



Best Web Hosting Provider In India 2024
TGPSC Group 2 Results 2025 : టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు.. ఎలా చెక్ చేసుకోవాలి.. ఇదిగో ప్రాసెస్!
TGPSC Group 2 Results 2025 : గ్రూప్-2 ఫలితాలు విడుదల చేయడానికి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. విడుదల చేసిన తర్వాత ఫలితాలు చూసుకునే క్రమంలో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధానం ద్వారా ఫలితాలను సుభంగా చూసుకోవచ్చు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 2024లో గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ పరీక్షను నిర్వహించింది. 2025 జనవరిలో ప్రైమరీ కీని విడుదల చేసింది. ప్రస్తుతం ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసింది. రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత.. అభ్యర్థులు తమ ఫలితాలను www.tspsc.gov.in లో చూసుకోవచ్చు.
ఇలా చెక్ చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేశాక.. హోమ్ పేజీలో ప్రదర్శించే గ్రూప్ 2 ఫలితాల లింక్‌ను తెరవాలి. మీ లాగిన్ వివరాలను నమోదు చేయాలి. టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టినరోజు వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత గెట్ డేడాపై క్లిక్ చేస్తే.. ఫలితాలు కనిపిస్తాయి. ఏ సమస్య ఉన్నా.. హెల్ప్ లైన్ నంబర్ 040-22445566 నంబర్‌కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
గతేడాది డిసెంబర్‌లో పరీక్షలు..
గ్రూప్-2 పరీక్ష నాలుగు సెషన్లలో జరిగింది. డిసెంబర్ 15 ఉదయం, మధ్యాహ్నం పేపర్ 1, 2.. డిసెంబర్ 16 ఉదయం, మధ్యాహ్నం పేపర్ 3, 4 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 1368 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. నాలుగు పేపర్ల ప్రాథమిక సమాధాన కీ, మాస్టర్ ప్రశ్నాపత్రాలను జనవరిలో అభ్యర్థి లాగిన్ ద్వారా విడుదల చేశారు. అభ్యంతరాల విండో జనవరి 18న ప్రారంభమై జనవరి 22న ముగిసింది.
అభ్యంతరాలకు అవకాశం..
అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆంగ్లంలో మాత్రమే సమర్పించాలని సూచించారు. వారు తమ వాదనలను ధృవీకరించే రుజువుల ఆన్‌లైన్ కాపీలను అప్‌లోడ్ చేయాల్సి వచ్చింది. రచయిత పేరు, ఎడిషన్, పేజీ నంబర్, ప్రచురణకర్త పేరు, వెబ్‌సైట్ వంటి వివరాలను సమర్పించాల్సి వచ్చింది. ఈ-మెయిల్, వ్యక్తిగత ప్రాతినిధ్యాలు లేని, గడువు మించిన తర్వాత సమర్పించిన అభ్యంతరాలను పరిగణించబోమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
టాపిక్