


Best Web Hosting Provider In India 2024
Sunita Williams: అస్ట్రోనాట్ సునీత విలియమ్స్ పై డొనాల్డ్ ట్రంప్ తిక్క, అసందర్భ వ్యాఖ్యలు
Donald Trump’s comment on Sunita Williams: సుమారు 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారతీయ సంతతికి చెందిన అస్ట్రోనాట్ సునీత విలియమ్స్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసందర్భ వ్యాఖ్యలు చేశారు. సునీతా విలియమ్స్ ను ‘‘పిచ్చి జుట్టు ఉన్న మహిళ” అని ట్రంప్ అభివర్ణించారు.

Donald Trump’s comment on Sunita Williams: 2024 జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు బుచ్ విల్మర్, సునీతా విలియమ్స్ లను తిరిగి భూమిపైకి తీసుకురావడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. వారిని ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే, ఈ సందర్భంగా ఆయన భారత-అమెరికన్ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ గురించి అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఆమె గురించి చెబుతూ “పిచ్చిపిచ్చిగా జుట్టు ఉన్న మహిళ” అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సర్దుకుని ఆమె జుట్టుతో ఆటలాడవద్దు అన్నారు. ఈ వ్యాఖ్యలపై సునీత విలియమ్స్ అభిమానులు, మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
బైడెన్ వల్లనే..
బోయింగ్ స్టార్ లైనర్ లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా బుచ్ విల్మర్, సునీతా విలియమ్స్ లు ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయారు. ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సినవారు 8 నెలలైనా అక్కడే ఉండిపోయారు. వారి ఈ దుస్థితికి గత అధ్యక్షుడు జో బైడెన్ కారణమని ట్రంప్ విమర్శించారు. నాటి అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హారిస్ లు బుచ్ విల్మర్, సునీతా విలియమ్స్ లను అక్కడే వదిలేశారని విమర్శించారు. వారిని తిరిగి తీసుకురావడానికి త్వరలో చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.
మస్క్ స్పేస్ ఎక్స్ తో..
వారిని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాల్సిందిగా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ను కోరినట్లు ట్రంప్ తెలిపారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సెప్టెంబర్ నుంచి ఈ స్టేషన్ లో ఉందని, వారు తిరిగి రావడానికి ఇదే మార్గమని ట్రంప్ పేర్కొన్నారు. వారిని తీసుకురావడానికి ఎలన్ మస్క్ కు వారం క్రితం అనుమతి ఇచ్చానని చెప్పారు. కాగా, స్పేస్ ఎక్స్ నౌక మార్చి 16న ఆ ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకురానుందని నాసా తెలిపింది.
సునీతా విలియమ్స్ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన వ్యోమగాముల గురించి ట్రంప్ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారని నెటిజనులు మండిపడుతున్నారు. ‘‘ఇద్దరు ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయారు. వారు ఒకరినొకరు ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను, బహుశా వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారేమో.. నాకు తెలియదు. కానీ వారిని అక్కడే వదిలేశారు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సునీత విలియమ్స్ గురించి అసందర్భంగా మాట్లాడారు. ఆమెను “అడవి జుట్టు ఉన్న మహిళ” అని సంబోధించారు. కానీ వెంటనే “ఆమెకు మంచి దృఢమైన జుట్టు ఉంది, ఆమె జుట్టుతో ఆటలు లేవు” అని అన్నారు. సునీత విలియమ్స్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతీయులతో పాటు ఆమె అభిమానుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. ఐఎస్ఎస్ లో వెంట్రుకలు తేలియాడుతున్న సునీత విలియమ్స్ వీడియో వైరల్ కావడంతో ట్రంప్ ఈ కామెంట్ చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్
ఇదిలా ఉంటే సునీత విలియమ్స్ పై ట్రంప్ చేసిన వైల్డ్ హెయిర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ను ‘అడవి జుట్టు’ ఉన్న మహిళగా పేర్కొంటూ డొనాల్డ్ ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని ఒకరు ట్వీట్ చేశారు. ‘ఎంత మూర్ఖుడు’ అంటూ మరో యూజర్ స్పందించాడు. “అతను ఈ మధ్య అన్ని రకాల విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు” అని మరొకరు ప్రతిస్పందించారు.
అంతరిక్షంలో ఉన్నప్పుడు వ్యోమగాములు జుట్టును కత్తిరించుకోరా?
అంతరిక్షంలో వ్యోమగాములు తమ జుట్టును కత్తిరించుకోవడానికి ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తారని నాసా ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతరిక్షంలో ఉన్నప్పుడు వ్యోమగాములు తమ జుట్టును కత్తిరించుకుంటున్న వీడియోలను అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు విడుదల చేశాయి. అంతరిక్షంలో తమ జుట్టును కత్తిరించేటప్పుడు వ్యోమగాములు సక్షన్ అటాచ్మెంట్ తో కూడిన ప్రత్యేక క్లిప్పర్లను ఉపయోగిస్తారని నాసా ప్రతినిధి లోరా బ్లీచర్ తెలిపారు. వ్యోమగాములు తమ హెయిర్ ను షేవ్ చేయడానికి భూమిపై ప్రజలు ఉపయోగించే క్రీములు, రేజర్లనే ఉపయోగిస్తారని వెల్లడించారు. వ్యోమగాముల షేవింగ్, హెయిర్ ట్రిమ్మింగ్ లను పలు అంతరిక్ష సంస్థలు డాక్యుమెంట్ చేశాయి. మాజీ వ్యోమగామి క్రిస్టోఫర్ కాసిడి ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు షేవింగ్, హెయిర్ కట్ చేయించుకున్న వీడియోను 2013లో నాసా విడుదల చేసింది.
సంబంధిత కథనం
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link