



Best Web Hosting Provider In India 2024

Throat pain: గొంతునొప్పి వల్ల ఆహారం మింగడంలో ఇబ్బందిగా ఉందా? ఆ నొప్పికి ఇవి కారణాలు కావచ్చు
గొంతునొప్పి అనేది ఒక సాధారణ సమస్య, కానీ ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది వచ్చిందంటే కొన్ని గంటల పాటూ బాధపెడుతుంది. గొంతు నొప్పికి కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

మారుతున్న వాతావరణం వల్ల లేదా తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కొందరు తరచుగా గొంతు నొప్పి సమస్య బారిన పడుతూ ఉంటారు. ఇది వినేందుకు చిన్న సమస్య అయినా, అది పెట్టే బాధ మాత్రం ఎక్కువే. అయితే ఈ సమస్య కూడా రెండు మూడు రోజుల్లోనే నయమవుతుంది. ఆ రెండు మూడు రోజులు మాత్రం నరకంలా అనిపిస్తుంది. అయితే ఇన్ని హోం రెమెడీస్ పాటించి మందులు వాడినా ఈ నొప్పి తగ్గకపోతే కంగారుగా అనిపిస్తుంది.
గొంతు నొప్పి రావడానికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. చాలాసార్లు ఈ నొప్పి క్కువగా ఉంటుంది, ఆహారం తినడానికి ఇబ్బంది పడుతుంది. గొంతు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కింద ఇచ్చిన కారణాల్లో ఏదో ఒక దాని వల్ల గొంతు నొప్పి రావచ్చు.
1) వైరల్ ఇన్ఫెక్షన్
గొంతు నొప్పికి వైరస్ చాలా సాధారణ కారణం. వైరల్ ఇన్ఫెక్షన్ గొంతు దిగువ భాగంలో నొప్పిని కలిగిస్తుంది. మీకు వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గొంతు నొప్పితో పాటు, మీకు జ్వరం, ముక్కు కారడం, దగ్గు కూడా ఉండవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే నొప్పి చాలా బాధ పెడుతుంది.
2) సైనస్ ఇన్ఫెక్షన్
సైనస్ అనేది పుర్రెలోని బోలు కుహరాల సమూహం. బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ కూడా సైనస్ కు సోకి ముక్కు కారడానికి కారణమవుతాయి. అదే సమయంలో, శ్లేష్మం గొంతు వెనుక వైపు ప్రవహించినప్పుడు ఇది జరుగుతుంది. శ్లేష్మం గొంతులో నొప్పిని కలిగిస్తుంది. దీనికి మందులు వాడాల్సి వస్తుంది.
3) అలెర్జీలు
దుమ్ము, బూడిద లేదా చుండ్రు వల్ల అలెర్జీలు కలుగుతాయి. ముక్కు నుండి నీరు కారడానికి కారణమవుతాయి, ఇది గొంతు నొప్పికి కారణమవుతుంది. కొంతమంది అలెర్జీల వల్ల కలిగే మంట నుండి దురదను అనుభవిస్తారు.
4) యాసిడ్ రిఫ్లక్స్
మీరు నిద్రపోతున్నప్పుడు పొట్టలొని ఆమ్లం అన్నవాహిక, గొంతు వెనుక భాగం, నోటిలోకి ప్రయాణిస్తుంది. ఈ కారణంగానే యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా గొంతు నొప్పి తరచుగా ఉదయం పూట కనిపిస్తుంది.
5) గొంతు క్యాన్సర్
గొంతు క్యాన్సర్ కు సంబంధించిన కణితులు గొంతు నొప్పిని కలిగిస్తాయి. గొంతు నొప్పికి ఇది అరుదుగా కనిపించే కారణం. ఇతర కారణాలు ఎక్కువగా ఉంటాయి.
కొన్ని రకాల టిబి, గొంతు ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. టిబి ఊపిరితిత్తులకు మాత్రమే పరిమితం కాదు, ఇది గొంతు శోషరస కణుపులకు కూడా వ్యాపిస్తుంది. ఇది గొంతు నొప్పి, వాపు, ఇతర లక్షణాలను కలిగిస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
నిరాకరణ: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే మరియు వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.