





Best Web Hosting Provider In India 2024
Water diet : షాకింగ్! 6 నెలల పాటు మంచి నీరే ఆహారంగా తీసుకున్న యువతి మృతి
Water diet : కేరళలో షాకింగ్ ఘటన జరిగింది! ఓ యువతి, బరువు పెరుగుతానన్న భయంతో దాదాపు 6 నెలల పాటు మంచి నీరు తప్ప మరొకటి ముట్టుకోలేదు. చివరికి 24కేజీల బరువుతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలు విడిచింది.

కేరళలో షాకింగ్, హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది! దాదాపు 6 నెలల పాటు మంచి నీరే ఆహారంగా తీసుకుని బతికిన ఒక 18ఏళ్ల యువతి, చివరికి ప్రాణాలు కోల్పోయింది. మరణం సమయంలో ఆమె బరువు కేవలం 24కేజీలు! అసలేం జరిగిందంటే..
బరువు పెరుగుతానన్న భయంతో..
కేరళలోని థలస్సెరిలో జరిగింది ఈ ఘటన. యువతి పేరు శ్రీనంద. బరువు పెరుగుతానన్న భయం ఆమెకు ఎప్పుడూ ఉండేది. ఫలితంగా ఆన్లైన్లో వెయిట్‌లాస్ టిప్స్ వెతికేది. చివరికి వేడి నీటి డైట్ గురించి తెలుసుకుంది. అప్పటి నుంచి కేవలం నీరు తాగుతూ జీవిస్తోంది.
ఈ వాటర్ డైట్ కారణంగా శ్రీ నంద గత 5,6 నెలలుగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. కుటుంబసభ్యులు ఆమెను 6 నెలల క్రితం వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆమెకు సరైన భోజనం పెట్టాలని సూచించారు. అంతేకాదు, ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు.
ఈ తరహా కండీషన్‌ని “అనొరెక్సియా” అంటారు. ఇదొక ఈటింగ్ డిసార్డర్ మాత్రమే కాదు, సైకలాజికల్ కండీషన్ కూడా! బరువు పెరిగినా, పెరగపోయినా.. చాలా మంది వెయిట్ గురించి భయపడుతుంటారు. సన్నగా ఉన్న వారు కూడా పదేపదే వెయిట్ గురించి ఆలోచిస్తూ, తినడం మానేస్తారు. శ్రనంద విషయంలోనూ ఇదే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆరోగ్య క్షీణిస్తుంది. ప్రాణాపాయం కూడా ఉంది. రికవరీ కూడా అవ్వొచ్చు కానీ చాలా సమయం పడుతుంది.
కుటుంబసభ్యులు ఆమెకు భోజనం పెట్టేవారు. కానీ భోజనాన్ని ఆమె పడేసేది. కేవలం మంచి నీరు తాగుతూ బతికింది.
రెండు నెలల క్రితం శ్రీనందను కొజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అప్పుడు కూడా, యువతికి భోజనం సరిగ్గా పెట్టాలని, సైకియాట్రిస్ట్‌ని సంప్రదించాలని సూచించారు.
కానీ ఫలితం దక్కలేదు. బరువు పెరుగతానన్న భయంతో ఆ యువతి మంచి నీరు తప్ప మరేదీ ముట్టుకోలేదు.
చివరికి కొన్ని రోజుల క్రితం శ్రీనంద ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమెను థలస్సెరిలోని కోఆపరేటివ్ హాస్పిటల్లో చేర్పించారు. వెళుతూనే ఆమె కండీషన్‌ని చూసి ఐసీయూకి షిఫ్ట్ చేశారు వైద్యులు.
“ఆమె బరువు 24 కేజీలు. మంచానికే పరిమితమైంది. షుగర్ లెవల్స్, సోడియం, బీపీ అన్ని చాలా తక్కువగా ఉన్నాయి. చికిత్స ఇచ్చినా ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయింది,” అని వైద్యులు చెప్పారు.
ఈ అనొరెక్సియా బాధితుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది! సెలబ్రెటీల నుంచి సాధారణ పౌరుల వరకు చాలా మంది వెయిట్ గురించి భయపడుతూ, అసలేం తినకుండా ఉండిపోతారు. చివరికి ఆరోగ్యం క్షిణిస్తుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link