


Best Web Hosting Provider In India 2024

Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసు తీర్పుపై స్పందించని అమృత-సోషల్ మీడియాలో మరో చర్చ
Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలమైన పరువు హత్య ప్రణయ్ కేసులో నల్గొండ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2కి ఉరి శిక్ష, మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై ప్రణయ్ సతీమణి అమృత స్పందించకపోవడం గమనార్హం.

Pranay Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచల తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2 గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో…అమృత తండ్రి మారుతీరావు 2018 సెప్టెంబర్ 14 సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు. సుమారు ఐదేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం తాజాగా నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు.
నల్గొండ కోర్టు సంచలన తీర్పుతో ప్రణయ్-అమృత ప్రేమ, పెళ్లి, పరువు హత్య మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ పరువు హత్య తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో తన భర్త హత్య కేసులో కోర్టు తీర్పుపై అమృత ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ప్రణయ్ హత్య కేసు తీర్పుపై అమృత స్పందంచలేదని సమాచారం. కేసు తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు స్పందించారు. కానీ అమృత స్పందించకపోవడంతో మరో చర్చ మొదలైంది. అసలు అమృత ఎక్కడున్నారు? ఆమె ఎందుకు స్పందించలేదనే చర్చ మొదలైంది.
ప్రణయ్ పేరు తొలగింపుపై చర్చ
అమృత సోషల్ మీడియా ఖాతాలకు గతంలో ప్రణయ్ పేరు ఉండేదని, ఇటీవల ప్రణయ్ పేరు తొలగించి అమృత వర్షిణి అని మార్చుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ వీడియోలు పోస్టు చేసే అమృత…తన భర్త హత్య కేసు కోర్టు సంచలన తీర్పు ఇవ్వడంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రణయ్ కుటుంబ సభ్యులతో అమృత టచ్ లో లేరని మరో ప్రచారం సైతం తెరపైకి వచ్చింది.
అమృత చెల్లి ఆరోపణలు
ఈ కేసులో ఏ2 గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన కోర్టు, మిగతా ఆరుగురు నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. జీవితఖైదు పడిన నిందితుల్లో అమృత బాబాయ్ శ్రవణ్ రావు కూడా ఉన్నారు. ఈ కేసులో ఏ6 గా ఉన్న శ్రవణ్ రావుకు …ఈ కేసుతో అసలు సంబంధం లేదని అతని కుటుంబసభ్యులు కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. ప్రణయ్ హత్య కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని, అంతా అమృతే చేసిందని శ్రవణ్ రావు కూతురు అమృత చెల్లి ఆరోపించారు. ఈ కేసుతో తన తండ్రికి ఎటువంటి సంబంధం లేకున్నా అమృత కావాలనే తన తండ్రిని ఇరికించిందని ఆరోపించింది. ప్రణయ్ హత్యతో శ్రవణ్ రావుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుటుంబం మొదటి నుంచి చెబుతోంది.
ప్రణయ్ తండ్రి ఏమన్నారంటే?
కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి స్పందించారు. ఇకనైనా పరువు హత్యలు ఆగిపోవాలని ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. నల్గొండ కోర్టు తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలన్నారు. కోర్టు తీర్పుతో దోషులు కుటుంబాలు కూడా బాధపడుతుంటాయి, కానీ పరువు హత్యలకు పాల్పడడం విచారకరమని అన్నారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఐదున్నర ఏళ్లుగా కోర్టు తీర్పు కోసం వేచి చూశామని, ఈ తీర్పుతో తృప్తి చెందామన్నారు.
సంబంధిత కథనం
టాపిక్