Reply Messages Women’s Day Wishes: ఉమెన్స్ డే శుభాకాంక్షలకు ఇలా అందంగా కృతజ్ఞతలు చెప్పండి

Best Web Hosting Provider In India 2024

Reply Messages Women’s Day Wishes: ఉమెన్స్ డే శుభాకాంక్షలకు ఇలా అందంగా కృతజ్ఞతలు చెప్పండి

Ramya Sri Marka HT Telugu
Published Mar 08, 2025 09:25 AM IST

Reply Messages Women’s Day Wishes: మహిళా దినోత్సవం సందర్భంగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలకు థాంక్స్ అనే చిన్న పదంతో రిప్లై ఇవ్వడం సరికాదని ఫీలవుతున్నారా? వారి ప్రేమాభిమానాలుకు తగ్గట్టుగా మీరు కూడా హృదయపూర్వకమైన సందేశాలతో కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా? ఈ హార్ట్ ఫుల్ మెసేజెస్‌తో రిప్లై పంపండి.

మహిళా దినోత్సవం శుభాకాంక్షలకు సమాధానంగా ఈ సందేశాలను పంపండి
మహిళా దినోత్సవం శుభాకాంక్షలకు సమాధానంగా ఈ సందేశాలను పంపండి (Pixabay)

మహిళా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయా? వారు పంపిన కవితలు, పొగడ్తలు, ప్రేమాభిమానాలతో కూడిన సందేశాలకు రిప్లైగా “థాంక్స్” అనే పదం మాత్రమే సరిపోదని మీరు ఫీలవుతున్నారా? అయితే ఇది మీకోసమే. వారు పంపిన అందమైన, అర్థవంతమైన మెసేజ్‌లకు సమాధానంగా మీరు కూడా ఈ చక్కటి సందేశాలతో రిప్లై ఇవ్వండి. ఇక్కడున్న సందేశాలు వారి శుభాకాంక్షలు మీకు ఎంత సంతోషాన్ని కలిగించాయో తెలుపుతాయి. మీలోని కృతజ్ఞతా భావాన్ని వారికి చాలా బాగా తెలియజేస్తాయి.

  1. మీ శుభాకాంక్షలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మీ అందరి ప్రోత్సాహంతో నా లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేస్తాను. ధన్యవాదాలు.”
  2. “నాకు ఇంతటి ప్రేమాభిమానాలను అందించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ మాటలు నా మనసును ఎంతగానో తాకాయి. ఈ మహిళా దినోత్సవాన్ని మీరు నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చారు.”
  3. మీ ఆశీస్సులు, ప్రేమానురాగాలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. మీలాంటి శ్రేయోభిలాషులు ఉండటం నా అదృష్టం. మీకు నా ధన్యవాదాలు.”
  4. “మీ నుండి ఇంతటి ఆదరణ, ప్రోత్సాహం పొందడం నా జీవితంలో ఒక గొప్ప వరం. మీ అందరి ప్రేమ, మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.”
  5. మీరు పంపిన ప్రతి సందేశం నా మనసును హత్తుకుంది. మీలాంటి మంచి స్నేహితులు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. మీ ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.”
  6. ” నాలోని ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని గుర్తించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను.”
  7. మీ నుండి వచ్చిన ఈ ప్రేమ, ఆప్యాయత నాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. మీలాంటి శ్రేయోభిలాషులు ఉండటం నా జీవితానికి ఒక గొప్ప బలం.”
  8. “నాలోని సామర్థ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం లేకుంటే నేను ఇంత దూరం వచ్చేదానిని కాదు.”
  9. మీ అందరి శుభాకాంక్షలు నా రోజును మరింత ప్రత్యేకంగా చేశాయి. నాపై మీరు చూపించిన ప్రేమకు, ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.”
  10. “మీ మాటలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. మీ ప్రోత్సాహంతో నేను నా కలలను సాకారం చేసుకుంటాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.”
  11. మీ మద్దతు నాకెంతో బలాన్నిచ్చింది. మీ ప్రోత్సాహంతో నేను నా జీవితంలో మరింత ముందుకు సాగుతాను. మీకు నా కృతజ్ఞతలు.”
  12. “ఇంత అందమైన సందేశం పంపడానికి సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. నేను మీ ఆలోచనను మాటల్లో చెప్పలేనంతగా అభినందిస్తున్నాను.”
  13. నా జీవితంలో ఇంతమంది సహాయకారి వ్యక్తులు ఉన్నారని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అద్భుతమైన మహిళా దినోత్సవ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
  14. “మీరు నా జీవితంలో ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ప్రేమాభిమానాలతో నిండిన మీ శుభాకాంక్షలకు, ఈ మహిళా దినోత్సవాన్ని గుర్తుండిపోయేలా చేసినందుకు ధన్యవాదాలు.”
  15. శుభాకాంక్షలతో పాటు మీరు పంపిప సందేశం నా ముఖంలో చిరునవ్వును తెప్పించింది. మీ ప్రేమ మరియు మద్దతుకు చాలా ధన్యవాదాలు.”

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024