Serial: రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లు- రీల్ లైఫ్‌లో సేమ్ రోల్స్ – భార్య‌తో క‌లిసి న‌టిస్తోన్న గుప్పెడంత మ‌న‌సు మ‌హేంద్ర

Best Web Hosting Provider In India 2024

Serial: రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లు- రీల్ లైఫ్‌లో సేమ్ రోల్స్ – భార్య‌తో క‌లిసి న‌టిస్తోన్న గుప్పెడంత మ‌న‌సు మ‌హేంద్ర

Nelki Naresh HT Telugu
Published Mar 11, 2025 10:02 AM IST

Star Maa Serial: స్టార్ మాలో భానుమ‌తి సీరియ‌ల్ సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. ఫ‌స్ట్ ఎపిసోడ్‌తోనే బుల్లితెర ఫ్యాన్స్‌ను ఈ సీరియ‌ల్ మెప్పించింది. కాగా ఈ సీరియ‌ల్‌లో రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లైన సాయికిర‌ణ్, స్ర‌వంతి అదే రోల్స్‌ను న‌టిస్తున్నారు. బ‌ల‌రామ్‌, శార‌ద అనే పాత్ర‌లు చేస్తున్నారు.

స్టార్ మా సీరియల్
స్టార్ మా సీరియల్

Star Maa Serial: స్టార్ మాలో భానుమ‌తి పేరుతో కొత్త సీరియ‌ల్ ప్రారంభ‌మైంది. సోమ‌వారం ఈ సీరియ‌ల్ ఫ‌స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. లాంగ్ ర‌న్నింగ్ సీరియ‌ల్‌ స‌త్య‌భామ కు స‌డెన్‌గా శుభంకార్డు వేసిన మేక‌ర్స్ …ఆ సీరియ‌ల్ స్థానంలో భానుమ‌తిని లాంఛ్ చేశారు.

సాయికిర‌ణ్‌, స్ర‌వంతి…

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిన్న మ‌రుమ‌గ‌ల్ సీరియ‌ల్‌కు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న భానుమ‌తిలో శంక‌ర్‌కుమార్ చ‌క్ర‌వ‌ర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో న‌టిస్తోన్నారు. ఈ సీరియ‌ల్‌లో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ సాయికిర‌ణ్‌తో పాటు స్ర‌వంతి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లైన సాయికిర‌ణ్, స్ర‌వంతి సేమ్ రోల్స్‌లో ఈ సీరియ‌ల్‌లో న‌టిస్తున్నారు. సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లో బ‌ల‌రామ్, శార‌ద పాత్ర‌ల్లో సాయికిర‌ణ్, స్ర‌వంతి క‌నిపించారు. భానుమ‌తిలో భ‌ర్త‌తో క‌లిసి న‌టిస్తోన్న విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా స్ర‌వంతి వెల్ల‌డించింది.

గ‌త ఏడాది పెళ్లి…

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో సాయికిర‌ణ్, స్ర‌వంతి పెళ్లిచేసుకున్నారు. కోయిల‌మ్మ సీరియ‌ల్‌లో సాయికిర‌ణ్, స్ర‌వంతి క‌లిసి న‌టించారు. ఆ సీరియ‌ల్‌లోనే వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిన‌ట్లు స‌మాచారం. కొద్ది మంది స‌న్నిహితులు, కుటుంబ‌స‌భ్యుల స‌మక్షంలో వీరి వివాహ వేడుక జ‌రిగింది.

సాయికిర‌ణ్‌కు ఇది రెండో వివాహం. గ‌తంలో వైష్ణ‌వి అనే అమ్మాయిని పెళ్లాడాడు. కానీ మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వైష్ణ‌వి నుంచి సాయికిర‌ణ్ విడాకులు తీసుకున్నాట్లు స‌మాచారం.

టాప్ యాక్ట‌ర్‌గా…

తెలుగు బుల్లితెర‌పై టాప్ యాక్ట‌ర్స్‌లో ఒక‌రిగా సాయికిర‌ణ్ కొన‌సాగుతోన్నాడు. గుప్పెడంత మ‌న‌సుతో మౌన‌రాగం, ఇంటిగుట్టు, అభిలాష‌, కోయిల‌మ్మ‌, శివ‌లీల‌లు, వెంక‌టేశ్వ‌ర వైభ‌వంతో పాటు ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. ప్ర‌స్తుతం ప‌డ‌మ‌టి సంధ్యారాగం సీరియ‌ల్‌లో లీడ్ యాక్ట‌ర్‌గా న‌టిస్తోన్నాడు. మ‌రోవైపు తెలుగులో స్ర‌వంతి… క‌ళ్యాణం క‌మ‌నీయం, నాగ‌పంచ‌మితో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేసింది.

నువ్వే కావాలితో…

సీరియ‌ల్స్ కంటే ముందు తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు సాయికిర‌ణ్‌. నువ్వే కావాలి మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయికిర‌ణ్‌ ప్రేమించు, డార్లింగ్ డార్లింగ్, మ‌న‌సుంటే చాలు సినిమాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించాడు. నువ్వే కావాలి పెద్ద హిట్ట‌యినా త‌రుణ్, రిచా స్థాయిలో సాయికిర‌ణ్‌కు ఫేమ‌స్ కాలేక‌పోయాడు.

అన్న‌పూర్ణ స్టూడియోస్‌…

కాగా భానుమ‌తి సీరియ‌ల్ స్టార్ మా ఛానెల్‌లో ప్ర‌తి రోజు సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఆరున్న‌ర గంట‌ల వ‌ర‌కు టెలికాస్ట్ కాబోతోంది. ఈ సీరియ‌ల్‌ను అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది.

భానుమ‌తి కంటే ముందే ఇటీవ‌లే స్టార్ మాలో నువ్వుంటే నా జ‌త‌గా, గీత ఎల్ఎల్‌బీ, ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్స్ కొత్త‌గా లాంఛ్ అయ్యాయి.

స్టార్ మాలో భానుమ‌తి సీరియ‌ల్ సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. ఫ‌స్ట్ ఎపిసోడ్‌తోనే బుల్లితెర ఫ్యాన్స్‌ను ఈ సీరియ‌ల్ మెప్పించింది. కాగా ఈ సీరియ‌ల్‌లో రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లైన సాయికిర‌ణ్, స్ర‌వంతి అదే రోల్స్‌ను న‌టిస్తున్నారు. బ‌ల‌రామ్‌, శార‌ద అనే పాత్ర‌లు చేస్తున్నారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024