






Best Web Hosting Provider In India 2024

Comedy OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోన్న తమిళ్ రొమాంటిక్ కామెడీ మూవీ – తెలుగులోనూ స్ట్రీమింగ్?
Comedy OTT: తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ 2కే లవ్‌స్టోరీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 14 నుంచి ఆహా తమిళ్ ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ కోలీవుడ్ మూవీలో జగ్‌వీర్, మీనాక్షి గోవింద రాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు.

Comedy OTT: తమిళ మూవీ 2కే లవ్‌స్టోరీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 14న ఆహా తమిళ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో 2కే లవ్‌స్టోరీ మూవీ రిలీజ్ అవుతోంది. ఆహా తమిళ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వాలెంటైన్స్ డే రోజున…
ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో జగవీర్, మీనాక్షి గోవిందరాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. బాలా శరవణన్, ఆంటోనీ భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. 2కే లవ్‌స్టోరీ మూవీకి సుసీంద్రన్ దర్శకత్వం వహించాడు. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
మోడ్రన్ డే ఫ్రెండ్‌షిప్స్, రిలేషన్స్ ఎలా ఉంటున్నాయన్నది బోల్డ్ పంథాలో వినోదాన్ని జోడించి 2కే లవ్‌స్టోరీలో చూపించాడు దర్శకుడు సుసీంద్రన్.
2కే లవ్‌స్టోరీ కథ ఇదే…
కార్తీక్, మోనిక చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. చాలా ఏళ్లుగా వారి స్నేహం కొనసాగుతూ ఉంటుంది. వారి స్నేహబంధంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి? లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్‌గానే కొనసాగాలని అనుకున్న వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నదే ఈ మూవీ కథ.
కోటిలోపే వసూళ్లు…
కామెడీ వర్కవుట్ అయినా కథలో బలం లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. థియేటర్లలో కోటి లోపే వసూళ్లను రాబట్టింది. 2కే లవ్‌స్టోరీలో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి గోవింద రాజన్ గతంలో తమిళంలో కోబ్రా, డీమాంటే కాలనీ 2తో పాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.
తెలుగులో…
2కే లవ్‌స్టోరీ డైరెక్టర్ సుసీంద్రన్ తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశాడు. వెన్నెల కబడ్డీ కుజు మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు సుసీంద్రన్. ఈ మూవీ తెలుగులో భీమిలీ కబడ్డీ జట్టు పేరుతో రీమేక్ అయ్యింది. తమిళంలో జీవా, పాయుమ్ పులి, కెనెడీ క్లబ్, ఈశ్వరన్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. కేరాఫ్ సూర్య, శివుడు పేరుతో తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాలు చేశాడు. శింబు, విశాల్, జై వంటి యాక్టర్స్‌తో సినిమాలు చేశాడు. కానీ కమర్షియల్‌గా మాత్రం సుసీంద్రన్‌కు పెద్దగా విజయాలు దక్కలేదు.
సంబంధిత కథనం