Chiranjeevi: చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. అందులో మేము అందరికంటే ధనికులం.. చిరంజీవి కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Chiranjeevi: చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. అందులో మేము అందరికంటే ధనికులం.. చిరంజీవి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Mar 09, 2025 06:24 AM IST

Chiranjeevi About Family And Anjana Devi On Mega Womens Day Interview: మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2025 సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు మెగా ఉమెన్స్ డే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన తల్లి అంజనా దేవి, మెగా కుటుంబం గురించి చిరంజీవి తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. అందులో మేము అందరికంటే ధనికులం.. చిరంజీవి కామెంట్స్
చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. అందులో మేము అందరికంటే ధనికులం.. చిరంజీవి కామెంట్స్

Chiranjeevi About Mother Anjana Devi On Womens Day 2025: మహిళా దినోత్సవం 2025 సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. మెగా బంధాన్ని, మహిళా సాధికారితను చాటి చెప్పేలా చిరంజీవి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.

ఉమెన్స్ డే 2025 సందర్భంగా

ఈ క్రమంలో అంజనమ్మ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచిన తీరు, ఉమ్మడి కుటుంబ విలువల్ని పంచడం గురించి అంజనమ్మ ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఇక అంజనమ్మ గురించి మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి చెప్పిన విషయాలు, ఉమెన్స్ డే 2025 సందర్భంగా మెగా మహిళా కుటుంబం, చిరంజీవీ చెప్పిన ఆసక్తికర సంగతులు ఏంటో చూద్దాం.

అమ్మ నాన్నల నుంచే

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. “ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, ఈ విలువలు అన్నీ కూడా తమకు అమ్మా నాన్నల నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. ఆ డబ్బుతోనే మా ఫ్యామిలీని పోషించారు. అమ్మ సైడ్ ఫ్యామిలీని కూడా చూసుకున్నారు. అమ్మ సైతం మా నాన్న గారి ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునేవారు” అని అన్నారు.

భరోసా వేరేలా ఉంటుంది

“అలా అప్పటి నుంచే మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి తెలిసి వచ్చాయి. అందుకే మేం ఇప్పటికీ కలిసి కట్టుగా ఉంటాం. మేం ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో అందరి కంటే ధనికులం. ఒక్కో సారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు. కానీ, ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా వేరేలా ఉంటుంది” అని చిరంజీవి తెలిపారు.

నైతికంగా భరోసా

“మా కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా.. మిగిలిన వారంతా వచ్చి కాపాడుకుంటాం. ఎప్పుడూ అందరూ కలిసి మెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి అనే మా అమ్మ చిన్నతనం నుంచి నేర్పారు. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ ఓ పాజిటివిటీ ఉంటుంది. ఎవరికైనా సరే మా ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా, కాస్త బాధల్లో ఉన్నా కూడా అమ్మే అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. అందరికీ నైతికంగా భరోసానిస్తారు” అని మెగాస్టార్ పేర్కొన్నారు.

పనులు చేసేవాడు కాదు

“చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని. అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసే వాడు కాదు. ఇక కల్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. రాజకీయ నిరసనలు చేసి బాగా కష్టపడుతున్నాడు.. బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటకాలు వండి పెడుతుంటారు. కల్యాణ్ బాబు ఎక్కడున్నాడో ఇంట్లో ఎవ్వరికీ తెలిసినా తెలియకపోయినా అమ్మకి మాత్రం తెలిసిపోతుంది” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

అమ్మ గారే కారణం

“నా నిర్ణయానికి అమ్మానాన్నలు ఎంతో గౌరవాన్ని ఇస్తుండేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకో అని మాత్రమే చెప్పేవారు. అలా పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వడం చాలా ప్రధానం. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకీ మేం ఇలా ఉన్నామంటే మా అమ్మ గారే కారణం” చిరంజీవి వెల్లడించారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024