


Best Web Hosting Provider In India 2024

Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం ట్రిపుల్ సెంచరీ.. మరో భారీే మైల్స్టోన్ దాటేసింది
Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దుమ్మురేపుతోంది. స్ట్రీమింగ్‌లో ఈ మూవీ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీ మరో భారీ మైల్స్టోన్ దాటింది.

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఓటీటీలో రికార్డులను బీట్ చేసిన ఈ చిత్రం.. తాజాగా మరో మైలురాయి అధిగమించింది. థియేటర్లలో అంచనాలను మించి కలెక్షన్లను రాబట్టిన ఈ మూవీ.. స్ట్రీమింగ్లోనూ సెన్సేషనల్ రిజల్ట్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో మైల్స్టోన్ దాటేసింది.
300 మిలియన్ నిమిషాలు క్రాస్
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జీ5 ఓటీటీలో 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. ట్రిపుల్ సెంచరీ దాటిందంటూ ఈ విషయాన్ని జీ5 ఓటీటీ నేడు (మార్చి 8) వెల్లడించింది. “వాటే బ్లాక్‌బస్టర్. 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను త్వరగా దాటేసింది” అని సోషల్ మీడియాలో జీ5 పోస్ట్ చేసింది. ట్రిపుల్ సెంచరీ అల్టిమేట్ విక్టరీ అంటూ ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది. జీ5లో ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఆరంభం నుంచి అదే దూకుడు
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మార్చి 1వ తేదీన సాయంత్రం జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఎంతో క్రేజ్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ మూవీకి అదిరే రేంజ్లో వ్యూస్ దక్కాయి. తొలి 12 గంటల్లోనే ఈ చిత్రం జీ5 ఓటీటీలో ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. జీ5లో అతితక్కువ సమయంలో ఆ మార్క్ అధిగమించిన చిత్రంగా రికార్డు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం. రెండు రోజుల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ దాటింది. ఇప్పుడు వారం ముగియకుండానే ఏకంగా 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను అధిగమించింది. ఇలా ఓటీటీలో సంక్రాంతికి వ్తుననాం చిత్రం దూకుడు కొనసాగిస్తూనే ఉంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ రూ.300కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బంపర్ హిట్ అయింది. అందరి అంచనాలను మించిన బ్లాక్‌బస్టర్ సాధించింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. పక్కా కామెడీ చిత్రంగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, మాస్టర్ రేవంత్, సాయికుమార్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ అవసరాల, నరేశ్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించగా.. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. సుమారు రూ.40కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.300కోట్ల కలెక్షన్లతో భారీ కమర్షియల్ హిట్ కొట్టింది. వెంకటేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు జీ5 ఓటీటీలోనూ దుమ్మురేపుతూనే ఉంది.
సంబంధిత కథనం