




Best Web Hosting Provider In India 2024

Chhaava Telugu Collections: ఛావా తెలుగు వెర్షన్‍కు సూపర్ ఓపెనింగ్.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..
Chhaava Telugu Collections: ఛావా సినిమా తెలుగులో అదిరే ఓపెనింగ్ అందుకుంది. అంచనాలకు మంచి తొలి రోజు కలెక్షన్లను దక్కించుకుంది. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్‍లో తొలి రోజు ఎంత వచ్చిందంటే..

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఛావా చిత్రం బాలీవుడ్‍లో దుమ్మురేపుతోంది. భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ మూవీకి ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా అదే రేంజ్‍లో భారీగా వస్తున్నాయి. ఈ హిస్టరికల్ యాక్షన్ మూవీ ఈ శుక్రవారమే (మార్చి 7) తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు కలెక్షన్ల లెక్కలు బయటికి వచ్చాయి.
తెలుగులో ఫస్ట్ డే కలెక్షన్లు ఇవే
ఛావా చిత్రం తెలుగు వెర్షన్ తొలి రోజు సుమారు రూ.3కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి ఓపెనింగ్‍ను ఈ మూవీ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేసింది. 500కు పైగా థియేటర్లలో భారీగా ఈ సినిమాను విడుదల చేసింది. చాలా క్రేజ్ ఉండటంతో తెలుగులో మంచి ప్రారంభాన్ని ఛావా అందుకుంది.
ఛావా చిత్రం హిందీలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. భారీ వసూళ్లతో అదరగొడుతోంది. మూడు వారాలు దాటినా ఇంకా జోరుగా వసూళ్లు దక్కుతున్నాయి. హిందీలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ చిత్రాన్ని చూసేందుకు చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. దీంతో తెలుగులో ఫస్ట్ డే రూ.3కోట్ల వసూళ్లు దక్కాయి. అయితే, రెండో రోజు ఈ చిత్రానికి కీలకం కానుంది. బుకింగ్ ట్రెండ్స్ చూస్తే రెండో రోజు కూడా మెరుగ్గా ఉంది. మరి తెలుగులో ఈ మూవీ కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
విక్కీ నటనకు ప్రశంసలు
మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహరాజ్ జీవితంపై ఛావా చిత్రం రూపొందింది. ఛత్రవతి శివాజీ మహరాజ్ కుమారుడే ఆయన. ఛావా మూవీలో సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ మెప్పించారు. అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. ఈ చిత్రంలో అతడి నటనకు భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్నా తన నటనతో ఆకట్టుకున్నారు.
ఛావా మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. సంభాజీ మహరాజ్ వీరత్వాన్ని, స్వరాజ్యం కోసం మొఘలులతో వీరోచితంగా జరిపిన పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించారు. ప్రేక్షకులను మెప్పించేలా ఈ మూవీని తెరక్కించారు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్ద బలంగా నిలిచింది. ఈ మూవీని మాడ్‍డాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించారు. ఈ చిత్రానికి సౌరభ్ గోస్వామి సిని మాటోగ్రఫీ చేశారు. దాదాపు రూ.140కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ భారీ వసూళ్లతో బ్లాక్‍బస్టర్ సాధించింది.
సంబంధిత కథనం
టాపిక్