




Best Web Hosting Provider In India 2024

Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్ర’ పేరిట నిధుల దుర్వినియోగం ఆరోపణలు, ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
Aadudam Andhra : వైసీపీ ప్రభుత్వంలో ‘ఆడుదాం ఆంధ్ర’ భారీ స్కామ్ జరిగిందని కూటమి ఎమ్మెల్యే ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరిట నిధులు దుర్వినియోగం చేశారని వస్తున్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.

Aadudam Andhra : వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించింది. అయితే ఆడుదాం ఆంధ్ర పేరిట కోట్ల రూపాయలు దోచుకున్నారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. నిన్న అసెంబ్లీలో ఆడుదాం ఆంధ్రపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం 45 రోజుల్లో రూ.119 కోట్లు ఖర్చు చేశారన్నారు. రూ.119 కోట్లే కాదని, అంతకు మించి పెద్ద కుంభకోణం జరిగిందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని, కేవలం రూ.119 కోట్లకు సంబంధించి ‘ఆడుదాం ఆంధ్ర’ ఖర్చు మాత్రమే కాదు జిల్లా ఫండ్స్ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఖర్చు చేశారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ స్కామ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరపించాలని ఎమ్మెల్యేలు గౌతు శిరీష, భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ‘ఆడుదాం ఆంధ్ర’పై ఏపీ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏసీబీని ఆదేశించింది. ఏపీలో ఎన్నికలకు ముందు యువ ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం కోసం దాదాపు రూ.119 కోట్లను ఖర్చు చేశారు. కేవలం 45 రోజుల్లోనే రూ.119 కోట్లు ఖర్చు చేయడంపై సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు.
ఆడుదాం ఆంధ్రా పేరిట భారీగా ఖర్చు
ఏసీబీ విచారణ చేసి ‘ఆడుదాం ఆంధ్ర’లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పేరిట భారీ ఎత్తున ఖర్చు పెట్టారని, అంతే కాకుండా క్రీడాకారులను అపహాస్యం చేశారన్నారు. ఎన్నికలకు ముందు యువతను ప్రలోభపెట్టే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమానికి రెండు కోట్లు కేటాయించి, చివరి నిమిషానికి మరో మూడు కోట్లు పెంచారన్నారు.
ఈ కార్యక్రమం పేరిట పంపిణీ చేసిన కిట్లు నాసిరకంగా ఉన్నాయని, కిట్లపై ఫొటోలు వేసుకున్నారని ఎమ్మెల్యేలు గౌతు శిరీష, భూమా అఖిలప్రియ ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో కోట్లలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని శాసనసభలో సభ్యులు విమర్శించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పట్లో మంత్రిగా పనిచేసిన రోజాపై అనేక అభియోగాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్