






Best Web Hosting Provider In India 2024

Chahal – Dhanashree Verma: చాహల్, ధనశ్రీ వర్మ వ్యవహారంలో మరో మలుపు.. నెటిజన్ల రియాక్షన్ ఇలా..
Yuzvendra Chahal – Dhanashree Verma: యజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోవడం ఖాయమనే సమాచారం బయటికి వచ్చింది. ఈ తరుణంలో ధనశ్రీ వర్మ చేసిన ఓ పని ఆసక్తికరంగా మారింది.

భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసునేందుకు సిద్ధమయ్యారని, ఇప్పటికే ప్రక్రియ మొదలైందనే సమాచారం వెల్లడైంది. కొన్ని నెలలుగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. చాహల్ రీసెంట్గా భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను స్టాండ్స్ నుంచి చూశాడు. ఆమె పక్కనే ఆర్జే మహ్వశ్ కనిపించారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్లు వస్తున్నాయి. ఈ తరుణంలో ధనశ్రీ వర్మ ఓ ట్విస్ట్ ఇచ్చారు.
చాహల్ ఫొటోలు మళ్లీ..
ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తాను, చాహల్ కలిసి ఉన్న ఫొటోలను నేడు రిస్టోర్ చేశారు ధనశ్రీ వర్మ. దీంతో ఆమె ఇన్‌స్టాలో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గతేడాది తాను, చాహల్ కలిసి ఉన్న ఫొటోలను ధనశ్రీ వర్మ ఆర్కీవ్ చేసి కనపడకుండా చేశారు. పెళ్లి ఫొటోలను కూడా దాచేశారు. ఇప్పుడు మళ్లీ వాటన్నింటినీ రీస్టోర్ చేశారు. ఇద్దరూ కలిసి వెళ్లిన వెకేషన్ ఫొటోలు, పెళ్లి ఫొటోలు సహా అన్నింటినీ రిస్టోర్ చేసేశారు.
ఏంటీ ట్విస్ట్ అంటూ ఆశ్చర్యంలో నెటిజన్లు
చాహల్ ఫొటోలను ధనశ్రీ రిస్టోర్ చేయడంతో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు విడాకుల ప్రక్రియ మొదలైందని తెలుస్తుంటే.. ఈ తరుణంలో ధనశ్రీ ఇలా చేయడం ట్విస్టేనంటూ కామెంట్లు చేస్తున్నారు. “అన్ని ఫొటోలను ఎందుకు రిస్టోర్ చేశారు” అంటూ కొందరు నెటిజన్లు ధనశ్రీని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఇద్దరూ కలవనున్నారా అని కొందరు సందేహిస్తున్నారు. ఆర్జే మహ్వశ్ ఎఫెక్ట్ అంటూ కొందరు రాసుకొస్తున్నారు. ఇలా నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
చాహల్‌తో ఆర్జే మహ్వశ్
భారత్, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను చాహల్ పక్కనే చూర్చొని చూశారు పాపురల్ యూట్యూబర్ ఆర్జే మహ్వశ్. టీమిండియా గెలిచిన తర్వాత సెలెబ్రేషన్లతో చాహల్‌తో కలిసి దిగిన ఫొటోలు, వీడియో పోస్ట్ చేశారు. మ్యాచ్ సమయంలో చాహల్, మహ్వశ్ నవ్వుతూ క్లోజ్‌గా మాట్లాడుకున్నారు. దీంతో ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో చాహల్‌తో తాను ఉన్న ఫొటోలను ధనశ్రీ రిస్టోర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
చాహల్, ధనశ్రీ వర్మ 2020లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల బంధం తర్వాత గతేడాదే వీళ్లు విడాకులకు అప్లై చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇద్దరూ విడిపోయి ఉంటున్నారని తెలిసింది. ఈ విషయంపై ఇద్దరూ మౌనం వహిస్తూనే వచ్చారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం విడిపోయామనేలా హింట్స్ ఇస్తూ వచ్చారు. మహ్వశ్తో చాహల్ డేటింగ్ రూమర్లు రాగా.. తాజాగా కూడా ధనశ్రీ ఓ పోస్ట్ చేశారు. ఎప్పుడూ మహిళలనే దూషిస్తారంటూ రాసుకొచ్చారు.
సంబంధిత కథనం