



Best Web Hosting Provider In India 2024
Accident : హై స్పీడ్‌లో గుద్దుకున్న వాహనాలు! స్పాట్లో ఏడుగురు మృతి- మరో 14 మంది..
MP road accident : మధ్యప్రదేశ్‌లో ఎన్‌హెచ్ 31పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్యూవీ, ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు స్పాట్లో మరణించారు. మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిద్ధి జిల్లాలోని ఎన్‌హెచ్-39పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఎస్యూవీ- ఒక లారీ హై స్పీడ్‌లో గుద్దుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించినట్టు తెలుస్తోంది. ఇదే ఘటనలో కనీసం 14మంది గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
సిద్ధి జిల్లాలోని బహ్రీ గ్రామానికి చెందిన కొందరు.. ఒక ఎస్యూవీ (తూఫాన్)లో మైహర్‌లోని శారదా ఆలయానికి బయలుదేరారు. ఎన్హోచ్-31పై వెళుతుండగా.. ఎదురుగా ఒక సిమెంట్ లారీ వచ్చింది. రెండు వాహనాలు హై స్పీడ్‌లో ఉండగా, ఒకదాన్ని ఒకటి ఢీకొట్టాయి. ఈ విషయాన్ని డీఎస్పీ గాయత్రీ దేవి వెల్లడించారు.
సోమవారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగంది.
కాగా ప్రమాదం సమయంలో రెండు వాహనాలు విపరీతమైన వేగంతో వెళుతున్నట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన 14 మందిని సిద్ధి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా.. క్షతగాత్రుల్లో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రేవా మెడికల్ కాలేజీకి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు, రవాణా శాఖ దర్యాప్తు ప్రారంభించాయి. అయితే, ప్రమాదం సమయంలో ఎస్యూవీ ఓవర్‌లోడ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు బాధిత కుటుంబాల ఆర్థనాథాలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబసభ్యుల మృతదేహాలను చూసి బంధువులు విలపించారు.
సీఎం దిగ్భ్రాంతి..
మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1, స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడిన వారికి రూ. 50వేలు పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు.
పంజాబ్‌లో రోడ్డు ప్రమాదం..
పంజాబ్ జలంధర్ జిల్లాలో సోమవారం ఇటుకలతో నిండిన ట్రాక్టర్ ట్రాలీని ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు.
బస్సు రాజస్థాన్ నుంచి జమ్ము వెళుతుండగా జలంధర్‌లోని కాలా బక్రా ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
గ్రామంలో రోడ్డు నుంచి జలంధర్-పఠాన్ కోట్ హైవేపై ట్రాక్టర్ ట్రాలీ రాగానే బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link