

Best Web Hosting Provider In India 2024

Tips to Sleep Early at Night: రాత్రుళ్లు పడుకున్న వెంటనే నిద్రపట్టేయాలంటే, ఈ 11 టిప్స్ ఫాలో అవండి!
Tips to Sleep Early at Night: మీ కంటికి సరిపడా నిద్రలేదని ఫీలవుతున్నారా? వీలు చేసుకుని ఎంత త్వరగా పడుకున్నా కూడా, నిద్ర పట్టడం కోసం గంటల కొద్దీ సమయం ఎదురుచూస్తున్నారా? రండి. ఈ 11 టిప్స్ పాటించి సరైన నిద్రతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

స్లీపింగ్ డిజార్డర్ అనేది ప్రెజెంట్ జనరేషన్ లో కామన్ అయిపోయింది. కళ్లు మూసుకున్న చాలా సేపటికి గానీ, నిద్రపట్టడం లేదని కొన్ని వేల మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. చక్కగా నిద్రపోకపోతే శరీరం మరుసటి రోజుకు రిఫ్రెష్ అవదు. నిద్రలో క్వాలిటీ లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కేవలం శరీరానికే కాదు, చర్మానికి, మానసిక ఆరోగ్యానికి కూడా సరిపడ నిద్ర అవసరం. అర్ధరాత్రి వరకూ ఎదురుచూస్తూ గుడ్లగూబ కళ్లతో తిప్పలు పడాల్సిన అవసరం లేకుండా, ఈ టిప్స్ మిమ్మల్ని వెంటనే నిద్రపోయేలా చేస్తాయి.
సరిపడ నిద్రకోసం ఏం చేయాలి?
చక్కటి నిద్ర పట్టాలంటే, రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. వీకెండ్స్ సమయంలో, ప్రత్యేక సందర్భాల్లో కూడా మీ నిద్రసమయాన్ని మార్చుకోకపోవడం బెటర్.
సాయంత్రం వేళల్లో కాఫీ మానేయాలి
ఎనర్జీ డ్రింక్స్‌లో, కాఫీ, టీలలో కూడా కెఫైన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి సాయంత్రం వేళల్లో తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం కనిపిస్తుంది. ఈ ద్రావణాలు తీసుకున్న వెంటనే మెదడులో అడినోసిన్ కణాలను అడ్డుకుంటుంది. ఈ కెమికల్ రోజంతా మత్తుగా ఉండేందుకు కారణమవుతుంది. దీంతో నిద్రాసమయం కూడా వాయిదా పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే, కాఫీ లాంటివి నిద్రపోవడానికి 6గంటల ముందు తీసుకోవడమే బెటర్.
నిద్రపోవడానికి చాలా సేపు ముందే స్క్రీన్లకు దూరంగా ఉండాలి:
చక్కటి నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటే, స్క్రీన్ టైం తగ్గించడానికి ప్రియారిటీ ఇవ్వండి. మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్ వంటి గాడ్జెట్ల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
నిద్రపోవడానికి ముందు రిలాక్స్ టైం
నిద్రపోవడానికి కాస్త సమయం ముందు శరీరంతో పాటు మనస్సును రిలాక్స్ చేసుకోండి. బుక్ చదవడమో లేదా సంగీతం వినడమో చేస్తే ఒత్తిడి దూరం అవుతుంది. వేడి నీటితో స్నానం చేస్తే కండరాలు రిలాక్స్ అయి శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇవే కాకుండా మెడిటేషన్ చేయడం కూడా మైండ్ రిలాక్స్ అవడానికి స్ట్రెస్ హార్మోన్లు తగ్గడానికి దోహదపడతాయి.
నిద్రపోయే సమయం ముందు హెవీగా తినేయొద్దు
నిద్రపోవడానికి కంటే ముందు అతిగా తినేయడం మానేయండి. మసాలా ఆహారాన్ని దూరం పెట్టండి. ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి.స్లీప్ క్వాలిటీని తగ్గిస్తాయి. అందుకే నిద్రపోవడాని కంటే ముందు లైట్ ఫుడ్స్ అయిన బనానా, పెరుగున్నం లాంటివి తినండి.
పగటి సమయంలో నిద్రపోండి
పగటి సమయంలో 20 లేదా 30 నిమిషాల పాటు షాట్ స్లీప్ తీసుకోవడం వల్ల అప్రమత్తత పెరిగి, ప్రొడక్టివిటీ ఎక్కువవుతుంది. ప్రత్యేకించి మధ్యాహ్న సమయంలో పడుకోవడం బెటర్.
లేటుగా ఎక్సర్‌సైజ్ చేయకండి
ఫిజికల్ యాక్టివిటీ కూడా మంచి నిద్రకు దోహదపడుతుంది. కొందరిలో సాయంత్రం వేళ ఫిజికల్ యాక్టివిటీ చేసే అలవాటు ఉంటుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి, అడ్రినలైన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా నిద్రపోవడం చాలా ఆలస్యమవుతుంది. అందుకే నిద్రపోవడానికి కంటే 4 గంటల ముందే ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉండండి.
త్వరగా పడుకోవడం వల్ల కలిగే లాభాలేంటి?
రాత్రి త్వరగా పడుకోవడం కంటే ఆరోగ్యకరమైన అలవాటు మరొకటి లేదు. రాత్రుళ్లు త్వరగా నిద్రపోవడం వల్ల మీ శరీరం డీప్ స్లీప్ కు వెళ్లేందుకు సహకరిస్తుంది దీని వల్ల మెమొరీ పవర్ పెరగడంతో పాటు, సమస్యను పరిష్కరించే స్కిల్స్ కూడా పెరుగుతాయి. రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. మూడ్ స్వింగ్స్ కలగకుండా కాపాడతాయి.
సంబంధిత కథనం