



Best Web Hosting Provider In India 2024

ఈ విధంగా పచ్చి పసుపును వాడారంటే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది, ప్రయత్నించి చూడండి
జుట్టు అందంగా ఉంటేనే ఎవరైనా ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ తెల్ల జుట్టు వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా ఒకటుంది.

జుట్టు తెల్లగా మారే సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఉంది. మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య ప్రభావాల వల్ల, జీవనశైలి వల్ల జుట్టు నెరిసిపోయే సమస్య ఎక్కువవుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు వల్ల చిన్న వయసులోనే ప్రజలు జుట్టు తెల్లబడుతుంది. చాలామంది తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు రంగులు వేస్తూ ఉంటారు. రసాయనాలు కలిసిన రంగులను వేయడం జుట్టుకు, ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి ఇంట్లోనే పచ్చి పసుపు అంటే ముడి పసుపుతో తెల్ల జుట్టుకు నల్ల రంగు వచ్చేలా చేసుకోవచ్చు. పసుపు కొమ్ములు తెచ్చి మెత్తగా స్వయంగా పొడి చేసి పెట్టుకోవాలి. అదే ముడి పసుపు లేదా పచ్చి పసుపు.
పసుపులో ఔషధ లక్షణాలు
మనదేశంలో పసుపును వేల సంవత్సరాలగా ఔషధమూలికగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉండే గుణాలు, సమ్మేళనాలు మనకు ఎంతో మేలు చేస్తాయని పరిశోధనలో తేలింది. పచ్చి పసుపును ఉపయోగించి జుట్టు రంగును మార్చుకోవచ్చు. పచ్చి పసుపులో రాగి, ఇనుము ఇతర ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి తెల్ల జుట్టును వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. పసుపుతో ఎలాంటి హెయిర్ మాస్కులు లేదా హెయిర్ డై తయారు చేసుకోవచ్చో తెలుసుకోండి.
పచ్చి పసుపు హెయిర్ మాస్క్
చిన్న గిన్నెలో ఒక చెంచా ఆవాల నూనె వేయండి. ఆ తర్వాత అందులో రెండు స్పూన్ల పచ్చి పసుపు వేయండి. ఇప్పుడు దీన్ని చిన్న వేడి మీద ఉడికించండి. ఆ తర్వాత అందులో విటమిన్ ఈ నూనె ఒక స్పూన్ వేయండి. ఆ తర్వాత అర స్పూను నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని తలకు పట్టించండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. ఇది మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
పసుపులో మన ఆరోగ్యానికి అందానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, ఫైటో న్యుట్రియెంట్లు, నూనెలు నిండుగా ఉంటాయి. అలాగే బీటా కెరాటిన్, విటమిన్ సి, విటమిన్ b6, విటమిన్ బి3, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్ వంటివి కూడా ఉంటాయి. పసుపులో టర్మేరోన్, అట్లాంటొన్, జింగి బెరన్ వంటి నూనెలు కూడా నిండి ఉంటాయి. ఇవన్నీ కలిసి జుట్టుకు ఎంతో శక్తినిస్తాయి. అలాగే పసుపును ఆహారంలో వాడడం వల్ల క్యాన్సర్ తో పోరాడే శక్తి శరీరానికి వస్తుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అల్జీమర్స్ ను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం