



Best Web Hosting Provider In India 2024

Coffee with Vitamins: విటమిన్ ట్యాబ్లెట్స్‌తో పాటు కాఫీ తాగుతున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!
Coffee with Vitamins: ఉదయాన్నే కాఫీ తాగడం అందరికీ అలవాటే, అలాగే విటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవాలంటే కూడా ఉదయం సమయంలోనే తీసుకుంటాం. మరి ఈ రెండూ కలిపి తీసుకోవడం మంచిదేనా? ఈ కాంబినేషన్ శరీరంలోకి చేరడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి.

రోజువారీ అలవాటులో భాగంగా కచ్చితంగా కాఫీ తాగే వాళ్లు చాలా మంది ఉంటారు. మనస్సు ఉల్లాసంగా అనిపించి రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందని భావిస్తారు. ఇందులో ఉండే కెఫైన్ కారణంగా అటువంటి ఫీలింగ్ కలగడం సహజమే. కానీ, ఇది తాగడం వల్ల మరో ప్రమాదం కూడా ఉందట. కాఫీ తాగే వారు దాంతో పాటు సప్లిమెంట్లు (విటమిన్ ట్యాబ్లెట్స్) తీసుకునే వారికి ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపించే విషయమే కావొచ్చు. ఎందుకంటే, కాఫీతో పాటు విటమిన్ ట్యాబ్లెట్లు శరీరంలోకి చేరితే విటమిన్ డీ, ఐరన్, కాల్షియం వంటి వాటిని శరీరం గ్రహించడంలో నెగెటివ్ ఎఫెక్ట్స్ చూపించొచ్చట. శరీరానికి చేసే మేలు కంటే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయట. ఆందోళన, సరిగా నిద్ర పట్టకపోవడం, ఎక్కువ రక్తపోటు, నీరసం వంటి సమస్యలు కలుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కాఫీతో పాటు విటమిన్లు తీసుకుంటే:
అదెలా అంటే, కాఫీలో ఉండే గుణం విటమిన్ D శోషణను అడ్డుకుంటుంది. ఇది ఎముకలలోని కణాలలోకి డీ విటమిన్ చేరకుండా చేస్తుంది. దాంతోపాటుగా ఐరన్, కాల్షియం వంటి పోషకాల శోషణ కూడా ఆగిపోతుందట. కాల్షియంను యూరిన్ రూపంలో బయటకు పంపించేస్తుందట. ఫలితంగా ఎముకలకు నష్టం కలిగి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోకపోయినా కాఫీని రోజుకు 5 నుంచి 7 కప్పుల వరకూ తాగుతుంటే, అది ఎముకలపై ప్రభావం చూపిస్తుందట. మీరు తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకోనివ్వకుండా అడ్డుకుంటుందట.
నార్వేజియన్ అధ్యయనంలో 20వేల మంది మహిళలపై చేసిన పరిశోధన ఫలితాలు ఇలా ఉననాయి. రోజుకు 9 కప్పుల వరకూ కాఫీ తాగే వారిలో ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా కనిపించిందట. పోస్ట్ మెనోపాజల్ (పీరియడ్స్ ఆగిపోయిన వారు) దశలో ఉన్నవారు రోజుకు రెండు కప్పులు తాగినా కూడా ఎముకలు బలహీనపడిపోతాయట. వీరు తీసుకునే ఆహారంలో విటమిన్లను శరీరం గ్రహించకుండా మూత్రం ద్వారా బయటకు పంపేస్తుందట.
కాఫీ తాగేవారు విటమిన్స్ ఎప్పుడు తీసుకోవాలి:
నీరసంగా ఉందని, లేదా ఎముకల బలం కోసం విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నట్లయితే కాఫీ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ ట్యాబ్లెట్స్ డోస్ ను బట్టి కాఫీ తాగే సమయం నిర్ణయించుకోవాలి. సాధారణంగా మీరు సప్లిమెంట్లను తీసుకునే సమయంలో, కాఫీ తాగడం మంచిది కాదని పరిశోధనలు సూచిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక గంట ముందుగా లేదా తరువాత కాఫీ తీసుకోవడం మంచిది.
విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకున్న గంట తర్వాత కాఫీ తాగితే ఐరన్ శోషణపై అంతగా ప్రభావం ఉండదు. కానీ, కాఫీ తాగిన తర్వాత విటమిన్ ట్యాబ్లెట్స్ లేదా ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే శోషణ ఆగిపోతుంది. కాఫీని ఐరన్-rich ఆహారంతో తీసుకుంటే, ఐరన్ శోషణను 39% వరకు తగ్గించేస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేద, ఆహార సప్లిమెంట్లను తీసుకునే వారు ఈ విషయం పట్ల అవగాహన పెంచుకోవాలి. ఎముకల సమస్య ఉన్న వారు రోజువారీ అలవాటైన కాఫీని మానుకోలేకపోతే, డోసేజ్ కోసం వైద్యుడి సలహా తప్పక తెలుసుకోవాలి.
సంబంధిత కథనం