




Best Web Hosting Provider In India 2024

Laila OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్సేన్ ‘లైలా’.. రెండు రోజులు ఆలస్యంగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Laila OTT Streaming: లైలా చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా వచ్చిన డేట్ కంటే రెండు రోజులు ఆలస్యంగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

లైలా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. యంగ్ హీరో విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం క్రేజ్ మధ్య ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఈ కామెడీ యాక్షన్ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కమర్షియల్‌గా ప్లాఫ్ అందుకోవడంతో పాటు విమర్శలను మూటగట్టుకుంది. ఈ లైలా చిత్రం నేడు (మార్చి 9) ఓటీటీలో స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇచ్చింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
లైలా సినిమా నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. తెలుగులో ఒక్కటే ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు వారాలకు ఈ లైలా చిత్రం ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.
ఆలస్యంగా స్ట్రీమింగ్.. ఆహాలో ఎప్పుడో!
లైలా చిత్రం మార్చి 7వ తేదీనే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్కు వస్తుందనే రూమర్లు బలంగా వినిపించాయి. ఆహా కూడా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందనే సమాచారం బయటికి వచ్చింది. అయితే, మార్చి 7న ఈ మూవీ స్ట్రీమింగ్కు రాలేదు. అందుకు రెండు రోజులు ఆలస్యంగా ఇప్పుడు లైలా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. అయితే, ఆహాలో వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది.
లైలా సినిమాలో విశ్వక్సేన్ను జోడీగా ఆకాంక్ష శర్మ కనిపించారు. విశ్వక్ లేడీ గెటప్లోనూ నటించారు. ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. అయితే, ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. అసభ్యత, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎక్కువగా ఉన్నాయనే కామెంట్లు వినిపించారు. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ కాలేకపోయింది.
లైలా సినిమా కమర్షియల్‌గా నష్టాలను మూటగట్టుకుంది. ఈ చిత్రం దాదాపు రూ.16కోట్ల బడ్జెట్‌తో రూపొందిందని అంచనా. ఈ చిత్రం ఓవరాల్‌గా సుమారు రూ.2కోట్ల గ్రాస్ కలెక్షన్లనే దక్కించుకుంది. విశ్వక్ కెరీర్లో లోయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచి నిరాశపరిచింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
లైలా చిత్రంపై విమర్శలు ఎక్కువగా రావటంతో ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు విశ్వక్సేన్. ఇక నుంచి తాను ఎలాంటి సినిమాతో వచ్చినా అసభ్యత ఉండదని మాటిచ్చారు. తనకు మద్దతు కొనసాగించాలని కోరారు.
విశ్వక్సేన్ ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్‌తో ఓ కామెడీ డ్రామా మూవీ చేస్తున్నారు. ఫంకీ అనే టైటిల్ కూడా ఈ చిత్రానికి ఫిక్స్ అయింది. డైరెక్టర్ శ్రీధర్ గంటాతోనూ మరో మూవీ చేయనున్నారు విశ్వక్.
సంబంధిత కథనం