Nagababu: మా తమ్ముడు పవన్ కల్యాణ్ చాలా వీక్‌గా ఉండేవాడు.. సైలెంట్‌గానే నిరసన తెలిపేవాడు.. నాగబాబు కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Nagababu: మా తమ్ముడు పవన్ కల్యాణ్ చాలా వీక్‌గా ఉండేవాడు.. సైలెంట్‌గానే నిరసన తెలిపేవాడు.. నాగబాబు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Mar 09, 2025 12:27 PM IST

Nagababu About Pawan Kalyan Chiranjeevi In Mega Women Interview: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా వీక్‌గా ఉండేవాడని, ఇంట్లో అన్నీ పనులు చిరంజీవినే చేసేవాడని నటుడు, నిర్మాత నాగబాబు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఉమెన్స్ డే ఇంటర్వ్యూలో నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మా తమ్ముడు పవన్ కల్యాణ్ చాలా వీక్‌గా ఉండేవాడు.. సైలెంట్‌గానే నిరసన తెలిపేవాడు.. నాగబాబు కామెంట్స్
మా తమ్ముడు పవన్ కల్యాణ్ చాలా వీక్‌గా ఉండేవాడు.. సైలెంట్‌గానే నిరసన తెలిపేవాడు.. నాగబాబు కామెంట్స్

Nagababu About Pawan Kalyan And Chiranjeevi: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా కుటుంబంతో ఇంటర్వ్యూ నిర్వహించారు. మెగా ఉమెన్స్ డే ఇంటర్వ్యూలో నాగబాబు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు. ఆయనతోపాటు నాగబాబు తల్లి అంజనా దేవి, మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి పలు విషయాలు పంచుకున్నారు.

దెబ్బలు పడ్డాయి

నాగబాబు మాట్లాడుతూ .. “చిన్నతనంలో నేను ఎక్కువగా పని చేసేవాడిని కాదు. అన్ని పనులు అన్నయ్యే చేసేవారు. నాకు చెప్పిన పనుల్ని కూడా అన్నయ్యకే ఇచ్చేవాడిని. అలా అప్పుడప్పుడు అన్నయ్య చేతిలో నాకు దెబ్బలు కూడా పడ్డాయి (నవ్వుతూ)” అని అన్నారు.

“చిన్నప్పుడు మా తమ్ముడు కల్యాణ్ బాబు (పవన్ కల్యాణ్) చాలా వీక్‌గా ఉండేవాడు. అందుకే మా అమ్మ కళ్యాణ్ బాబు మీద ఎక్కువ కేరింగ్‌గా ఉండేవారు. ఇప్పటికీ కళ్యాణ్ బాబు వస్తున్నాడంటే ఇష్టమైన వంటకాలన్నీ వడ్డిస్తుంటారు. తిండి విషయంలో అన్నయ్య ఏం పెట్టినా సైలెంట్‌గా తినేసేవారు. కానీ, నేను మాత్రం ఇంట్లో అల్లరి చేసేవాడిని. కళ్యాణ్ బాబు అయితే నచ్చితే తింటాడు లేదంటే సైలెంట్‌గా వెళ్లిపోతాడు. సైలెంట్‌గానే నిరసన తెలిపేవాడు” అని నాగబాబు చెప్పారు.

హగ్ చేసుకుంటే

“మా అమ్మని హగ్ చేసుకుంటే నాకున్న బాధలన్నీ మాయం అవుతాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఉన్నట్టుగా.. మా అమ్మ దగ్గర ఆ శక్తి ఉంటుంది. మా అమ్మని హగ్ చేసుకుంటే నాకు ఎనలేని ఎనర్జీ వస్తుంది” అని నాగబాబు తెలిపారు.

అంజనమ్మ మాట్లాడుతూ .. “మా శంకర్ బాబు (చిరంజీవి) చిన్నతనం నుంచి ఎక్కువగా కష్టపడ్డాడు. చిన్నప్పుడు అంతా నాతోనే ఉండేవాడు. నాకు పనుల్లో సాయం చేస్తుండేవాడు. ఇంటా, బయట పనులు చేసేవాడు” అని వెల్లడించారు.

ప్రేమలు కనిపించడం లేదు

“అందరూ కలిసి ఉండాలి.. అందరితో ప్రేమగా ఉండాలి.. ఉమ్మడి కుటుంబంగానే ఉండాలి అని నా పిల్లలకు నేర్పించాను. కానీ, ఇప్పుడు అంతగా ప్రేమలు కనిపించడం లేదు. ఉమ్మడి కుటుంబాలు కూడా కనిపించడం లేదు. అందరూ కలిసి మెలిసి ప్రేమతో ఉండాలి” అని అంజనా దేవి తెలిపారు.

విజయదుర్గ మాట్లాడుతూ .. “మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మా మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు” అని అన్నారు.

ఒంటరి అయిపోయానే

మాధవి మాట్లాడుతూ .. “మా అమ్మ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు. మా అమ్మ నాకు ఎప్పుడూ అండగా ఉంటారు” అని అన్నారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024