




Best Web Hosting Provider In India 2024

NNS 10th March Episode: మిస్సమ్మకి గోరు ముద్దలు కలిపి తినిపించిన అమర్.. ఎఫ్ఎంలో భాగీకి ఘోర అవమానం
NNS 10th March Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (మార్చి 10) ఎపిసోడ్లో భాగీకి అమర్ గోరు ముద్దలు కలిపి తినిపిస్తాడు. అయితే అంతకుముందు ఆమెకు ఎఫ్ఎం రేడియోలో ఘోరమైన అవమానం జరుగుతుంది.

NNS 10th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మార్చి 10) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తాను గతంలో పని చేసిన ఎఫ్ఎం రేడియో ఫ్రెండ్ కరుణను కలవడానికి కారులో అమర్ తో కలిసి వెళ్తుంది భాగీ. వాళ్లిద్దరిని మాత్రమే పంపించడానికి రాథోడ్ తనకు కడుపు నొప్పి అని నాటకమాడతాడు.
చిలుక రూపంలో విచిత్రగుప్తుడు
అమర్ ఇంట్లో ఉన్న అనామికలోని అరుంధతికి గతం గుర్తుకు తీసుకొచ్చి తన వెంట తీసుకెళ్లాలని అనుకుంటాడు విచిత్రగుప్తుడు. అమర్, భాగీ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి చిలుక రూపంలోకి మారిపోతాడు. అనామిక అంటూ ఆ చిలుక పిలవడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. తర్వాత తనను తాను పరిచయం చేసుకుంటుంది. తనతో ఓ ఆట ఆడాలని అనామికను అడుగుతుంది.
అలా అక్కడక్కడా వాలి తనను పట్టుకోవాలని చెబుతుంది. అలా చేయడం వల్ల ఇంట్లోని అరుంధతి వస్తువులను తాకి ఆమెకు గతం గుర్తుకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు ఆ చిలుకలోని విచిత్రగుప్తుడు. ఆడుతూఆడుతూ అమర్ రూమ్ లో అరుంధతి వస్తువులు దాచిన బాక్స్ ను అనామిక అనుకోకుండా కింద పడేస్తుంది.
అనామికకు అంజు వార్నింగ్
తనకు పెద్ద పనే పెట్టావనుకుంటూ ఆ డబ్బాలో నుంచి కింద పడిపోయిన అరుంధతి చీరలు, ఫొటోను తిరిగి అందులో వేయడానికి అనామిక ప్రయత్నిస్తుంది. ఆ వస్తువులను తాకగానే ఆమెలోని అరుంధతి బయటకు వస్తుందని భావించిన విచిత్రగుప్తుడు పక్కనే వేచి చూస్తుంటాడు.
ఆమె ఆ వస్తువులను తాకేలోపే అంజు అక్కడికి వస్తుంది. అనామిక అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక్కడేం చేస్తున్నావని నిలదీస్తుంది. మా అమ్మ వస్తువులను ఎందుకు కింద పడేశావని అడుగుతుంది. చిలుకతో ఆడుతున్నానని చెప్పగానే తన చెవిలో పువ్వులు కనిపిస్తున్నాయా అని అంజు అడుగుతుంది. ఆ వస్తువులను అనామిక తాకకుండానే అంజుయే వాటిని తీయడంతో విచిత్రగుప్తుడు ఉసూరుమంటాడు.
జాబ్ ఎందుకు మానేశామని భాగీని అడిగిన అమర్
అటు కారులో కరుణ దగ్గరికి అమర్, భాగీ వెళ్తుంటారు. ఇంతలో ఎఫ్ఎంలో ఆమె ప్రోగ్రామే వస్తుంటుంది. మరి నువ్వు జాబ్ ఎందుకు మానేశావ్? ఎఫ్ఎంను మిస్ కావడం లేదా అని భాగీని అమర్ అడుగుతాడు.
తన మేనేజర్ తనతో గతంలో వ్యవహరించిన తీరు, తాను ఉద్యోగం ఎందుకు మానేశానో గుర్తుకు వస్తుంది. ఆ విషయం అమర్ కు చెప్పకుండా కరుణకు ఫోన్ చేసి ఆడుకుంటానని అంటుంది. ఎఫ్ఎంలో కరుణ ద్వారా తన అభిమానులకు కూడా ఆమె హాయ్ చెబుతుంది.
మిస్సమ్మే ఆర్జే భాగీ అని తెలుసుకున్న అనామిక
ఇటు అనామిక, నిర్మల, శివరాం ఇంట్లో ఎఫ్ఎం వింటూ ఉంటారు. ఇంతలో ఆర్జే భాగీ గురించి కరుణ్ చెబుతుంది. అది విని భాగీకి తాను ఎంత అభిమానినో, ఆమెకు ఎంత ఫాలోయింగ్ ఉందో అనామిక చెబుతుంది. అది విని నిర్మల, శివరాం నవ్వడంతో ఎందుకలా నవ్వుతున్నారని అడుగుతుంది.
ఆ ఆర్జే భాగీ తమ కోడలే అని వాళ్లు చెబుతారు. అది విని అనామిక ఆశ్చర్యపోతుంది. ఈ ఇంటి కోసం ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ను వదిలేసి వచ్చిందని వాళ్లు చెబుతారు. అయినా అమర్ తనను భార్యగా చూడటం లేదని బాధపడటంతో అంతా సర్దుకుంటుందని వాళ్లతో అనామిక చెబుతుంది.
భాగీకి గోరు ముద్దలు తినిపించిన అమర్
అటు కరుణ కోసం ఎఫ్ఎం రేడియోకి వెళ్లిన భాగీకి అవమానం జరుగుతుంది. ఆమె మాజీ మేనేజర్ ఆమెతో దారుణంగా మాట్లాడతాడు. అమర్ తనను కనీసం భార్యగా చూడటం లేదని, ఇంట్లో వస్తువులలాగే నువ్వు కూడా అంటూ భాగీతో నీచంగా మాట్లాడతాడు. దీంతో ఆమె ఎంతో బాధపడుతుంది. ఇంట్లోనూ తినకుండా కూర్చొంటుంది.
దీంతో అమర్ ఆమె కోసం భోజనం తీసుకొస్తాడు. తనకూ ఆకలిగానే ఉన్నా.. నువ్వు తింటేగానీ తిననంటాడు. గోరు ముద్దలు కలిపి ఆమెకు తినిపిస్తాడు. దీంతో భాగీ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ల మధ్య బంధం చూసి మనోహరి ఏం చేయబోతోంది? అనేది తెలుసుకోవాలంటే సోమవారం (మార్చి 10) ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే.
సంబంధిత కథనం