Bad cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలా? ప్రతిరోజూ ఈ పని చేయండి, నెల రోజుల్లోనే మంచి ఫలితం

Best Web Hosting Provider In India 2024

Bad cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలా? ప్రతిరోజూ ఈ పని చేయండి, నెల రోజుల్లోనే మంచి ఫలితం

Haritha Chappa HT Telugu
Published Mar 11, 2025 07:32 AM IST

Bad cholesterol: చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోతే గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఇతర సమస్యలు కూడా వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను కచ్చితంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వాకింగ్ ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

చెడు కొలెస్ట్రాల్
చెడు కొలెస్ట్రాల్

చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటివి శరీరాన్ని రోగాల బారిన పడేలా చేస్తాయి. నేటి కాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తినకపోవడం. మీరు తినే ఆహారంలో అనారోగ్యకరమైన కొవ్వులు, ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతూ పోతుంది. అది చెడు కొలెస్ట్రాల్ గా మారుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సింపుల్ చిట్కా ప్రతిరోజు వాకింగ్ చేయడం. నడక చెడు కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం.

నడకతో ఎలా తగ్గుతుంది?

అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ప్రతిరోజు అరగంట పాటు వేగంగా వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి .మీరు నడిచినప్పుడు అది శరీరంలోని ప్రతి కండరాన్ని ప్రభావితం చేస్తుంది. కండరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. నిరంతరం ప్రతిరోజూ నడవడం వల్ల శరీరంలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్లు కరగడం ప్రారంభమవుతాయి. మీరు వేగంగా నడిచినప్పుడు శరీరం నుండి చెమట బయటకు వస్తుంది. కండరాలలో నిల్వ ఉన్న కొవ్వు, ట్రైగ్లిజరైడ్లు కూడా కరిగి బయటికి వచ్చేస్తాయి. కొన్ని రోజులు తర్వాత మీకే ఎంతో మంచి మార్పులు కనిపిస్తాయి. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా అనిపిస్తుంది.

మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది

వాకింగ్ అనేది మంచి కొలెస్ట్రాల్‌ను శరీరంలో పెరిగేలా చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వారానికి మూడుసార్లు అరగంట పాటు వేగంగా నడిచినా చాలు.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించి శరీర జీవక్రియ రేటును పెంచుతుంది. దీనివల్ల మీరు ఏమి తిన్నా కూడా త్వరగా జీర్ణం అవుతుంది. వ్యర్ధాలు కండరాలలో పేరుకుపోవు. ఇది కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

అధిక కొలెస్ట్రాల్ కోసం ఎన్ని గంటలు నడవాలి?

అధిక కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఎన్ని గంటలు నడవాలని సందేహం ఎక్కువ మందికి ఉంది. మీరు తిన్న వెంటనే కూర్చోవడం, నిద్రపోవడం వంటి పనులు చేయకండి. తిన్న తర్వాతే వాకింగ్ చేస్తే అది శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోకుండా ఉంటుంది. రోజూ 45 నిమిషాల పాటు నడిచేందుకు ప్రయత్నించండి. అప్పుడు శరీరానికి చెమట పట్టడం ప్రారంభమవుతుంది. అలా శరీరానికి చెమట పట్టేలా నడిస్తేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలా నడవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ కూడా కరిగి ఊబకాయం తగ్గుతుంది. కాబట్టి నడక ద్వారా అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించుకునే అవకాశం ఎక్కువే.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024