



Best Web Hosting Provider In India 2024

Mother in Law: ఇలాంటి అలవాట్లు ఉన్న అత్త తన కోడలి జీవితాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది
అత్త, కోడళ్ల మధ్య అనుబంధం బాగుంటే ఇల్లు స్వర్గంగా మారుతుంది. బంధాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత రెండు వైపుల నుంచి ఉన్నప్పటికీ, కొన్నిసార్లు అత్తగారి కొన్ని విషపూరిత అలవాట్లు సంబంధాన్ని ఎంతగా దెబ్బతీస్తాయంటే ఇల్లు యుద్ధభూమిగా మారుతుంది.

అత్త, కోడళ్ల మధ్య సంబంధం చాలా సున్నితమైనది. ఈ రిలేషన్ షిప్ ను తెలివిగా హ్యాండిల్ చేస్తే అది ఎంతో అందంగా ఉంటుంది. అదే సమయంలో ఈ బంధం చాలా తేలికగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే వీరు గొడవపడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సిన బంధం అత్తాకోడళ్ల అనుబంధం.
పెళ్లయిన తర్వాత అత్తవారింటికి వచ్చిన అమ్మాయికి కొంచెం భయం ఉంటుంది. అలాంటప్పుడు అత్తగారి ప్రవర్తన కోడలి పట్ల సానుకూలంగా ఉంటే ఆ బంధంలో ప్రేమ చిగురించడం మొదలవుతుంది. మరోవైపు అత్తగారు విషపూరితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే ఆ బంధం రోజురోజుకూ చెడిపోవడం మొదలవుతుంది. ఈ బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరు వైపుల నుంచి ఉండాలి. కానీ కోడలు కోటి ప్రయత్నాలు చేసినా అత్తగారు ఆమెతో సరిగా ప్రవర్తించరు. అత్తగారి ప్రవర్తన వల్ల కోడలు బతకడం కష్టంగా మారడమే కాకుండా ఇంట్లో గొడవ వాతావరణం నెలకొంటుంది. అత్తల్లో ఎలాంటి లక్షణాలు లేదా అలవాట్లు ఉంటే ఆ ఇంట్లోని కోడలి జీవితం కష్టంగా మారుతుందో తెలుసుకోండి.
చిన్న విషయాలను పెద్దగా చూస్తే
మహిళలకు ఇంట్లో చిన్న చిన్న విషయాలను పెద్ద ఇష్యూ చేయడం అలవాటు. అలాంటి మహిళలు పెద్దయ్యాక కోడలిని బాధపెట్టే అత్తగా మారుతుంటారు. ఉదాహరణకు, కోడలు ఒక రోజు కొంచెం ఆలస్యంగా నిద్రలేచినా, లేదా ఆహారంలో ఎక్కువ ఉప్పు పడినా, ఆమె పిలిచినప్పుడు వెంటనే రాకపోయినా …. రాద్ధాంతం చేసే అత్తలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి అత్త కోడలిని ఊపిరాడకుండా చేస్తుంది. ఈ కారణంగా తరచూ ఇళ్లలో గొడవలు, తగాదా వాతావరణం నెలకొంటుందన్నారు.
ప్రతిచోటా తమ మాటే నెగ్గాలని
కొందరు అత్తలు ప్రతి చోటా తమ మాటే నెగ్గాలని అనుకుంటారు. తమ అభిప్రాయాలకు మాత్రమే విలువ ఇస్తారు. వంట చేసినా, పిల్లల్ని పెంచినా.. అన్నింట్లోనూ తామే ప్రధాన ప్రాత్ర వహించాలని కోరుకుంటారు. కోడలి పాలిట హిట్లర్ లా మారిపోతారు అలాంటి అత్తలు. కోడలు ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా వారే డిసైడ్ చేస్తారు. అలాంటి అత్తలు కొడుకు, కోడళ్ల సంబంధంలో జోక్యం చేసుకోవడం మొదలుపెడతారు. ప్రపంచంలోని ప్రతిదీ తమకు తెలుసని అనుకుంటారు. ఇలాంటి వారి వల్ల కోడలి జీవితం నరకంగా మారిపోతుంది.
ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్నిస్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కొందరు పాతకాలపు మహిళలు ఇంటిని తామే శాసించాలనుకుంటారు. కోడలు వచ్చిన తర్వాత కూడా ఆమె సర్దుకుపోయేందుకు ఇష్టపడదు.అలాంటి అత్త ప్రవర్తన ఇంటిని యుద్ధభూమిగా మారుస్తుంది.
కోడలు ఇంటికి వస్తే ప్రతి పని బాధ్యత తనదేనని కొందరు అత్తలు భావిస్తుంటారు. అలాంటి మహిళలు ఏ పనిలోనూ కోడలికి సపోర్ట్ చేయరు. కోడలికి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఏదో ఒక సాకుతో వెనకడుగు వేస్తారు. అదే సమయంలో సొంత కూతురికి మాత్రం పూర్తి మద్దతు ఇస్తుంది. అత్తగారి ఈ స్వభావం కూడా ఆమె విషపూరిత బుద్ధిని చూపిస్తుంది. ఇది క్రమంగా కోడలు, అత్తగారి మధ్య సంబంధాన్ని దెబ్బతీస్తుంది.
కోడలు ముందు మంచిగా మాట్లాడుతూ… ఆమె వెనుక గోతులు తీసే అత్తలు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారితో జీవించడం ఆ కోడలికి చాలా కష్టం. ఇలాంటి మోసపూరిత స్వభావం ఉన్న అత్తగారిని గుర్తించకపోతే కోడలికి తీవ్ర నష్టం జరగవచ్చు. ఇలాంటి అత్తలు కొడుకు, కోడలు మధ్య గొడవ పెట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
సంబంధిత కథనం
టాపిక్