




Best Web Hosting Provider In India 2024
Most polluted cities: కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్‌గా ఇండియా! టాప్ 20 నగరాల్లో 13 మన దేశంలోనే..
Most polluted cities : ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధాని నగరంగా ఢిల్లీ నిలవగా, 2023లో మూడో స్థానంలో ఉన్న భారత్ 2024 నాటికి ఐదో స్థానానికి పడిపోయింది.

భారత దేశంలో పెరిగిపోతున్న కాలుష్యంపై బయటకు వస్తున్న నివేదికలు సర్వత్రా ఆందోళనలు పెంచుతున్నాయ. దాదాపు ప్రతి రిపోర్టులో భారత దేశ పరిస్థితి అద్వానంగా ఉండటం గమనార్హం. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQAIR ప్రకారం ప్రపంచంలోని టాప్ 20 కలుషిత నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నాయి!
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024
ఐక్యూఎయిర్ రూపొందించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం అసోంలోని బైర్నిహాట్.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య రాజధాని నగరంగా దిల్లీ నిలిచింది.
నివేదిక ప్రకారం.. 2024 సగటున 50.6 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ చొప్పు పీఎం2.5 కాన్సెట్రషన్ 7శాతం పడింది. 2023లో ఇది 54.4 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్‌గా ఉండేది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో టాప్ 10 కాలుష్య నగరాల్లో 6 ఇండియాలోనే ఉన్నాయి.
దిల్లీలో స్థిరంగా అధిక కాలుష్య స్థాయిలు నమోదయ్యాయి. వార్షిక సగటు పీఎం 2.5 కాన్సెట్రేషన్ క్యూబిక్ మీటరుకు 91.6 మైక్రోగ్రాములు! ఇది 2023లో క్యూబిక్ మీటర్‌కి 92.7 మైక్రోగ్రాముల నుంచి పెద్దగా మారలేదు.
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత కాలుష్య నగరాల్లో అసోంలోని బైర్నిహాట్, దిల్లీ, న్యూ దిల్లీ, పంజాబ్‌లోని ముల్లన్పూర్, ఫరీదాబాద్, లోని, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నోయిడా ఉన్నాయి.
మొత్తం మీద చూసుకుంటే.. కాలుష్య ర్యాంకింగ్స్ లో భారత్ ఐదో స్థానంలో ఉండగా, చాద్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలు ముందు స్థానాల్లో ఉన్నాయి.
మొత్తం మీద 35 శాతం భారతీయ నగరాలు.. వార్షిక పీఎం 2.5 స్థాయిలను క్యూబిక్ మీటర్‌కి 5 మైక్రోగ్రాముల డబ్ల్యూహెచ్ఓ పరిమితికి 10 రెట్లు ఎక్కువగా నివేదించాయి!
భారతదేశంలో వాయు కాలుష్య ప్రమాదాలు..
వాయు కాలుష్యం భారతదేశంలో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదంగా ఉంది. ఆయుర్దాయాన్ని ఇది 5.2 సంవత్సరాలు తగ్గిస్తుంది. గత సంవత్సరం ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారంయ.. 2009 నుంచి 2019 వరకు భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ల మరణాలు కాలుష్యంతో ముడిపడి ఉన్నాయి. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనం ఈ గణాంకాలను వెల్లడించింది.
పీఎం 2.5 అనేది 2.5 మైక్రాన్ల కంటే చిన్న వాయు కాలుష్య కణాలను సూచిస్తుంది. ఇది ఊపిరితిత్తులు, రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. ఇది శ్వాస సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్‌కి దారితీస్తుంది. వాహనాల ఎగ్జాస్ట్, పారిశ్రామిక ఉద్గారాలు, కలప లేదా పంట వ్యర్థాలను కాల్చడం వంటివి మూలాలలో ఉన్నాయి.
డబ్ల్యూహెచ్ఓ మాజీ చీఫ్ సైంటిస్ట్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాదారు సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. వాయు నాణ్యత డేటా సేకరణలో భారత్ పురోగతి సాధించిందని, కానీ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు లేవని అన్నారు.
“మన దగ్గర డేటా ఉంది. ఇప్పుడు చర్యలు అవసరం. బయోమాస్‌ను ఎల్పీజీతో భర్తీ చేయడం వంటి కొన్ని పరిష్కారాలు సులభం. దీని కోసం భారతదేశంలో ఇప్పటికే ఒక పథకం ఉంది. కానీ అదనపు సిలిండర్లకు మరింత సబ్సిడీ ఇవ్వాలి. మొదటి సిలిండర్ ఉచితంగా ఇవ్వాలి. నిరుపేద కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు అధిక సబ్సిడీలను పొందాలి. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బహిరంగ వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది,” అని స్వామినాథన్ చెప్పారు.
ప్రజారవాణాను విస్తరించాలని, నగరాల్లో రూల్స్‌ని అతక్రిమిస్తున్న కార్లకు జరిమానాలు విధించాలని స్వామినాథన్ కోరారు. ప్రోత్సాహకాలు, పెనాల్టీల కలయిక అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
“అంతిమంగా ఉద్గార చట్టాలను కఠినంగా అమలు చేయడం చాలా ముఖ్యం. పరిశ్రమలు, నిర్మాణ స్థలాలు నిబంధనలను పాటించాలని, షార్ట్కట్లు తీసుకోకుండా ఉద్గారాలను తగ్గించే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి,” అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link