



Best Web Hosting Provider In India 2024

How To Be a Good Boss: మంచి బాస్ అనిపించుకోవాలంటే ఆఫీసులో ఇలా బిహేవ్ చేయండి!
How To Be a Good Boss: బాస్ అయినప్పటికీ మీరు ఆఫీసులోని అందరితో బాగుండాలనుకుంటున్నరా? తప్పు ఒప్పులు ఉన్నప్పటికీ ఎవరినీ నొప్పించకుండా మాట్లాడాలి అనుకుంటున్నారా? అయితే మంచి బాస్ అనిపించుకునే వారు ఎక్కువగా ఉపయోగించే కొన్ని మాటలు, వారి ప్రవర్తన తీరు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఓ లుక్కేయండి!

మంచి బాస్ అంటే అలా ఇలా ఉండాలి అని ఎవరూ చెప్పలేరు. కానీ అందరితో మంచిగా మాట్లాడాడటం వారికుండాల్సిన ముఖ్య లక్షణం. మంచిగా మాట్లాడితే కింద పనిచేసే ఉద్యోగులు దాన్ని అలుసుగా తీసుకుని పని చేయడం మానేస్తారేమో అనే భయం కొందరిలో ఉంటుంది. అలా అని తప్పు ఒప్పులను ఎంచి మందలిస్తే మా బాస్ టార్చర్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతారేమో అనే ఫీలింగ్ కూడా కొందరిలో ఉంటుంది.
మీరు కూడా ఇలాంటి తర్జనబర్జనలోనే ఉండి ఉంటే మీ కింద పనిచేసే లేకపోతే మీ పనిచేసే సహాద్యోగులతో ఆఫీసులో ఎలా మాట్లాడాలో, వారితో ఎలా ప్రవర్తించాలో ఇక్కడ తెలుసుకోవచ్చు. మంచి బాస్ అనిపించుకునే చాలా మంది వ్యక్తులు ఆఫీసులో ఇలాంటి మాటలను ఎక్కువగా ఉపయోగిస్తారట.అవేంటో చూద్దాం రండి..
1. ఉద్యోగుల కృషిని గుర్తించాలి..
మంచి బాస్ అనిపించుకోవాలంటే ఇతరుల కష్టానికి ఫలితం మీరు అనుభవించడం కాదు వారే అనుభవించేలా చేయాలి. ఉద్యోగుల కష్టాన్ని మీ గొప్పతనంగా తీసుకోకూడదు. వారి శ్రమను ఎల్లప్పుడూ గుర్తించాలి.
2. వారు చేసిన పనిని మెచ్చుకోవాలి..
పొగడ్త అంటే అందరికీ ఇష్టమే. కానీ మీరు ప్రత్యేకంగా వారి పని గురించి పొగడటం వల్ల వారిని ఈజీగా ఇంప్రెస్ చేయచ్చు. ఇది వారికి మంచి మోటివేషన్‌లా కూడా పనికొస్తుంది. ఉద్యోగులు చేసిన పనిని మెచ్చుకోవడం వల్ల వారు మరింత బాగా పనిచేసేలా చేస్తుంది.
3. వారి మాటలు వినాలి..
ఇతరులపై మీ ప్రభావం మరింత పాజిటివ్‌గా ఉండాలంటే ముందు వారి ఆలోచన తెలుసుకోండి. వారి మాటలను వినండి. ఇది అవతల వ్యక్తి పట్ల మీకున్న నమ్మకాన్ని చూపిస్తుంది.
4. అధికారాన్ని చూపించకూడదు
మంచి బాస్ అనిపించుకోవాలంటే ఉద్యోగులకు ఏదైనా పని చేయమని చెప్పకండి, చేయమని అడగండి. అడిగే విధానం ఆర్డర్ చేసినట్టు కాకుండా సహాయం కోరుతున్నట్లుగా ఉంటే ఎవ్వరైనా ఇంప్రెస్ అవుతారు. పని త్వరగా చేసి పెట్టాలని ఆశ పడతారు.
4. మంచిని మెచ్చుకోవాలి
మీ కింద పని చేసే వారి ఆలోచన విధానం మీకు నచ్చినప్పుడు నచ్చిందని నేరుగా చెప్పడానికి సంకోచించకండి. మీ ఆలోచన చాలా బాగుంది. ఆచరిద్దాం అనడం వారికి చాలా సంతోషాన్నిస్తుంది. వారు మరింత ఉత్సాహంగా పని చేసేలా చేస్తుంది.
5. సలహాలు తీసుకోవాలి
ఏం చేయాలో మీరే చెప్పండి అని వారితో వాదించే కన్నా.. ఎలా చేయాలో మీ సలహా కావాలని ఉద్యోగులను బాస్ అడగడం చాలా మంచి విషయం. ఇది చక్కటి వర్క్ కల్చర్ ని, పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. నాకు నీ సలహా కావాలి అని అడిగితే ఇతరులు మరింత గొప్పగా ఫీలవుతారు. వారి ఆలోచనలకు మీకు ప్రాధాన్యత ఇస్తున్నారని గ్రహిస్తారు.
6. వారి సామర్థ్యాన్ని తీసిపడేయకూడదు
మీరు ఇచ్చిన పనిని మీ ఉద్యోగి సరిగ్గా చేయకపోతే నువ్వు ఏదీ చేయలేవు, ఎందుకు పనికి రావు అని వారిని తీసిపడేకండి. వారు ఎందుకు చేయలేదు కారణం తెలుసుకోండి.సమస్య తెలిసుకుని పరిష్కారాన్ని ఆలోచించడం మీకుండాల్సిన ముఖ్య లక్షణం. తొందరి పడి మాటలు జారితే మనస్పర్థలు వస్తాయి.ఉద్యోగులపై ఒత్తిడి పెరిగి పని చేయలేరు.
సంబంధిత కథనం