Self Motivational Techniques: ఫ్యామిలీ కోసం ఏం చేయడానికి రెడీయాా? ముందుగా ఈ పనులు చేయండి, మిమ్మల్ని మీరు మలచుకోండి!

Best Web Hosting Provider In India 2024

Self Motivational Techniques: ఫ్యామిలీ కోసం ఏం చేయడానికి రెడీయాా? ముందుగా ఈ పనులు చేయండి, మిమ్మల్ని మీరు మలచుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Mar 09, 2025 05:30 AM IST

Self Motivational Techniques: ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ కోసం ఏమైనా చేసేయగలమని చెప్తుంటారు. దాదాపు ప్రాణత్యాగానికైనా సిద్ధమే అనే రీతిలో ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ, అంతకంటే ముందు వారు చేయాల్సిన పనులు మర్చిపోతారు. మీరూ ఇదే ఫీలింగ్‌లో ఉంటే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.

జీవితంలో విజయాలు పొందడానికి మోటివేషన్ పొందడం ఎలా
జీవితంలో విజయాలు పొందడానికి మోటివేషన్ పొందడం ఎలా

బాద్యతలను నెరవేర్చడానికి కూడా ఏ దారీ కనపడక జీవితంతో విసిగిపోయి ఆందోళన పడుతుంటారు కొందరు. తాము అనుకున్న దానిని చచ్చి అయినా సాధిస్తామని బీరాలు పోతుంటారు. ఇలాంటి వాళ్లు నిత్య జీవితంలో మీకు చాలా మందే కనిపించొచ్చు. కానీ, నిజంగా వాళ్లకు ఆ పని పూర్తి చేయడానికి చావాల్సిన పని లేదు. చిత్తశుద్ది ఉంటే చాలు. కుటుంబం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ విషయాలను గుర్తుపెట్టుకుని తూచా తప్పకుండా ఫాలో అయిపోతే చాలు.

ఎక్సర్‌సైజ్ చేయడం:

  • శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శక్తి పెరుగుతుంది.
  • కండరాలు, ఎముకలు బలపడతాయి.
  • మనసు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
  • శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.

కోపం కంట్రోల్ చేసుకోవడం:

  • ఆరోగ్యంగా ఉంటారు, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
  • మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, జీవితంపై మంచి దృష్టి ఏర్పడుతుంది.
  • ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి, మీ చుట్టూ స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.

మెంటల్ హెల్త్ సెట్ చేసుకోవడం:

  • ఒత్తిడి, నిరాశ, ఆందోళన తగ్గిపోతుంది.
  • మానసిక దృఢత్వం పెరుగుతుంది, జీవితం పై పాజిటివ్ దృష్టి ఏర్పడుతుంది.
  • మనసులో నమ్మకాలు, ఆశయాలు కలుగుతాయి, పట్టు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దృఢమైన నమ్మకం కలుగుతుంది.

నిద్రా సమయాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం:

  • రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడి వ్యాధులు కలిగే ప్రమాదం తగ్గుతుంది.
  • మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా వ్యవహరిస్తారు.
  • సర్వసాధారణ జీవనశైలి పొందడానికి శక్తి ఉంటుంది.
  • మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

కలలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడం:

  • ప్రేరణ కలుగుతుంది, ఆశలు, లక్ష్యాల పట్ల ఉద్వేగం పెరుగుతుంది.
  • మనసులో జీవితంపై ఆశ, చురుకైన ఉత్సాహం కలుగుతుంది.
  • ఒక లక్ష్యాన్ని సాధించేందుకు ఉత్సాహం ఉండటం వల్ల విజయం సాధించే అవకాశం పెరుగుతుంది.
  • జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పరచుకుంటారు.

చెడ్డ అలవాట్లను మానుకోవడం:

  • శరీరం, మానసిక ఆరోగ్యం మరింత బలపడుతుంది.
  • జంక్ ఫుడ్, పానీయాలు తగ్గించి మంచి ఆహారం తీసుకోవడం వల్ల, శరీరంలో అవసరమైన పోషకాలు అందిపుచ్చుకుంటాయి.
  • ఆరోగ్యకరమైన అలవాట్లు ఏర్పడతాయి, ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

సరైన ఆహారం తీసుకోవడం:

  • శరీరానికి పోషకాలను సమర్ధంగా అందిస్తే, శక్తి పెరుగుతుంది.
  • వ్యాధులు తగ్గిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • శరీర బరువు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది.
  • మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, చేయాలనుకున్న పనిపై శక్తివంతంగా ఫోకస్ ఉంచగలుగుతారు.

పైన తెలిపిన అంశాలు ప్రతి ఒక్కటి మన జీవితానికి విలువైన మార్గదర్శకాలుగా ఉంటాయి. మిమ్మల్ని మీరు నియంత్రణలో ఉంచుకోవడానికి ఇవి సరిపోతాయి. తమకు తాముగా ఈ పని చేయగలమా.. అనే సందేహంలో ఉంటే అది మిమ్మల్ని కుంగదీస్తుంది. అలా డీమోటివేట్ అవకుండా సానుకూలంగా ఆలోచించాలి. ఎల్లప్పుడూ సాధించగలమనే దృక్పథంతో వ్యవహరిస్తే విజయానికి చేరువ అవ్వొచ్చు. అంతేగానీ, ప్రాణత్యాాగాలకు లేదా ప్రాణంతో రిస్క్ అయ్యే పనులు చేయకండి. మీరు బాగుంటేనే మీ కుటుంబాన్ని బాగా చూసుకోగలరు. ప్రాణత్యాగం చేసి మీరు సాధించే విజయంలో మీరు లేనప్పుడు, ఆ ఫలితం వృథాయేనని అర్థంచేసుకోండి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024