


Best Web Hosting Provider In India 2024

OTT Comedy: ఓటీటీలో 50 మిలియన్ మినిట్స్ దాటిన తమిళ కామెడీ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Comedy Drama movie: కుడుంబస్థాన్ చిత్రం ఓటీటీలో అదరగొడుతోంది. ఈ కామెడీ డ్రామా మూవీకి వ్యూస్ బాగా దక్కుతున్నాయి. తాజాగా ఈ చిత్రం ఓ మైల్‍స్టోన్ దాటింది.

కుటుంబస్థాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఈ తక్కువ బడ్జెట్ చిత్రం మంచి సక్సెస్ అయింది. మణికందన్ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 24న తమిళంలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కుటుంబస్థాన్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. ఓ మైలురాయి అధిగమించింది.
50 మిలియన్ నిమిషాలు దాటి..
కుటుంబస్థాన్ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను అధిగమించింది. ఈ విషయాన్ని జీ5 నేడు (మార్చి 10) వెల్లడించింది. “డైనింగ్ టేబుల్ చర్చల నుంచి లివింగ్ రూమ్ తగాదాల వరకు! 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను ఈ ఫ్యామిలీ డ్రామా దాటేసింది” అని సోషల్ మీడియాలో జీ5 ట్వీట్ చేసింది. మూడు రోజుల్లోనే ఈ మార్కును ఈ చిత్రం దాటేసింది.
తెలుగులోనూ..
కుటుంబస్థాన్ మూవీ జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 7న ఈ మూవీ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఆరంభం నుంచే ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కాయి.
స్ట్రీమింగ్ తర్వాత మిక్స్డ్ టాక్
థియేటర్లలో కుటుంబస్థాన్ చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే, జీ5లో స్ట్రీమింగ్ తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం ఆకట్టుకునేలా ఉందని కొందరు పోస్టులు చేస్తున్నారు. కామెడీ ఆకట్టుకుందని చెబుతున్నారు.
అయితే, మరికొందరు ఈ చిత్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మూవీ సిల్లీగా అనిపిస్తోందని, కామెడీ వర్కౌట్ కాలేదని కామెంట్లు చేస్తున్నారు. ఓవర్‌హైప్డ్ అంటూ ట్వీట్లు చేశారు. ఇలా స్ట్రీమింగ్ తర్వాత ఈ చిత్రానికి మిక్డ్స్ టాక్ వస్తోంది. అయితే వ్యూస్‍లో మాత్రం దుమ్మురేపుతోంది.
మధ్య తరగతి కుటుంబ బాధ్యతలు మోస్తూ సవాళ్లను ఎదుర్కొనే ఓ యువకుడి చుట్టూ కుటుంబస్థాన్ చిత్రం సాగుతుంది. ఈ మూవీకి రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మణికందన్‍కు జోడీగా సాన్వే మేఘన నటించారు. ఆర్ సుందరరాజన్, సోమసుందరం, కనకం, వర్గీస్ మాథ్యూ, బాలాజీ శక్తివేల్ కీరోల్స్ చేశారు.
కటుంబస్థాన్ మూవీ రూ.8కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. ఈ చిత్రం సుమారు రూ.25కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. మంచి హిట్ కొట్టింది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఇప్పుడు జీ5 ఓటీటీలోనూ మంచి వ్యూస్ సాధిస్తోంది.
కుటుంబస్థాన్ స్టోరీలైన్
నవీన్ (మణికందన్), నీలా (మేఘన) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు అంగీకరించవు. దీంతో తాను జీవితంలో ఉన్నతస్థాయికి చేరతామని నవీన్, నీలా ఛాలెంజ్ చేస్తారు. సివిల్ సర్వీసెస్ పరీక్షకు నీలా సిద్ధమవుతూ ఉంటుంది. దీంతో కుటుంబాన్ని నడపటంతో పాటు నవీన్‍కు ఖర్చుల భారం మరింత పెరుగుతుంది. సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగంలోనూ ఇబ్బందులు ఉంటాయి. ఈ క్రమంలో చాలా అప్పులు చేస్తాడు నవీన్. బాకీలు తీర్చాలని డబ్బు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తారు. ఇరు కుటుంబాల సభ్యుల నుంచి కూడా సూటిపోటి మాటలు వస్తాయి. బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. దీంతో నవీన్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సమస్యలు, సవాళ్లను అతడు అధిగమించాడా? అనేది కుటుంబస్థాన్ చిత్రంలో ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి.
సంబంధిత కథనం