




Best Web Hosting Provider In India 2024

OTT Malayalam Thriller Movies: ఆహా వీడియో ఓటీటీలో తెలుగులో ఉన్న ఐదు మలయాళం థ్రిల్లర్ మూవీస్ కచ్చితంగా చూడాల్సిందే
OTT Malayalam Thriller Movies: మలయాళం థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఆహా వీడియో ఓటీటీలో తెలుగులో ఉన్న ఈ ఐదు థ్రిల్లర్ మూవీస్ ను అస్సలు మిస్ కావద్దు. మీకు కచ్చితంగా థ్రిల్ పంచుతాయి.

OTT Malayalam Thriller Movies: మలయాళం థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాదాపు అన్ని హిట్ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఆహా వీడియో ఓటీటీలోనూ ఐదు మలయాళ థ్రిల్లర్ మూవీస్ తెలుగులో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.
చుండూరు పోలీస్ స్టేషన్
మలయాళంలో 2021లో వచ్చిన నాయట్టు మూవీని తెలుగులో చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది. ముగ్గురు పోలీస్ అధికారులు, వాళ్లను ఓ తప్పుడు కేసులో ఇరికించే అవినీతి అధికారులు, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి వాళ్లు పరారవడం.. ఇలా సాగుతుందీ మూవీ. పోలీస్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్లు ఈ చుండూరు పోలీస్ స్టేషన్ ను మిస్ కాకుండా చూడండి.
కోల్డ్ కేస్
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించిన సినిమా కోల్డ్ కేస్. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కు హారర్ జోడించి తీసిన మూవీ ఇది. ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సుకుమారన్.. ఓ అంతుబట్టని హత్య కేసును ఛేదించడమే ఈ సినిమా కథ. ఈ మూవీ కూడా ఆహా వీడియోలో ఉంది.
ఫోరెన్సిక్
మరో సూపర్ మలయాళ థ్రిల్లర్ మూవీ ఫోరెన్సిక్. టొవినో థామస్ నటించిన సినిమా ఇది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని చంపే ఓ సీరియల్ కిల్లర్, ఆ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీసులకు సాయం చేసే ఓ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ చుట్టూ తిరిగే స్టోరీ. ఆహా వీడియోలో తెలుగులో ఉంది.
మిడ్నైట్ మర్డర్స్
మిడ్నైట్ మర్డర్స్ 2020లో మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ అంజామ్ పతిరా మూవీకి తెలుగు డబ్బింగ్ వెర్షన్. కుంచకో బొబన్ లీడ్ రోల్లో నటించాడు. ఇది కూడా ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నం, వాళ్లకు సాయం చేసే ఓ క్రిమినాలజిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలోని ట్విస్టులు చాలా బాగుంటాయి.
మార్కో
ఈ మధ్యే ఆహా వీడియో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో. మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఉన్ని ముకుందన్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా టీవీ ప్రీమియర్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆహాలో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం