమ్మాయిలు, తమకు జరిగిన అన్యాయాన్ని భరించి మౌనంగా ఊరుకోలేదు. ఎదిరించి న్యాయస్థానం ముంగిట దోషులను నిలదీయగలిగారు. ఇక ఈ పాట విషయానికొస్తే స్త్రీలు లేనిదే యావత్ ప్రపంచమే లేదని చెబుతూ వర్ణించే పాట. ఆదిశక్తి నుంచి అన్నం పెట్టే అమ్మ వరకూ ఆడది కావాల్సిందే. మనలో ప్రతి ఎమోషన్ కు స్త్రీనే ఆధారమని వర్ణించే పాట.
“శివంగివే.. శివంగివే..”:
విజిల్ సినిమాలోని ఈ పాట, ఇక మా జీవితాలింతేనని సర్దుకుపోయిన క్రీడాకారిణులను తిరిగి మైదానం వైపుకు రప్పించేందుకు హీరో చేసే ప్రయత్నంలో వస్తుంది. మీరెంత ?అని చులకనగా భావించిన మగజాతి మీకు తలవంచేలా ఎదగాలనే ప్రేరణ ఇచ్చే పాట. ప్రసవాన్ని చేధించే శక్తిగల మహిళా మణులు ఎటువంటి కష్టకాలాన్నైనా ఎదుర్కోగలరని చెప్పే పాట ఇది.
” చిన్ని చిన్ని ఆశ..”:
పుట్టింట్లో పెరిగే ఎటువంటి కల్మషం లేని మనసును ప్రతిబింబించే పాట.
రోజా సినిమాలోని ఈ పాట ఆడపిల్ల మనసులోని చిలిపి ఆశలు, కోరికలు తెలుపుతూ సాగుతుంది. తనలోని భావోద్వేగాలను ప్రకృతితో పంచుకుంటూ హాయిగా సాగే పాట ఇది.
“శ్రీకారం చుడుతున్నట్లు..”:
ఆడపిల్లను అందం గురించి కాకుండా తెలివి, నైపుణ్యం, మంచి తనం గురించి పొగిడే అద్భుతమైన పాట ఇది. కుదిరితే కప్పు కాఫీ సినిమాలోని ఈ పాట ఆడపిల్ల గొప్పతనాన్ని, ఆరాటాన్ని చక్కగా వర్ణిస్తుంది.
“మహానటి..”:
లక్షలు, కోట్లు సంపాదించింనా కట్టుకున్నోడు మోసం చేశాడని సర్వస్వాన్ని వదిలేసిన మహిళా మూర్తి సావిత్రి. ఈ పాట ఆసాంతం ఆమె వ్యక్తిత్వం, సాధించిన విజయాలను, చేసిన త్యాగాలను కీర్తిస్తూ సాగుతుంది. ఈ పాట ఎందరో ఆడవారి జీవితాలను ప్రతిబింబిస్తుంది.
“రేపటి రేపటి కళ”:
ఓ తండ్రి కలను సాకారం చేయడానికి ఆడపిల్ల ఏ స్థాయి కన్నా వెళ్లగలదు. మగాళ్లు మాత్రమే ఆడతారనే క్రికెట్ లో సత్తా చాటి తండ్రి సంతోషం చూడాలని పరితపించిన కూతురి పాట ఇది. ఆడపిల్ల తలుచుకుంటే సాధించలేనిది, ఆడవారలో లేనిది ఏదీ లేదని వారి కష్టం ఎప్పుడూ వృథా కాదని తెలిపే పాట ఇది.
సఖియే..”:
భాగస్వామి లేదా మీ ప్రేయసిపై మీకున్న అభిమానాన్ని ప్రేమను తెలపడానికి ఇది చక్కటి పాట. మీ భాగస్వామి లేదా ప్రేయసితో ఏదైనా మనస్పర్థలు కలిగి ఉంటే ఈ పాటను వారికి వినిపించండి. లేదా కాలర్ ట్యూన్ పెట్టుకోండి. చెప్పకనే చెప్పే భావాలు ఈ పాటలో హీరో హీరోయిన్ల మధ్య పలికిన తీరు కచ్చితంగా మనసులను కదిలిస్తుంది. మిమ్మల్ని మళ్లీ కలుపుతుంది.
వాస్తవంగా చెప్పాలంటే స్త్రీలో ఔన్నత్యాన్ని వర్ణించడానికి ఒక పాట మాత్రమే సరిపోదు. అయినప్పటికీ వారి పట్ల మీకున్న ప్రేమ, గౌరవం, అభిమానం వంటి వాటిని ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో అయినా వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. తల్లిగా, చెల్లిగా, పెళ్లితో భార్యగా అన్ని రకాలుగా మనతో కలిసి మనల్ని నడిపించే మహిళా మణులకు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలను ఈ కాలర్ ట్యూన్స్ ద్వారా తెలపండి.
సంబంధిత కథనం