

Best Web Hosting Provider In India 2024
Kendriya Vidyalaya Recruitment 2025 : తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగ ఖాళీలు – కేవలం ఇంటర్వ్యూనే..!
Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025: సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరికొన్ని నాన్ టీచింగ్ ఖాళీలు కూడా ఉన్నాయి. మార్చి 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి.
సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు మార్చి 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.
ఖాళీల వివరాలు….
ఈ నోటిఫికేషన్ లో భాగంగా పీజీటీ(ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, జాగ్రాఫి, ఎకనామిక్స్, కామర్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) పోస్టుల భర్తీకి మార్చి 12వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇక పీజీటీ(కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, క్రాఫ్ట్ టీచర్, మ్యూసిక్ టీచర్, డాన్స్ టీచర్, యోగా టీచర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, డాక్టర్, నర్స్) పోస్టులకు సంబంధించి మార్చి 13వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయని నోటిఫికేషన్ లో తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యలో వీటిని నిర్వహిస్తారు.
పీజీటీ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు… ఆయా కోర్సుల్లో బీఈడీతో పాటు పీజీ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి నైపుణ్యం ఉండాలి. సీటెట్ లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక మిగతా పోస్టుల అర్హతలు చూస్తే… ఆయా కోర్సుల్లో డిగ్రీ లేదా డిప్లోమా చేసి ఉండాలి. విద్యార్హత, వయోపరిమితి మొదలైన వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడగలరు.
ఇంటర్వూలు మార్చి 12, 13 తేదీల్లో ఉంటాయి. కేంద్రీయ విద్యాలయం, తిరుమలగిరి, సికింద్రాబాద్-500015 చిరునామాలో వీటిని నిర్వహిస్తారు. ఏమైనా వివరాలు తెలుసుకోవాలంటే.. 040-29805230 నెంబర్ లేదా principalkvt@gmail.com మెయిల్ ను సంప్రదించవచ్చు.
టాపిక్