UP rape case : రంజాన్​ వేళ శృంగారానికి పార్ట్​నర్లు నో చెప్పారు! నెల రోజులు ఆగలేక- 13ఏళ్ల బాలుడిని రేప్​..

Best Web Hosting Provider In India 2024


UP rape case : రంజాన్​ వేళ శృంగారానికి పార్ట్​నర్లు నో చెప్పారు! నెల రోజులు ఆగలేక- 13ఏళ్ల బాలుడిని రేప్​..

Sharath Chitturi HT Telugu
Published Mar 10, 2025 05:39 AM IST

UP crime news : యూపీలో దారుణ ఘటన జరిగింది. శృంగారానికి తమ పార్ట్​నర్లు నో చెప్పారన్న కారణంగా ఇద్దరు వ్యక్తులు, ఓ 13ఏళ్ల బాలుడిని రేప్​ చేశారు. అనంతరం అతడిని చంపేశారు!

యూపీలో దారుణం..
యూపీలో దారుణం..

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ 13ఏళ్ల బాలుడిపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడిని చంపేశారు. పవిత్ర రంజాన్​ వేళ తమ తమ పార్ట్​నర్లు శృంగారానికి ఒప్పుకోకపోవడంతో ఆ ఇద్దరు పురుషులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

అసలేం జరిగిందంటే..

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లో ఈ నెల మొదట్లో జరిగింది ఈ ఘటన. బాధితుడు స్థానిక జిమ్​కు వెళ్తుండగా నిందితులు అతనిపై దాడి చేశారు. అజహర్, హుస్సేనీలు అతడిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి తాడుతో కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు.

కాగా ఈ విషయాన్ని హెచ్​టీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

అనంతరం నిందితులు.. తాడుతో బాధితుడి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశారు.

పోలీసులు హుస్సేనీని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

మతపరమైన కట్టుబాట్ల కారణంగా తమ భాగస్వాములు తమతో శృంగారం చేయడానికి నిరాకరించారని, అందుకే ఈ పని చేశామని నిందితుడు పోలీసులకు చెప్పాడు.

“రంజాన్ సందర్భంగా నాతో శృంగారం చేయడానికి నా గర్ల్​ఫ్రెండ్ నిరాకరించింది. అజ్జుతో శృంగారం చేయడానికి అతని భార్య నిరాకరించారు. రంజాన్ ముగిసే వరకు నెల రోజుల పాటు వీరిద్దరూ మాతో శృంగారంలో పాల్గొనకపోతే ఏం చేద్దాం అని ఆలోచించాం. దీంతో 13 ఏళ్ల బాలుడిపై కన్నేశాం,” అని హుస్సేనీ పోలీసులకు తెలిపారు.

మార్చ్​ 5న మైనర్ కనిపించకుండా పోయాడు.

అతని కోసం వెతుకుతున్న కుటుంబసభ్యుల్లో ఒకరికి10 లక్షలు ఇవ్వాలని మెసేజ్ వచ్చింది.

ఘటన జరిగిన సమయంలో హుస్సేనీ కనిపించడం లేదని బాధిత కుటుంబం పోలీసులకు తెలిపింది. పోలీసులు అతడిని విచారించగా నేరం అంగీకరించాడు.

మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మహిళను చంపేసి..

యూపీలో నేరారు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రియురాలిని శిరచ్ఛేదం చేసిన వ్యక్తిని యూపీలోని బహ్​రైచ్ పోలీసులు అరెస్టు చేశారు.

శుక్రవారం జగన్నాథ్​పూర్ గ్రామ సమీపంలో తలలేని మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమెను 26 ఏళ్ల మహిళగా గుర్తించామని, వివాహానంతరం ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) దుర్గా ప్రసాద్ తివారీ తెలిపారు.

స్టేట్​మెంట్​ ఇచ్చేందుకు వెళ్లిన మహిళపై అత్యాచారం.. కుమారుడి ముందే!

రాజస్థాన్​లో దారుణ ఘటన జరిగింది. తనను కొట్టిన పక్కింటి వ్యక్తిపై స్టేట్​మెంట్​ నమోదు చేయడానికి వెళ్లిన 32 ఏళ్ల గర్భిణిపై సంగనేర్ పోలీస్ స్టేషన్​కి చెందిన కానిస్టేబుల్, ఆమె మైనర్ కుమారుడి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఓ మహిళను ఆమె పొరుగుంటి వారు కొట్టారు. ఈ విషయంపై శనివారం ఆమె పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు ఉదయం సంగెనర్​ పోలీస్​ స్టేషన్​కి చెందిన కానిస్టేబుల్​ రామ్ ఆమె ఇంటికి వెళ్లాడు. స్టేట్​మెంట్​ రికార్డ్​ చేయాలని రమ్మని చెప్పాడు. కానీ పోలీస్​ స్టేషన్​కి బదులు ఆమెను, ఆమె 3ఏళ్ల కుమారుడిని హోటల్​కి తీసుకెళ్లాడు. ఆమెను రాత్రివరకు బంధించి.. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ మహిళ ఉన్నతాధికారులను సంప్రదించడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఘటనపై విచారణ చేపట్టినట్టు పోలీసులు చెప్పారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link