


Best Web Hosting Provider In India 2024

Dishwash Sponge Uses: పాత్రలు కడుక్కోవడానికి ఉపయోగించే స్పాంజిని ఇలా ఉపయోగించారంటే డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి!
Dishwash Sponge Uses: పాత్రలు కడుక్కోవడానికి ఉపయోగించే స్పాంజి మీరు రోజూ చేసే చాలా రకాల పనులను సులభతరం చేస్తుందని మీకు తెలుసా! అవును పాత్రలు కడుక్కోవడానికి మాత్రమే కాకుండా.. స్పాంజిని ఉపయోగించే కొన్ని అద్భుతమైన ఐడియాస్ ఇక్కడ తెలుసుకోండి.

ఇంట్లో పాత్రలపై ఉన్న జిడ్డును, మురకిని శుభ్రం చేసి, వాటిని కొత్తలా మెరిపించడానికి స్క్రబ్ లేదా స్పాంజిని ఉపయోగిస్తాం. వీటిని వేరే విధంగా కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇప్పటివరకూ ఈ స్క్రబ్ లేదా స్పాంజీలను కేవలం పాత్రలు కడగడానికి మాత్రమే ఉపయెగించి ఉంటారు. నిజానికి వీటిని మీరు చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. రోజూ మీరు చేసే చాలా రకాల పనులను ఇవి ఈజీగా చేయగలవు. అంతేకాదు ఇవి మీ డబ్బును, సమయాన్ని కూడా ఆదా చేస్తాయి. స్పాంజి, స్క్రబ్‌లను ఉపయోగించే కొన్ని ఉపయోగకరమైన ఐడియాస్‌ను మేము మీకోసం తీసుకొచ్చాం. వీటిని తెలుసుకున్న తర్వాత మీరు ‘వావ్! ఈ స్పాంజి ఎంత ఉపయోగకరమైనది’ అని ఫీలవుతారు.
మానిక్యూర్ టూల్‌గా ఉపయోగించవచ్చు
మహిళలు మానిక్యూర్, పెడిక్యూర్ కోసం మార్కెట్ నుండి ఖరీదైన టూల్స్ కొంటారు. కానీ స్క్రబ్ సహాయంతో మీరు తక్కువ ఖర్చుతో మానిక్యూర్-పెడిక్యూర్ టూల్స్ తయారు చేసుకోవచ్చు.అంతేకాదు పాత్రలు కడిగే స్క్రబ్ సహాయంతో మీరు చాలా సులభంగా నెయిల్ పెయింట్ రిమూవర్ బ్రష్, మానిక్యూర్ డివైస్ , నెయిల్ స్క్రబ్బర్‌లను తయారు చేసుకోవచ్చు. గోర్లు శుభ్రం చేయాలన్నా లేదా చేతులు-కాళ్ళు శుభ్రం చేయాలన్నా మీరు స్క్రబ్‌ను ఉపయోగించి చూడండి మంచి ఫలితం కనిపిస్తుంది. నెయిల్ ఆర్ట్ వేసుకోవడంలో కూడా స్పాంజిని చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఐస్ ప్యాక్‌లా వాడుకోవచ్చు
కిచెన్‌లో పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజిని ఐస్ ప్యాక్ గా కూడా వాడుకోవచ్చు.ఇది మీరు చేసే ఖర్చును కూడా ఆదా చేస్తుంది. అవును నిజమే కిచెన్ స్పాంజిని మీరు ఐస్‌ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. అదెలా అంటారా..దీనికి మీరు ఎక్కువగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. స్పాంజిని నీటిలో తడి చేసి, జిప్ లాక్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి, ఫ్రీజర్‌లో ఉంచండి. కొన్ని గంటల్లోనే మీ ఐస్ ప్యాక్ రెడీ అయిపోతుంది. ఎంచక్కా శరీరానికి, ముఖానికి అప్లై చేసుకోవచ్చు.
ఎయిర్ ఫ్రెష్నర్ తయారు చేసుకోవచ్చు
కిచెన్ స్పాంజి సహాయంతో మీరు ఎయిర్ ఫ్రెష్నర్ కూడా తయారు చేసుకోవచ్చు. స్పాంజితో ఎయిర్ ఫ్రెష్నర్ తయారు చేయడానికి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికి, ఒక కొత్త స్క్రబ్ తీసుకొని, దానిపై ఎసెన్షియల్ ఆయిల్‌ను చల్లుకోండి. ఇప్పుడు దీన్ని గాలి బాగా వెళ్ళే ప్రదేశంలో వేలాడదీయండి. కొద్ది సేపట్లోనే ఎసెన్షియల్ ఆయిల్ వాసన మొత్తం గదిలో వ్యాపిస్తుంది. గది వాతావరణం చాలా తాజాగా మారుతుంది.
టైల్స్‌ను శుభ్రం చేసుకోవచ్చు..
చాలా సార్లు, కిచెన్ లేదా బాత్రూమ్‌లో ఉన్న టైల్స్‌పై అంటుకున్న మురికిని శుభ్రం చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు స్క్రబ్ సహాయంతో మీరు వీటిని చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం మీరు ఒక చిన్న బకెట్‌లో కొంచెం నీరు తీసుకోండి. దీనిలో ఏదైనా డిటర్జెంట్ కలపండి. ఇప్పుడు స్క్రబ్‌ను ఆ నీటిలో నానబెట్టి, తేలికగా రుద్దుతూ టైల్స్‌పై ఉన్న మురికిని శుభ్రం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ టైల్స్ చాలా సులభంగా మెరుస్తాయి.
సంబంధిత కథనం