


Best Web Hosting Provider In India 2024

Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే
Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఇదొక కొరియన్ డ్రామా. ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ సిరీస్ వచ్చే నెలలో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

Netflix Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ కు పెట్టింది పేరైన నెట్‌ఫ్లిక్స్ లోకి అలాంటిదే మరో సిరీస్ వస్తోంది. అందులోనూ ఇది కొరియన్ థ్రిల్లర్ కావడం విశేషం. ఈ కే-డ్రామా పేరు కర్మ (Karma). వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టబోతున్న ఈ సిరీస్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి.
కర్మ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్
కొరియన్ డ్రామాలు ఇండియన్ ఆడియెన్స్ ను చాలా రోజులుగా ఆకర్షిస్తూనే ఉన్నాయి. అక్కడి నుంచి వస్తున్న కంటెంట్ కు మంచి డిమాండ్ ఉంటోంది. అలా ఇప్పుడు కర్మ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. ఏప్రిల్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ సస్పెన్స్, థ్రిల్లర్ తో నిండిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కర్మ వెబ్ సిరీస్ లో పార్క్ హే సూ, షిన్ మిన్, లీ హీ జూన్, కిమ్ సంగ్ క్యున్, లీ క్వాంగ్ సూ, గాంగ్ సెయింగ్ యియోన్ లాంటి వాళ్లు నటించారు. 2023లో ఈ కే డ్రామాను అనౌన్స్ చేశారు.
కర్మ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే?
ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కర్మ ఆరుగురు వ్యక్తుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. తమ జీవితాల్లో రిలేషన్షిప్స్ విషయంలో వీళ్లందరూ దెబ్బ తిన్నవాళ్లే. ఒకరు ఓ వింత ప్రమాదానికి గురవుతారు. డాక్టర్ అయిన మరొకరు తన చిన్నతనంలో జరిగిన ప్రమాదం నుంచి ఇంకా కోలుకోరు.
మరో వ్యక్తి తన జీవితంలో కష్టాలను అధిగమించడానికి భారీగా డబ్బు సంపాదించాలనుకుంటారు. కానీ తాను చేసిన పెట్టుబడులన్నీ విఫలమై అప్పుల్లో కూరుకుపోతారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కోలా సాగిపోయే జీవితం. వీళ్లందరి మధ్య అసలు సంబంధం ఏంటి అన్నది కర్మ వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది.
ఈ మధ్యే కర్మ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్లో ఒకరితో మరొకరికి పరిచయం లేని ఈ ఆరుగురు వ్యక్తుల జీవితాలు ఎలా కలవబోతున్నాయన్నది చూపించారు. ఫుల్ యాక్షన్, సస్పెన్స్ తో ఈ టీజర్ సాగింది. దీంతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
సంబంధిత కథనం