OTT: ఓటీటీలోకి ఒక్కరోజే 23 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

OTT: ఓటీటీలోకి ఒక్కరోజే 23 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Published Mar 09, 2025 05:30 AM IST

OTT Movies Release In Telugu: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. అలాగే, అందులో తెలుగులో 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్ని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలోకి ఒక్కరోజే 23 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఒక్కరోజే 23 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7.. ఇక్కడ చూసేయండి!

OTT Release In Telugu: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. రొమాంటిక్, ఎమోషనల్, కామెడీ, ఇన్వెస్టిగేటివ్, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

తండేల్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 7

నదానియాన్ (తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ హిందీ మూవీ)- మార్చి 7

కేయాస్ ది మ్యాన్షన్ మర్డర్స్ (డాక్యుమెంటరీ)- మార్చి 7

డెలిషియస్ (జెర్మన్ మిస్టరీ థ్రిల్రర్ మూవీ)- మార్చి 7

వెన్ లైఫ్ గివ్స్ టాంగేరిన్స్ (కొరియన్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 7

ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 7(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మార్చి 7

ప్లాంక్‌టన్: ది మూవీ (అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ ఫిల్మ్)- మార్చి 7

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మనమే తెలుగు (రొమాంటిక్ లవ్ డ్రామా చిత్రం)- మార్చి 7

దుఫాహియా (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 7

డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (మలయాళ ఇన్వెస్టిగేట్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 7

ఎఫ్ మ్యారీ కిల్ (ఇంగ్లీష్ కామెడీ అడ్వెంచర్ సినిమా)- మార్చి 7

సోనీ లివ్ ఓటీటీ

రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మార్చి 7

ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిస్టారికల్ హిందీ వెబ్ సిరీస్)- మార్చి 7

జియో హాట్‌స్టార్ ఓటీటీ

బాపు (తెలుగు డార్క్ కామెడీ డ్రామా చిత్రం)- మార్చి 7

ఫతే (హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 7

తగేష్ వర్సెస్ ది వరల్డ్ (హిందీ వెబ్ సిరీస్)- మార్చి 7

కట్ త్రోట్ సిటీ (ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 7

ఆహా ఓటీటీ

లైలా (తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 7

కుళంతైగల్ మునేత్రకళగం (తమిళ పొలిటికల్ డ్రామా సినిమా)- మార్చి 7 (ఆహా తమిళం)

జీ5 ఓటీటీ

గేమ్ ఛేంజర్ (హిందీ డబ్బింగ్ తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 7

కుడుంబస్తాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- మార్చి 7

బారా బై బారా (హిందీ డ్రామా చిత్రం)- బుక్ మై షో ఓటీటీ- మార్చి 7

రాజాకిలి (తమిళ యాక్షన్ డ్రామా సినిమా)- టెంట్‌కోట ఓటీటీ- మార్చి 7

ఓటీటీలోకి 23

ఇలా శుక్రవారం (మార్చి 7) ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి ఏకంగా 23 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీ, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహిం అలీ ఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ జంటగా నటించిన నదానియాన్, శర్వానంద్-కృతీ శెట్టి మనమే, రేఖాచిత్రం, బాపు, విశ్వక్ సేన్ లైలా, కుడుంబస్తాన్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ 11- తెలుగులో 7

అలాగే, మలయాళ ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్ మూవీ డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్, ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ సిరీస్, దుఫాహియా సిరీస్, ఫతే మూవీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 23లో రెండు వెబ్ సిరీస్‌లు 9 సినిమాలతో 11 స్పెషల్‌గా ఉంటే.. తెలుగులో 7 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024