Canada PM : కెనడా నెక్ట్స్​ పీఎం మార్క్​ కార్నీ- ‘ట్రంప్​’ ముప్పును ఎదుర్కోగలరా?

Best Web Hosting Provider In India 2024


Canada PM : కెనడా నెక్ట్స్​ పీఎం మార్క్​ కార్నీ- ‘ట్రంప్​’ ముప్పును ఎదుర్కోగలరా?

Sharath Chitturi HT Telugu
Published Mar 10, 2025 07:10 AM IST

Mark Carney : కెనడా తదుపరి ప్రధానమంత్రిగా మార్క్​ కార్నీని ఎన్నుకుంది లిబర్​ పార్టీ. జస్టిన్​ ట్రూడో స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.

కెనడా తదుపరి అధ్యక్షుడు మార్క్​ కార్నీ..
కెనడా తదుపరి అధ్యక్షుడు మార్క్​ కార్నీ.. (Reuters)

ఉత్కంఠకు తెరపడింది! కెనడా తదుపరి ప్రధానిగా మార్క్​ కార్నీని ఆ దేశంలో అధికారంలో ఉన్న లిబరల్​ పార్టీ ఎన్నుకుంది. జస్టిన్​ ట్రూడో రాజీనామాతో ప్రధానిగా ఆయన స్థానాన్ని ఈ బ్యాంక్​ ఆఫ్​ కెనడా మాజీ చీఫ్​ భర్తీ చేయనున్నారు.

ఎవరు ఈ మార్క్​ కార్నీ?

జస్టిన్​ ట్రూడో స్థానాన్ని భర్తీ చేసేందుకు లిబరల్ పార్టీలో జరిగిన రేసులో కార్నీ ముందంజలో ఉన్నారు. చివరికి, ఆయన విజయం సాధించినట్టు లిబర్​ పార్టీ అధ్యక్షుడు సచిత్​ మెహ్రా సోమవారం ప్రకటించారు.

మార్క్​ కార్నీ.. 2008 నుంచి 2013 వరకు బ్యాంక్ ఆఫ్ కెనడా 8వ గవర్నర్​గా పనిచేశారు. 2011 నుంచి 2018 వరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు చైర్మన్​గా విధులు నిర్వర్తించారు.

ఈ గోల్డ్​మన్​శాక్స్ మాజీ ఎగ్జిక్యూటివ్.. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి కెనడా బయపడేందుకు కృషి చేసి వార్తల్లో నిలిచారు.

కనెడాలోని మారుమూల నార్త్ వెస్ట్ టెరిటరీస్​లోని ఫోర్ట్​స్మిత్​లో జన్మించారు. హార్వర్డ్​లో చదువుకున్నారు. అక్కడ ఆయన స్టార్ ఐస్ హాకీ క్రీడాకారుడు కూడా.

59 ఏళ్ల కార్నీ రాజకీయాలకు బయటి వ్యక్తి! అంటే ఆయన ఎప్పుడూ రాజకీయపరమైని పదవిని నిర్వహించలేదు. ఇది సాధారణ పరిస్థితులలో నాయకత్వ రేసులో ఆయనకు వ్యతిరేకంగా ఉండే విషయం. కానీ ట్రూడో రాజకీయాలకు దూరంగా ఉండటం, బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయి కెరీర్​ని సాగించడం ఆయనకు ప్రయోజనం చేకూర్చింది.

కెనడా ప్రధానమంత్రి రేసులో 131,674 ఓట్లతో విజయం సాధించారు మార్క్ కార్నీ. ఇది బ్యాలెట్లలో 85.9 శాతం! ఆయన ప్రత్యర్థులు క్రిస్టియా ఫ్రీలాండ్​కు 11,134 ఓట్లు, కరీనా గౌల్డ్​కు 4,785 ఓట్లు, ఫ్రాంక్ బేలిస్​కు 4,038 ఓట్లు వచ్చాయి.

ముంచుకొస్తున్న ‘ట్రంప్​’ ముప్పును ఎదుర్కోగలరా?

ఆర్థిక అనిశ్చితి కన్నా కెనడాకు ఇప్పుడున్న అతిపెద్ద ముప్పు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అనే చెప్పాలి! అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొంతకాలంలోనే పొరుగు దేశమైన కెనడాతో టారీఫ్​ యుద్ధాన్ని ప్రారంభించారు ట్రంప్​. అంతేకాదు, కెనడాను అమెరికాలో కలిపేసుకుంటానని హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. ఈ సమయంలోనే కెనడా నాయకత్వంలో మార్పు సంభవించడం సర్వత్రా చర్చకు దారితీసింది. తదుపరి కెనడా ప్రధాని ట్రంప్​ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఉండాలని అందరు భావించారు.

కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ను ఎదుర్కోవడానికి అత్యంత విశ్వసనీయమైన రాజకీయ నాయకుడిగా దేశ ప్రజలు మార్క్​ కార్నీని గుర్తించినట్టు సర్వేలు పేర్కొన్నాయి.

ట్రంప్​ను హ్యారీ ఓసారి.. హ్యారీపోటర్​లోని ప్రతినాయకుడైన వోల్డెమోర్ట్​తో కూడ పోల్చారు.

ట్రంప్ టారిఫ్ బెదిరింపులను ప్రస్తావిస్తూ.. “మేము ఆయన్ని విజయవంతం కానివ్వము,” అని కార్నీ అన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాణిజ్యానికి సంబంధించి విశ్వసనీయమైన కట్టుబాట్లను కొనసాగించేందుకు కెనడాతో అమెరికా చేతులు కలిపే వరకు ప్రతీకార చర్యలు కొనసాగుతాయని ఆయన అన్నారు.

కెనడియన్ వనరులు, భూమి, మొత్తం దేశాన్నే అమెరికన్లు కోరుకుంటున్నారని, ఇది కెనడియన్ల జీవన విధానాన్ని నాశనం చేస్తుందని ఆయన అన్నారు.

హెల్త్​కేర్​ను వ్యాపారంగా అమెరికా నడుపుతోందని, కెనడాలో అది హక్కు అని ప్రశంసించారు. ‘అమెరికా కెనడా కాదు. కెనడా ఎప్పటికీ ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాబోదు,” అని స్పష్టం చేశారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link