




Best Web Hosting Provider In India 2024

Romantic Comedy OTT: బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ రొమాంటిక్ కామెడీ మూవీ – డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్
Romantic Comedy OTT: బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ శ్రీహాన్ హీరోగా లైఫ్ పార్ట్‌నర్ పేరుతో పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. రొమాంటిక్ కామెడీ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. లైఫ్ పార్ట్‌నర్ మూవీలో సోనియా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Romantic Comedy OTT: బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ శ్రీహాన్ హీరోగా ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోన్నాడు. లైఫ్ పార్ట్‌నర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. లైఫ్‌పార్ట్‌నర్ మూవీ పోస్టర్‌ను ఈటీవీ విన్ ఓటీటీ అభిమానులతో పంచుకున్నది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు వెల్లడించింది.
సోనియా సింగ్…
లైఫ్ పార్ట్‌నర్ మూవీలో శ్రీహాన్‌కు జోడీగా సోనియా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. లైఫ్ పార్ట్‌నర్ సినిమాను టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గానే కాకుండా లిరిక్స్, స్క్రీన్‌ప్లేను అందిస్తూనే దర్శకత్య పర్యవేక్షకుడిగా రాఘవేంద్రరావు వ్యవహరిస్తున్నారు. రాంకీ దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ…
ఒకే అమ్మాయితో ప్రేమలో పడిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథతో ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా లైఫ్ పార్ట్‌నర్ మూవీ తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నెలకొన్న కన్ఫ్యూజన్స్, వాటి నుంచి పుట్టే వినోదంతో ఆద్యంతం ఈ సినిమా ఎంటర్‌టైన్ చేస్తుందని అంటున్నారు.
మా ఆవారా జిందగీ…
లైఫ్ పార్ట్‌నర్ హీరోగా బిగ్‌బాస్ శ్రీహాన్ సెకండ్ మూవీ. గతంలో మా ఆవారా జిందగీ పేరుతో ఓ సినిమా చేశాడు. కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు బిగ్‌బాస్ శ్రీహాన్. టాస్క్‌లు, గేమ్‌తో అదరగొట్టి ఫైనల్ చేరుకున్నాడు.
ఫైనల్‌లో మాత్రం శ్రీహాన్‌కు లక్ కలిసి రాలేదు. సింగర్ రేవంత్ టైటిల్ విన్నర్‌గా నిలవడంతో శ్రీహాన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 6లో సింగర్ రేవంత్ కంటే రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్ ఎక్కువగా ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. దాదాపు 71 లక్షల వరకు అతడికి ప్రైజ్‌మనీ దక్కింది.
సాయిధరమ్‌తేజ్ విరూపాక్షలో…
లైఫ్ పార్ట్‌నర్‌లో హీరోయిన్‌గా నటిస్తోన్న సోనియా సింగ్ కూడా షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్‌లతోనే ఫేమస్ అయ్యింది. టింగ్లీష్ గర్ల్‌ఫ్రెండ్, యూఆర్‌మై ఫేవరేట్ మిస్టేక్, వీకెండ్ పెళ్లిచూపులు, ఓయ్ పద్మావతి, పెళ్లైనా కొత్తలో, రౌడీబేబీ షార్ట్‌ఫిలిమ్స్, వెబ్‌సిరీస్‌లు సోనియా సింగ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సాయిధరమ్‌తేజ్ విరూపాక్ష మూవీలో కీలక పాత్ర పోషించింది. సోనియా సింగ్ నటించిన శశిమథనం వెబ్‌సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం
టాపిక్